లెసన్ 7
బాబెలు గోపురం
జలప్రళయం తర్వాత, నోవహు కొడుకులకు చాలామంది పిల్లలు పుట్టారు. వాళ్ల కుటుంబాలు పెరిగిపోయి అందరు యెహోవా చెప్పినట్లే భూమి మీద మెల్లమెల్లగా వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు.
కానీ కొన్ని కుటుంబాలు యెహోవాకు లోబడలేదు. వాళ్లు ఇలా అనుకున్నారు: ‘మనం ఒక పట్టణాన్ని కట్టుకుని ఇక్కడే ఉందాం. ఆకాశాన్ని అంటుకునే ఒక గోపురాన్ని కట్టుకుందాం. అప్పుడు మనకు బాగా పేరు వస్తుంది, రండి!’
తర్వాత చదివి తెలుసుకుందాం.
వాళ్లు చేస్తున్న దాన్నిబట్టి యెహోవా సంతోషంగా లేడు. అందుకే ఆయన వాళ్లను ఆపాలనుకున్నాడు. ఆయన వాళ్లను ఎలా ఆపాడో మీకు తెలుసా? వెంటనే వాళ్లు వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశాడు. అప్పుడు వాళ్లకు ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. కాబట్టి ఆ కట్టే పనిని ఆపేశారు. వాళ్లు కడుతున్న ఆ పట్టణానికి బాబెలు అనే పేరు వచ్చింది. బాబెలు అంటే “తారుమారు” అని అర్థం. మనుషులు అక్కడి నుండి వెళ్లిపోయి భూమి మీద వేర్వేరు చోట్ల ఉండడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు ఎక్కడికి వెళ్లినా అక్కడ కూడా చెడు పనులు చేస్తూ ఉన్నారు. మరి యెహోవాను ప్రేమించే వాళ్లు ఎవరూ లేరా?“తనను తాను గొప్ప చేసుకునే ప్రతీ వ్యక్తి తగ్గించబడతాడు; కానీ తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.”—లూకా 18:14