3
మా అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడాలి?
మీరు ఏం చేస్తారు?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: అది బుధవారం సాయంత్రం. 17 ఏళ్ల జెఫ్రీ, తన పనులన్నీ చేసేసుకుని, ఇక హాయిగా రిలాక్స్ అవుదామనుకున్నాడు. తనకిష్టమైన కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నాడు.
అంతలోనే, వాళ్ల నాన్న అక్కడికి వచ్చాడు. సీరియస్‌గా ఇలా అన్నాడు.
“జెఫ్రీ! అలా టీవీ చూస్తూ టైం వృథా చేయకపోతే, మీ తమ్ముడికి హోంవర్క్‌లో సహాయం చేయొచ్చుగా? అసలు ఎప్పుడూ చెప్పిన మాట వినవు!”
“మళ్లీ మొదలుపెట్టారా” అని జెఫ్రీ సణిగాడు, వాళ్ల నాన్నకు వినబడేలా.
“ఏమన్నావ్” అని వాళ్ల నాన్న కోపంగా అన్నాడు.
అప్పుడు జెఫ్రీ విసుగ్గా, “ఏం లేదులే” అన్నాడు.
వాళ్ల నాన్నకు ఇంకా కోపం వచ్చింది. “ఇంకోసారి నాకు ఎదురుచెప్పావో ...” అని గట్టిగా అరిశాడు.
జెఫ్రీ స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?
ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!
మీ అమ్మానాన్నలతో మాట్లాడడం ఓ కారు నడపడం లాంటిది. దారిలో ఏదైనా అడ్డొస్తే, మీరు వేరే దారిలో వెళ్లవచ్చు.
ఉదాహరణకు:
లేయా అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “మా డాడీతో మాట్లాడడం చాలా కష్టమనిపిస్తుంది. కొన్నిసార్లయితే, నేను మాట్లాడిన కాసేపటి తర్వాత, ‘సారీ, నువ్వు మాట్లాడుతుంది నాతోనేనా?’ అని అడిగేవాడు.”
లేయా ముందు, మూడు ఆప్షన్స్ ఉన్నాయి.
-
వాళ్ల డాడీ మీద అరవడం.
“డాడీ, ఇది చాలా ముఖ్యమైన విషయం! కాస్త వింటారా” అని లేయా అరుస్తుంది.
-
వాళ్ల డాడీతో మాట్లాడకుండా వెళ్లిపోవడం.
లేయా తన సమస్య గురించి వాళ్ల డాడీకి చెప్పడం మానేస్తుంది.
-
మంచి సమయం చూసి, ఆ విషయం గురించి మళ్లీ మాట్లాడడం.
లేయా మంచి సమయం చూసి వాళ్ల డాడీతో మాట్లాడుతుంది, లేదా తన సమస్య గురించి ఓ పేపర్ మీద రాసి, వాళ్ల డాడీకి ఇస్తుంది.
లేయా ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది?
ఆలోచించండి: లేయావాళ్ల డాడీ ఏదో పనిలో ఉన్నాడు. కాబట్టి ఆమెకున్న సమస్యేంటో ఆయనకు తెలీదు. ఒకవేళ లేయా ఆప్షన్ A ఎంచుకుని వాళ్ల డాడీ మీద అరిస్తే, ఏం ఉపయోగం ఉండదు. అలా చేస్తే, ఆయన ఆమె చెప్పేది వినడానికి ఇష్టపడకపోవచ్చు. అంతేకాదు, అలా అరవడం వల్ల ఆమెకు ఆయన మీద గౌరవం లేనట్లు అవుతుంది. (ఎఫెసీయులు 6:2) కాబట్టి, ఆప్షన్ A వల్ల ఇద్దరికీ ఉపయోగం లేదు.
ఆప్షన్ Bని పాటించడం తేలిగ్గా ఉండవచ్చు. కానీ అది తెలివైన పని కాదు. ఎందుకు? ఎందుకంటే సమస్య పరిష్కారం అవ్వాలంటే లేయా, వాళ్ల డాడీతో మాట్లాడాలి. ఆమెకున్న సమస్యేంటో వాళ్ల డాడీకి తెలిస్తేనే ఆయన సహాయం చేయగలడు. లేయా మౌనంగా ఉంటే, అవేవీ కుదరవు.
ఇక ఆప్షన్ C విషయానికొస్తే, ఆటంకం ఎదురైంది కదా అని ఆమె వాళ్ల డాడీతో మాట్లాడడం మానేయదు. బదులుగా, వేరే సమయంలో ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. తన సమస్యేంటో కనీసం పేపర్ మీద రాసి వాళ్ల డాడీకి ఇచ్చినా, ఆమె మనసు కుదుటపడుతుంది.
పేపర్ మీద రాయడం వల్ల, అసలు తాను ఏం చెప్పాలనుకుంటుందో ఆమె చక్కగా వివరించగలుగుతుంది. దాన్ని చదివాక, ఆమెకున్న సమస్యేంటో వాళ్ల డాడీ అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి ఆప్షన్ C వల్ల వాళ్లిద్దరూ ప్రయోజనం పొందుతారు. నేరుగా మాట్లాడినా, లేక పేపర్ మీద రాసిచ్చినా ఈ బైబిలు సలహాను పాటిస్తున్నట్లే: ‘సమాధానాన్ని కలుగజేసేవాటినే ఆసక్తితో అనుసరిద్దాం.’—రోమీయులు 14:19.
లేయా ఇంకా ఏం చేయవచ్చు?
లేయా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో ఇక్కడ రాయండి. అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు రావచ్చో కూడా రాయండి.
అర్థం చేసుకునేలా మాట్లాడండి, అపార్థం చేసుకునేలా కాదు
మీరు అన్న మాటలు, మీ అమ్మానాన్నలకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
ఉదాహరణకు:
“డల్‌గా ఉన్నావేంటి” అని మీ అమ్మానాన్నలు మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు మీరు ఇలా అంటారు, “దానిగురించి మాట్లాడడం నాకు ఇష్టంలేదు.”
కానీ మీ మాటలు మీ అమ్మానాన్నలకు ఇలా అర్థమవ్వవచ్చు: “మీమీద నాకు నమ్మకం లేదు. నా సమస్యేంటో నా ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటా, మీకు కాదు.”
మీరు ఓ సమస్యతో సతమతమౌతున్నారు అనుకోండి. మీ అమ్మానాన్నలు మీకు సహాయం చేస్తామంటున్నారు. కానీ మీరు, “కంగారుపడకండి. నాది నేను చూసుకోగలను” అని అంటారు.
-
అది మీ అమ్మానాన్నలకు ఇలా అర్థమవ్వవచ్చు:
-
కాబట్టి మీరు ఏం అనివుంటే బాగుండేది?