ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
పాఠం 7
ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
క్రమంగా ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం? (1)
మనం ఎవరికి, ఎలా ప్రార్థించాలి? (2, 3)
ప్రార్థనకు తగిన అంశాలు ఏవి? (4)
మీరు ఎప్పుడు ప్రార్థించాలి? (5, 6)
అన్ని ప్రార్థనలనూ దేవుడు వింటాడా? (7)
1. ప్రార్థన అంటే దేవునితో దీనంగా మాట్లాడడం. మీరు దేవునికి క్రమంగా ప్రార్థించాలి. తద్వారా మీరు ప్రియమైన స్నేహితునికి చేరువైనట్లు ఆయనకు చేరువ కావచ్చు. యెహోవా ఎంతో గొప్పవాడు, శక్తిమంతుడు, అయినప్పటికీ ఆయన మన ప్రార్థనలు వింటాడు! మీరు దేవునికి క్రమంగా ప్రార్థిస్తారా?—కీర్తన 65:2; 1 థెస్సలొనీకయులు 5:17.
2. ప్రార్థన మన ఆరాధనలో ఒక భాగం. కాబట్టి, మనం దేవుడైన యెహోవాకు మాత్రమే ప్రార్థించాలి. యేసు భూమిపై ఉన్నప్పుడు, ఆయన ఎల్లప్పుడూ మత్తయి 4:10; 6:9) అయితే, మన ప్రార్థనలన్నీ యేసు నామమున చేయబడాలి. మనం యేసు స్థానాన్ని గౌరవిస్తామని, ఆయన విమోచన క్రయధన బలియందు మనకు విశ్వాసం ఉందని ఇది చూపిస్తుంది.—యోహాను 14:6; 1 యోహాను 2:1, 2.
తన తండ్రికే ప్రార్థించాడు గాని మరెవరికీ కాదు. మనమూ అలాగే చేయాలి. (3. మనం ప్రార్థించేటప్పుడు దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడాలి. మనం కంఠస్థం చేసిన ప్రార్థనలు చేయకూడదు లేక ప్రార్థనల పుస్తకం నుండి వాటిని చదవకూడదు. (మత్తయి 6:7, 8) గౌరవప్రదమైన ఏ భంగిమలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా మనం ప్రార్థించవచ్చు. మన హృదయంలోనే నిశ్శబ్దంగా చేసే ప్రార్థనలను కూడా దేవుడు వినగలడు. (1 సమూయేలు 1:12, 13) మన వ్యక్తిగత ప్రార్థనల కొరకు ఇతర ప్రజలనుండి దూరంగా, ప్రశాంతంగా ఉండే స్థలాన్ని వెతుక్కోవడం మంచిది.—మార్కు 1:35.
4. మీరు ఏ అంశాల గురించి ప్రార్థించవచ్చు? ఆయనతో మీకున్న స్నేహాన్ని ప్రభావితం చేయగల ఏవిషయాన్ని గూర్చియైనా సరే ప్రార్థించవచ్చు. (ఫిలిప్పీయులు 4:6, 7) మనం యెహోవా నామం గురించి, సంకల్పం గురించి ప్రార్థించాలని మాదిరి ప్రార్థన చూపిస్తుంది. మన వస్తుసంబంధ అవసరతలు తీర్చమని, మన పాపాలను క్షమించమని, శోధనలను సహించేందుకు సహాయం చేయమని కూడా మనం ప్రార్థించవచ్చు. (మత్తయి 6:9-13) మన ప్రార్థనలు స్వార్థపూరితమైనవిగా ఉండకూడదు. దేవుని చిత్తానుసారంగా ఉన్న వాటి కొరకే మనం ప్రార్థించాలి.—1 యోహాను 5:14.
5. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, స్తుతించాలని మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపించినప్పుడల్లా మీరు ప్రార్థించవచ్చు. (1 దినవృత్తాంతములు 29:10-13) మీకు సమస్యలు ఉన్నప్పుడు, మీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడూ మీరు ప్రార్థించాలి. (కీర్తన 55:22; 120:1) మీ భోజనానికి ముందు మీరు ప్రార్థించడం సముచితంగా ఉంటుంది. (మత్తయి 14:19) “ప్రతి సమయమునందును” ప్రార్థించుమని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు.—ఎఫెసీయులు 6:18.
6. మనమొక గంభీరమైన పాపం చేసినప్పుడు ముఖ్యంగా మనం ప్రార్థించడం అవసరం. అలాంటి సమయాల్లో మనం యెహోవా కనికరము, క్షమాపణ కొరకు వేడుకోవాలి. మనం మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని మళ్లీ చేయకుండా ఉండడానికి మనం శక్తికొలది ప్రయత్నిస్తే దేవుడు “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివుంటాడు.—కీర్తన 86:5; సామెతలు 28:13.
7. యెహోవా నీతిమంతుల ప్రార్థనలను మాత్రమే వింటాడు. మీ ప్రార్థనలను దేవుడు వినాలంటే, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడానికి మీకు వీలైనంతగా ప్రయత్నించాలి. (సామెతలు 15:29; 28:9) మీరు ప్రార్థించేటప్పుడు వినయంగా ఉండాలి. (లూకా 18:9-14) మీరు ప్రార్థించేదానికి అనుగుణంగా పనిచేయడం అవసరం. తద్వారా మీకు విశ్వాసం ఉందని, మీరడుగుతున్నది మీరు నిజంగా కోరుకుంటున్నారని మీరు నిరూపిస్తారు. అప్పుడే యెహోవా మీ ప్రార్థనలకు సమాధానమిస్తాడు.—హెబ్రీయులు 11:6.