ఈ బ్రొషూరును ఉపయోగించే విధానం
ఈ బ్రొషూరును ఉపయోగించే విధానం
ఈ బ్రొషూరు బైబిలు పఠన కోర్సుగా రూపొందించబడింది. దాన్ని ఎలా ఉపయోగించాలి? మేము ఈ క్రింది కార్యక్రమాన్ని సూచిస్తున్నాము: ప్రతి పాఠం ఆరంభంలోను ప్రశ్నలున్నాయి. ప్రతి ప్రశ్న తర్వాత బ్రాకెట్లలో, వాటికి సమాధానాలు ఉన్న పేరాల సంఖ్యను మీరు కనుగొంటారు. మొదటి ప్రశ్న నుండి చదవడం మొదలు పెట్టండి. వాటి గురించి ఆలోచించండి. తర్వాత ప్రతి పేరాను చదువుతూ, మీ బైబిలులో లేఖనాలను చూడండి. మీరు ఒక పాఠాన్ని ముగించిన తర్వాత, తిరిగి ప్రశ్నల దగ్గరికి వెళ్లి, ప్రతి ప్రశ్నకు బైబిలు సమాధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మొత్తం బ్రొషూరును ముగించిన తర్వాత, వెనక్కి వెళ్లి ప్రశ్నలన్నిటినీ పునఃపరిశీలించండి.
ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు, పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తివ్రాయబడినవి లేఖనము ఎత్తివ్రాయబడినచోట NW అని చూపబడినట్లయిన, అది ఆధునిక ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము—రిఫరెన్సులతో నుండి తర్జుమా చేయబడినదని సూచిస్తుంది