అధ్యాయం 1
మంచి ఉపోద్ఘాతం
అపొస్తలుల కార్యాలు 17:22
ఏమి చేయాలి? మీ ఉపోద్ఘాతం లేదా పరిచయ మాటలు ఆసక్తి కలిగించాలి. అలాగే, మీరు ఏమి చెప్పబోతున్నారో, దాన్ని ఎందుకు తెలుసుకోవాలో వినేవాళ్లకు వెంటనే అర్థమయ్యేలా ఉపోద్ఘాతం ఉండాలి.
ఎలా చేయాలి?
-
ఆసక్తి కలిగించండి. వినేవాళ్లకు ఆసక్తి కలిగించే ఒక ప్రశ్న గానీ, వాక్యం గానీ, నిజంగా జరిగిన అనుభవం గానీ, వార్త గానీ ఎంచుకోండి.
-
మీరు ఏమి చెప్తున్నారో అర్థమయ్యేలా చూసుకోండి. మీ ఉపోద్ఘాతం వినగానే మీరు ఏమి చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో వినేవాళ్లకు వెంటనే అర్థమవ్వాలి.
-
మీరు చెప్తున్న విషయం ఎందుకు ప్రాముఖ్యమో చూపించండి. వినేవాళ్ల అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడండి. మీరు చెప్తున్న విషయం వాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో వాళ్లకు బాగా అర్థమవ్వాలి.