దేవుడు ద్వేషించే అలవాట్లు
పాఠం 10
దేవుడు ద్వేషించే అలవాట్లు
దేవుడు చెడ్డవని చెప్పే విషయాల గురించి మీరు ఎలా భావించాలి? (1)
ఎలాంటి లైంగిక క్రియలు తప్పు? (2)
క్రైస్తవులు అబద్ధం చెప్పడం, (3) జూదమాడడం, (3) దొంగిలించడం, (3) దౌర్జన్యం, (4) అభిచారం, (5) త్రాగుబోతుతనం, (6) అనే వాటిని ఎలా దృష్టించాలి?
చెడు అలవాట్ల నుండి ఒక వ్యక్తి ఎలా స్వతంత్రుడు కాగలడు? (7)
1. దేవుని సేవకులు మంచిని ప్రేమిస్తారు. కాని చెడును ద్వేషించడం కూడా వారు నేర్చుకోవాలి. (కీర్తన 97:10) అంటే దేవుడు ద్వేషించే కొన్ని అలవాట్లను విసర్జించడమని దాని భావం. ఆ అలవాట్లలో కొన్ని ఏమిటి?
2. వ్యభిచారం: వివాహానికి ముందే లైంగిక సంబంధం, జారత్వం, మృగసంయోగం, రక్తసంబంధుల మధ్య లైంగిక దురాచారం, సలింగ సంయోగం ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన గంభీర పాపాలే. (లేవీయకాండము 18:6; రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:9, 10) ఒక జంట వివాహం కాకుండానే కలిసి జీవిస్తుంటే, వాళ్లు విడిపోవాలి లేదా చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలి.—హెబ్రీయులు 13:4.
3. అబద్ధమాడడం, జూదమాడడం, దొంగతనం చేయడం: యెహోవా దేవుడు అబద్ధమాడనేరడు. (తీతు 1:2) ఆయన అంగీకారం కావాలనుకునే వ్యక్తులు అబద్ధమాడకూడదు. (సామెతలు 6:16-19; కొలొస్సయులు 3:9, 10) ప్రతి విధమైన జూదం దురాశతో కూడినదే. కాబట్టి క్రైస్తవులు లాటరీలు, గుర్రప్పందాలు, బింగో వంటి ఏ విధమైన జూదంలోనూ పాల్గొనరు. (ఎఫెసీయులు 5:3-5) క్రైస్తవులు దొంగతనం చేయరు. వాళ్లు తెలిసీ దొంగ సొమ్ము కొనరు లేక అనుమతి లేకుండా వస్తువులు తీసుకోరు.—నిర్గమకాండము 20:15; ఎఫెసీయులు 4:28.
4. కోపోద్రేకం, దౌర్జన్యం: అదుపులేని కోపం హింసాయుత చర్యలకు నడిపిస్తుంది. (ఆదికాండము 4:5-8) హింసాప్రవృత్తిగల వ్యక్తి దేవుని స్నేహితునిగా ఉండలేడు. (కీర్తన 11:5; సామెతలు 22:24, 25) పగతీర్చుకోవడం లేక ఇతరులు మన ఎడల చేసిన చెడుకార్యాలను బట్టి వారికి తిరిగి హాని చేయడం తప్పు.—సామెతలు 24:29; రోమీయులు 12:17-21.
5. మంత్రతంత్రాలు మరియు అభిచారం: రోగాలను బాగుచేయడానికి కొంతమంది ప్రజలు దుష్టాత్మల శక్తి కొరకు వెదుకుతారు. ఇతరులు తమ శత్రువులను రోగగ్రస్తులను చేయడానికి లేక వారిని చంపడానికి వారిపై మంత్రాలు ప్రయోగిస్తారు. ఈ క్రియలన్నిటి వెనుకనున్న శక్తి సాతానే. కాబట్టి క్రైస్తవులు అలాంటి దేనిలోనూ భాగం వహించకూడదు. (ద్వితీయోపదేశకాండము 18:9-13) యెహోవాకు సన్నిహితంగా ఉండడం ఇతరులు మనపై ప్రయోగించే మంత్రాల నుండి మంచి భద్రతగా ఉంటుంది.—సామెతలు 18:10.
6. త్రాగుబోతుతనం: కొంచెం ద్రాక్షారసం, బీరు లేక ఇతర మద్యపానీయాలు సేవించడం తప్పేమీకాదు. (కీర్తన 104:15; 1 తిమోతి 5:23) కాని విపరీతంగా త్రాగడం, త్రాగుబోతుతనం దేవుని దృష్టిలో తప్పు. (1 కొరింథీయులు 5:11-13; 1 తిమోతి 3:8) విపరీతంగా త్రాగడం మీ ఆరోగ్యాన్ని పాడుచేసి, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయగలదు. అంతేగాక అది, మీరు ఇతర శోధనలకు ఎంతో త్వరగా లొంగిపోయేలా కూడా చేయగలదు.—సామెతలు 23:20, 21, 29-35.
7. దేవుడు చెడ్డవని చెప్పేవాటిని చేసే వారు ‘దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.’ (గలతీయులు 5:19-21) మీరు నిజంగా దేవుని ప్రేమిస్తూ, ఆయనను ప్రీతిపర్చాలనుకుంటే మీరు ఈ అలవాట్ల నుండి దూరం కావచ్చు. (1 యోహాను 5:3) దేవుడు చెడ్డవని చెప్పేవాటిని ద్వేషించడం నేర్చుకోండి. (రోమీయులు 12:9) దైవిక అలవాట్లున్న ప్రజలతో సహవసించండి. (సామెతలు 13:20) పరిణతి చెందిన క్రైస్తవ సహవాసులు సహాయానికి మూలంగా ఉండగలరు. (యాకోబు 5:14) అన్నిటికిపైగా, ప్రార్థన ద్వారా దేవుడిచ్చే సహాయంపై ఆధారపడండి.—ఫిలిప్పీయులు 4:6, 7, 13.
[20వ పేజీలోని చిత్రం]
దేవుడు త్రాగుబోతుతనాన్ని, దొంగతనాన్ని, జూదాన్ని, హింసాయుత చర్యలను ద్వేషిస్తాడు