మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?
అధ్యాయము 6
మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?
1. మానవ జీవితం గురించి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ విషయాన్ని వివరించలేకపోతున్నారు?
మానవులు ఎందుకు వృద్ధులై మరణిస్తారో విజ్ఞాన శాస్త్రవేత్తలకు తెలియదు. మన కణాలు పునర్నూతనం చేయబడుతూ ఉండాలని, మనం నిరంతరం జీవించాలని ఉన్నట్లు కనిపిస్తుంది. హ్యోజున్ సోశికిగాకు (ప్రామాణిక జీవధాతు శాస్త్రం) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కణాలు వృద్ధాప్యానికెదగడం ఒక వ్యక్తి వృద్ధుడై మరణించడంతో ఎలాంటి సంబంధం కలిగి ఉందనే విషయం గొప్ప మర్మం.” జీవితానికి “సహజంగానే వారసత్వంగా” వచ్చిన పరిమితి ఉందని అనేకమంది విజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. వారు చెప్పేది సరైనదని మీరు అనుకుంటారా?
2. జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని బట్టి కొందరేమి చేశారు?
2 మానవులు ఎప్పుడూ దీర్ఘాయుష్షును అపేక్షించి, అమరత్వం పొందడానికి కూడా ప్రయత్నించారు. సా.శ.పూ. నాలుగవ శతాబ్దం నుండి, అమరత్వాన్ని సాధ్యం చేయడానికి రూపొందించబడినవని చెప్పబడిన మందులు చైనా రాజవంశీకులను ఆకర్షించాయి. తర్వాతి కాలంలోని కొంతమంది చైనా చక్రవర్తులు పాదరసం నుండి తయారు చేయబడిన జీవితపు దివ్యౌషధాలని పిలువబడే మందులు తీసుకొని, మరణించారు! ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరణం తమ ఉనికికి అంతం కాదని నమ్ముతారు. బౌద్ధులకు, హైందవులకు, ముస్లిమ్‌లకు, ఇతరులకు మరణానంతర జీవితాన్ని గూర్చి ఉజ్వలమైన నిరీక్షణలున్నాయి. క్రైస్తవమత సామ్రాజ్యంలో, అనేకులు ఈ జీవానంతర పరలోక పరమానందం కొరకు ఎదురు చూస్తారు.
3. (ఎ) మానవులు నిత్యజీవం కొరకు ఎందుకు అపేక్షిస్తారు? (బి) మరణాన్ని గూర్చిన ఏ ప్రశ్నలకు సమాధానం అవసరము?
3 మరణం తర్వాత సంతోషం పొందాలనే సిద్ధాంతాలు నిరంతర జీవితం కొరకైన కోరికను ప్రతిబింబిస్తాయి. దేవుడు మనలో పొందుపర్చిన నిత్యత్వాన్ని గూర్చిన ఆలోచనకు ప్రసంగి 3:11) మొదటి మానవులు భూమిపై నిరంతరం నివసించగలిగే ఉత్తరాపేక్షతో ఆయన వారిని సృష్టించాడు. (ఆదికాండము 2:16, 17) అయితే మానవులెందుకు మరణిస్తున్నారు? మరణం లోకంలోకి ఎలా ప్రవేశపెట్టబడింది? దేవుని గూర్చిన జ్ఞానం ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.—కీర్తన 119:105.
సంబంధించి, “ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి” యున్నాడని బైబిలు తెలియజేస్తుంది. (ఒక దుష్టమైన కుట్ర
4. మానవ మరణానికి బాధ్యుడైన నేరస్థున్ని యేసు ఎలా గుర్తించాడు?
4 ఒక నేరస్థుడు తన నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తాడు. కోటానుకోట్ల మంది మరణానికి కారణమైన ఒక నేరానికి బాధ్యుడైన ఒకవ్యక్తి విషయంలో కూడా ఇది నిజమే. మానవ మరణాన్ని మర్మంగా దాచి ఉంచడానికి అతడు సంగతులను కల్పించాడు. తనను చంపాలని ప్రయత్నిస్తున్నవారితో ఇలా చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ఆ నేరస్థున్ని గుర్తించాడు: ‘మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు.’—యోహాను 8:31, 40, 44.
5. (ఎ) అపవాదియగు సాతానుగా తయారైన వ్యక్తి యొక్క ప్రారంభం ఏమిటి? (బి) “సాతాను,” “అపవాది” అనే పదాల భావమేమిటి?
5 అవును, అపవాది మోసకరమైన ‘నరహంతకుడు.’ అతడు నిజమైన వ్యక్తియని, ఎవరి హృదయంలోనైనా ఉండే చెడు మాత్రమే కాదని బైబిలు తెలియజేస్తుంది. (మత్తయి 4:1-11) నీతియుక్తమైన దేవదూతగా సృష్టించబడినప్పటికీ, అతడు ‘సత్యమందు నిలిచినవాడు కాడు.’ అతడు అపవాదియగు సాతాను అని పిలువబడడం ఎంత తగినది! (ప్రకటన 12:9) అతడు యెహోవాను వ్యతిరేకించి, ఎదిరించాడు కాబట్టి “సాతాను” లేక “వ్యతిరేకి” అని పిలువబడ్డాడు. ఈ నేరస్థుడు “కొండెములు చెప్పువాడు” అని అర్థమిచ్చే “అపవాది” అని కూడా పిలువబడ్డాడు, ఎందుకంటే అతడు దేవదూషణకరంగా దేవునిగూర్చి తప్పుచెప్పాడు.
6. సాతాను దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ఎదురుతిరిగాడు?
6 దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరగడానికి సాతానును ఏది పురికొల్పింది? దురాశ. యెహోవా మానవుల నుండి పొందిన ఆరాధనను అతడు దురాశతో అపేక్షించాడు. న్యాయంగా సృష్టికర్తకు మాత్రమే చెందిన అలాంటి ఆరాధన పొందాలనే యెహెజ్కేలు 28:12-19 పోల్చండి.) బదులుగా, సాతానుగా మారిన దేవదూత దురాశతో కూడిన ఈ కోరికను, అది ఫలించి పాపాన్ని కనే వరకు పెంచుకున్నాడు.—యాకోబు 1:14, 15.
కోరికను అపవాది నిరాకరించలేదు. (7. (ఎ) మానవ మరణానికి కారణమేమిటి? (బి) పాపం అంటే ఏమిటి?
7 మానవుల మరణానికి దారితీసిన నేరాన్ని చేసిన ఆ నేరస్థున్ని మనం గుర్తించాము. కాని మానవ మరణానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి? బైబిలు ఇలా చెబుతుంది: ‘మరణపు ముల్లు పాపము.’ (1 కొరింథీయులు 15:56) పాపమంటే ఏమిటి? ఈ పదాన్ని అర్థం చేసుకొనేందుకు, బైబిలు వ్రాయబడిన ఆదిమ భాషలలో దానికున్న భావాన్ని మనం పరిశీలిద్దాము. “పాపం చేయడం” అని సాధారణంగా అనువదించబడిన హెబ్రీ, గ్రీకు క్రియాపదాలకు, గురిని తప్పడం లేక లక్ష్యాన్ని చేరలేకపోవడం, అంటే “తప్పిపోవడం” అని అర్థం. మనమందరం ఏ గురిని తప్పిపోతున్నాము? దేవునికి సంపూర్ణ విధేయత చూపడమనే గురిని తప్పిపోతున్నాము. అయితే, లోకంలోకి పాపం ఎలా ప్రవేశపెట్టబడింది?
కుట్ర ఎలా నెరవేర్చబడింది
8. మానవుల ఆరాధనను పొందేందుకు సాతాను ఎలా ప్రయత్నించాడు?
8 తాను మానవులందరినీ పరిపాలిస్తూ, వారి ఆరాధనను పొందుతానని అతడు తలంచిన ఒక కుట్రను సాతాను జాగ్రత్తగా రూపొందించాడు. మొదటి మానవ జత అయిన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలా ప్రలోభ పెట్టేందుకు అతడు నిశ్చయించుకున్నాడు. నిత్యజీవానికి నడిపించగలిగివుండే జ్ఞానాన్ని యెహోవా మన మొదటి తలిదండ్రులకిచ్చాడు. ఆయన వాళ్లను సుందరమైన ఏదెను తోటలో ఉంచాడు గనుక తమ సృష్టికర్త మంచివాడని వాళ్లకు తెలుసు. దేవుడు ఆదాముకు అందమైన, సహాయకారియైన భార్యను ఇవ్వడాన్నిబట్టి ఆయనకు ప్రత్యేకంగా తన పరలోక తండ్రి మంచితనం తెలుసు. (ఆదికాండము 1:26, 29; 2:7-9, 18-23) మొదటి మానవ జత నిరంతర జీవం వారు దేవునికి చూపించే విధేయతపై ఆధారపడి ఉండెను.
9. దేవుడు మొదటి మానవునికి ఏ ఆజ్ఞనిచ్చాడు, ఇది ఎందుకు సహేతుకమైనది?
9 దేవుడు ఆదాముకు ఇలా ఆజ్ఞాపించాడు: ‘ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.’ ఆదికాండము 2:16, 17) నైతిక ప్రమాణాలను ఏర్పరచి, తన సృష్టి జీవులకు ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్వచించే హక్కు సృష్టికర్తగా యెహోవా దేవునికి ఉంది. ఆదాము హవ్వలకు తోటలోని ఇతర చెట్లన్నిటి నుండి ఫలాలను తినే స్వాతంత్ర్యం ఉంది గనుక, ఆయన ఆజ్ఞ సహేతుకమైనదే. గర్వంగా తమ స్వంత నైతిక ప్రమాణాలను ఏర్పరచుకొనే బదులు వాళ్లు ఈ ఆజ్ఞకు విధేయత చూపించడం ద్వారా యెహోవా యొక్క సరైన పరిపాలన ఎడల తమ మెప్పును చూపగలిగేవారే.
(10. (ఎ) మానవులను తనవైపు త్రిప్పుకోవడానికి సాతాను ఎలా వారిని సమీపించాడు? (బి) యెహోవాకు ఏ ఉద్దేశాలు ఉన్నట్లు సాతాను ఆరోపించాడు? (సి) సాతాను దేవునిపై చేసిన దాడిని గూర్చి మీరు ఏమి తలస్తున్నారు?
10 మొదటి మానవులను దేవుని నుండి దూరం చేసేందుకు అపవాది పథకం వేశాడు. వాళ్లు తన పక్షం వహించేలా వాళ్లను ప్రలోభ పెట్టేందుకు సాతాను అబద్ధమాడాడు. ధ్వనివిడంబన చేసే వ్యక్తి ఒక బొమ్మను ఉపయోగించే విధంగానే అపవాది ఒక సర్పాన్ని ఉపయోగిస్తూ హవ్వను ఇలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” హవ్వ దేవుని ఆజ్ఞను గూర్చి చెప్పినప్పుడు, సాతాను ఇలా అన్నాడు: ‘మీరు చావనే చావరు.’ ఆ తర్వాత అతడు ఇలా చెబుతూ యెహోవాకు చెడు ఉద్దేశాలున్నట్లు ఆరోపించాడు: ‘మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.’ (ఆదికాండము 3:1-5) అలా, దేవుడు ఏదో మంచిదాన్ని దాస్తున్నాడని అపవాది సూచించాడు. సత్యవంతుడు, ప్రేమగల పరలోక తండ్రియగు యెహోవాపై ఎంతటి అపవాదుతో కూడిన దాడి!
11. ఆదాము హవ్వలు ఎలా సాతాను తోటి నేరస్థులయ్యారు?
11 హవ్వ చెట్టువైపు మళ్లీ చూసింది, ఇప్పుడు దాని ఫలాలు మరీ కోరదగినవిగా కనిపించాయి. ఆమె ఫలాన్ని తీసుకొని తిన్నది. ఆ తర్వాత, దేవునికి అవిధేయత చూపించే ఈ పాపకార్యంలో ఆమె భర్త ఆమెతో ఇష్టపూర్వకంగా కలిశాడు. (ఆదికాండము 3:6) హవ్వ మోసగించబడినప్పటికీ, మానవజాతిని పరిపాలించాలనే సాతాను పథకానికి ఆమె మరియు ఆదాము ఇద్దరూ మద్దతునిచ్చారు. ఫలితంగా, వాళ్లు అతని తోటి నేరస్థులయ్యారు.—రోమీయులు 6:16; 1 తిమోతి 2:14.
12. దేవునికి వ్యతిరేకంగా మానవులు చేసిన తిరుగుబాటు ఫలితమేమిటి?
ఆదికాండము 3:19) మన మొదటి తల్లిదండ్రులు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుండి తిన్న “దినమున” వాళ్లు దేవునిచే శిక్ష విధించబడి, ఆయన దృష్టిలో మరణించారు. తర్వాత వాళ్లు పరదైసునుండి పంపివేయబడి, తమ శారీరక మరణానికి దిగజారిపోనారంభించారు.
12 ఆదాము హవ్వలు తమ క్రియల ఫలితాలను ఎదుర్కోవలసి వచ్చింది. వాళ్లు ప్రత్యేక జ్ఞానంగల దేవునివలె కాలేదు. బదులుగా, వాళ్లు సిగ్గుపడి, తమను తాము దాచుకున్నారు. యెహోవా ఆదామును శిక్షించడానికి పిలిచి, ఈ శిక్ష విధించాడు: ‘నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ (పాపమరణాలెలా వ్యాపించాయి
13. పాపం మానవజాతికంతటికీ ఎలా వ్యాపించింది?
13 మానవ ఆరాధనను పొందాలనే తన పథకంలో సాతాను స్పష్టంగా విజయం సాధించాడు. అయినప్పటికీ, అతడు తన ఆరాధికులను సజీవంగా ఉంచలేకపోయాడు. మొదటి మానవజతపై పాపం తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించినప్పుడు, వాళ్లు ఇక తమ సంతానానికి పరిపూర్ణతను అందజేయలేకపోయారు. శిలాశాసనంలా, మన మొదటి తల్లిదండ్రుల కణాలలోకి పాపం లోతుగా పాతుకుపోయింది. అలా, వాళ్లు అపరిపూర్ణ సంతానాన్ని మాత్రమే ఉత్పన్నం చేయగలిగారు. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాతనే వారి సంతానమంతా జన్మించింది గనుక, వాళ్ల సంతానం పాప మరణాలను సంతరించుకుంది.—కీర్తన 51:5; రోమీయులు 5:12.
14. (ఎ) తమ పాపాన్ని నిరాకరించేవారిని మనం ఎవరికి పోల్చవచ్చు? (బి) ఇశ్రాయేలీయులకు వారి పాపాలు ఎలా గుర్తుచేయబడ్డాయి?
14 అయితే, నేడు అనేకులు తాము పాపులమని భావించరు. ప్రపంచంలోని కొన్ని భాగాల్లో, వారసత్వంగా వచ్చే పాపాన్ని గూర్చిన అభిప్రాయం సాధారణంగా ఎవరికీ తెలియదు. కాని పాపం లేదనడానికి అది సాక్ష్యాధారమేమి కాదు. అపరిశుభ్రమైన ముఖంతోవున్న ఒక బాలుడు తాను పరిశుభ్రంగా ఉన్నానని చెప్పవచ్చు, అయితే అతడు అద్దంలో చూసుకున్న తర్వాత మాత్రమే తాను పరిశుభ్రంగా లేనని ఒప్పుకోవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రవక్తయైన మోషే ద్వారా పొందినప్పుడు అలాంటి బాలునిలానే ఉన్నారు. పాపం ఉందని ధర్మశాస్త్రం రోమీయులు 7:7-12) అద్దంలోకి చూసే బాలునిలా, తమను తాము చూసుకొనేందుకు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం ద్వారా, తాము యెహోవా దృష్టిలో అపరిశుభ్రంగా ఉన్నామని ఇశ్రాయేలీయులు చూసుకోగలిగేవారు.
స్పష్టం చేసింది. “ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును” అని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. (15. దేవుని వాక్యమనే అద్దంలోకి చూడడం ద్వారా ఏమి బయల్పర్చబడుతుంది?
15 దేవుని వాక్యమనే అద్దంలోకి చూసుకుని, దాని ప్రమాణాలను గుర్తించడం ద్వారా మనం అపరిపూర్ణులమని తెలుసుకోగలుగుతాము. (యాకోబు 1:23-25) ఉదాహరణకు, మత్తయి 22:37-40 నందు వ్రాయబడినట్లుగా దేవున్ని, తమ పొరుగువారిని ప్రేమించడాన్ని గూర్చి యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమి చెప్పాడో పరిశీలించండి. ఈ అంశాల్లో మానవులు ఎంత తరచుగా తమ గురిని తప్పిపోతారోకదా! దేవుని ఎడల లేక తమ పొరుగువారి ఎడల ప్రేమ చూపేందుకు విఫలం కావడాన్నిబట్టి అనేకులు తమ మనస్సాక్షిని కొంచెమైనా నొప్పించుకోరు.—లూకా 10:29-37.
సాతాను కుతంత్రాలను గూర్చి జాగ్రత్తగా ఉండండి!
16. సాతాను కుతంత్రాలకు బలికాకుండా ఉండడానికి మనమేమి చేయవచ్చు, ఇదెందుకు కష్టం?
16 మనం ఇష్టపూర్వకంగా పాపం చేసేలా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. (1 యోహాను 3:8) అతని కుతంత్రాలకు బలికావడాన్ని తప్పించుకొనేందుకు ఏదైనా మార్గం ఉందా? ఉంది, కాని దీని కొరకు మనం ఇష్టపూర్వకంగా పాపం చేసే శోధనలతో పోరాడడం అవసరం. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే పాపం చేయాలనే మన సహజసిద్ధ స్వభావం చాలా బలమైనది. (ఎఫెసీయులు 2:3) పౌలు నిజమైన పోరాటాన్ని పోరాడవలసి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే పాపం అతనిలో నివసించింది. మనకు దేవుని అంగీకారం కావాలంటే, మనం కూడా మనలో ఉన్న పాపయుక్తమైన స్వభావాలతో పోరాడాలి.—రోమీయులు 7:14-24; 2 కొరింథీయులు 5:10.
17. మన పాప స్వభావాలకు వ్యతిరేకంగా మనం చేసే పోరాటాన్ని ఏది మరింత కష్టతరం చేస్తుంది?
17 మనం దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేలా చేసేందుకు సాతాను అవకాశాల కొరకు నిరంతరం వెదకుతుంటాడు గనుక, పాపానికి వ్యతిరేకంగా మనం పోరాడడం సులభం కాదు. (1 పేతురు 5:8) పౌలు తోటి క్రైస్తవుల ఎడల శ్రద్ధ కనబరుస్తూ ఇలా చెప్పాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.” (2 కొరింథీయులు 11:3) సాతాను నేడు అలాంటి కుతంత్రాలనే ఉపయోగిస్తున్నాడు. యెహోవా మంచితనాన్ని గూర్చి, దేవుని ఆజ్ఞలకు విధేయులవ్వడం యొక్క ప్రయోజనాలను గూర్చి అతడు అనుమానపు బీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన మన పాపయుక్తమైన స్వభావాల నుండి తాను ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తూ అపవాది మనం గర్వం, దురాశ, ద్వేషం, పక్షపాతం వంటివాటితో కూడిన విధానాన్ని అవలంబించేలా చేస్తున్నాడు.
18. పాపాన్ని పెంపొందింపజేయడానికి సాతాను లోకాన్ని ఎలా ఉపయోగిస్తాడు?
18 మనకు వ్యతిరేకంగా సాతాను ఉపయోగించే ఒక ఉపకరణమేమంటే, అతని అధికారం క్రింద ఉన్న లోకమే. (1 యోహాను 5:19) మనం జాగ్రత్తగా లేకపోతే, మన చుట్టూవున్న లోకంలోని అవినీతిపరులైన దుష్ట ప్రజలు, దేవుని నైతిక ప్రమాణాలను ఉల్లంఘించే పాపయుక్తమైన విధానంలోకి పడిపోయేలా మనపైకి ఒత్తిడి తెస్తారు. (1 పేతురు 4:3-5) అనేకులు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తారు, తమ మనస్సాక్షి గద్దింపులను కూడా పట్టించుకోకుండా, చివరికి దాన్ని నిర్జీవంగా చేస్తారు. (రోమీయులు 2:14, 15; 1 తిమోతి 4:1, 2) గతంలో వారి అపరిపూర్ణ మనస్సాక్షి సహితం అవలంబించడానికి అనుమతించని విధానాన్ని చివరికి కొందరు మెల్లిగా చేపడతారు.—రోమీయులు 1:24-32; ఎఫెసీయులు 4:17-19.
19. పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం మాత్రమే ఎందుకు సరిపోదు?
19 ఈ లోకంలో పరిశుభ్రమైన జీవితాన్ని గడపడమంటే ఒక ఘనకార్యమే. అయితే, మన సృష్టికర్తను ప్రీతిపర్చడానికి ఇంకా ఎంతో అవసరం. మనకు దేవునియందు ఎల్లప్పుడూ విశ్వాసముండాలి, ఆయన ఎడల మనకు బాధ్యత ఉన్నట్లు భావించాలి. (హెబ్రీయులు 11:6) శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” (యాకోబు 4:17) అవును, దేవున్ని ఆయన ఆజ్ఞలను కావాలని నిర్లక్ష్యం చేయడమే ఒక విధమైన పాపం.
20. సరైనది చేయడం నుండి మిమ్మల్ని ఆటంకపర్చడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు, కాని అలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి మీకేది సహాయం చేయగలదు?
20 మీరు బైబిలు పఠనం చేయడం ద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి యోహాను 16:2) యేసు పరిచర్య కాలంలో అనేకమంది పరిపాలకులు ఆయనయందు విశ్వాసముంచినప్పటికీ, తమ సమాజం నుండి వెలివేయబడతామనే భయంతో వాళ్లు ఆయనను ఒప్పుకోలేదు. (యోహాను 12:42, 43) దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందాలనుకునే ఎవరినైనా భయపెట్టడానికి సాతాను నిర్దయగా ప్రయత్నిస్తాడు. అయితే, యెహోవా చేసిన అద్భుతమైన క్రియలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, మెచ్చుకోవాలి. వ్యతిరేకులు కూడా అదే మెప్పును పొందేందుకు మీరు సహాయం చేయగలుగుతారు.
మీరు చేసే ప్రయత్నానికి సాతాను తప్పకుండా వ్యతిరేకత తీసుకువస్తాడు. సరైనది చేయకుండా అలాంటి ఒత్తిళ్లు మిమ్మల్ని ఆటంకపర్చేందుకు మీరు అనుమతించరని యథార్థంగా నిరీక్షించబడుతుంది. (21. మనం లోకాన్ని మరియు మన స్వంత పాపభరిత స్వభావాలను ఎలా జయించగలము?
21 మనం అపరిపూర్ణులమై ఉన్నంతవరకు మనం పాపం చేస్తూనే ఉంటాము. (1 యోహాను 1:8) అయినప్పటికీ, ఈ పోరాటాన్ని పోరాడడంలో మనకు సహాయం లభిస్తుంది. అవును, దుష్టుడైన అపవాదియగు సాతానుకు వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో మనం విజయవంతులమవ్వడం సాధ్యమే. (రోమీయులు 5:21) యేసు తన భూపరిచర్య ముగింపులో ఈ మాటలతో ఆయన తన అనుచరులను ప్రోత్సహించాడు: ‘లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.’ (యోహాను 16:33) అపరిపూర్ణ మానవులకు కూడా, దేవుని సహాయంతో లోకాన్ని జయించడం సాధ్యమే. తనను వ్యతిరేకించి, ‘దేవునికి లోబడే’ వారిపై సాతానుకు పట్టు ఉండదు. (యాకోబు 4:7; 1 యోహాను 5:18) మనం గమనించబోయేలా, పాప మరణాల బానిసత్వం నుండి తప్పించుకోవడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరిచాడు.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
అపవాదియగు సాతాను ఎవరు?
మానవులెందుకు వృద్ధులై మరణిస్తున్నారు?
పాపమంటే ఏమిటి?
దేవునికి వ్యతిరేకంగా ప్రజలు ఇష్టపూర్వకంగా పాపం చేసేలా సాతాను ఎలా చేస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
[54వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]