ప్రగాఢ గౌరవాన్ని పొందే భర్త
అధ్యాయము 4
ప్రగాఢ గౌరవాన్ని పొందే భర్త
1, 2. గౌరవాన్ని ఎలా పొందవలెను, ఇది యేసుక్రీస్తు విషయంలో ఎలా చక్కగా ఉదహరించబడింది?
నిన్ను గౌరవించవలెనని ఆజ్ఞాపించినంత మాత్రాన నీకు గౌరవం లభించదు. నీ మాటలు, క్రియలద్వారా నీవేమైయున్నావో కనబరిస్తే గౌరవ మర్యాదలను నీవు సంపాదించుకోగలవు.
2 ఇది క్రీస్తుయేసు విషయంలో ఉదాహరించబడింది. ఆయన, తన బోధనాపద్ధతివల్ల బోధకునిగా గౌరవాన్ని పొందాడు. ఆయన చేసిన కొండమీది ప్రసంగానంతరం, “జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” దేనివలన ఆయనకిట్టి ప్రతిష్ఠ లభించింది? ఇతర మనుష్యుల అభిప్రాయాలనే గాక దేవుని వాక్యమగు బైబిలు మీద ఆధారం చేసికొని తాను ప్రత్యుత్తరముల నిచ్చినందున ఆయనకు అట్టి గౌరవం లభించింది. ఆయన యెహోవాదేవుని మీద, ఆయన సత్యవాక్యం మీద సంపూర్ణంగా ఆధారపడెను. యేసు తన స్నేహితులనుండి శత్రువుల నుండి గౌరవాన్ని పొందాడు, దాన్ని సంపాదించాడు.—మత్తయి 7:28, 29; 15:1-9; యోహాను 7:32, 45, 46.
3. ఎఫెసీయులు 5:33, భార్యపై ఎట్టి బాధ్యతను మోపుతుంది, మరి ఇందుకు భర్త ఏమి చేయాలి?
3 “భార్యయైతే తన భర్త యందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” అని ఎఫెసీయులు 5:33నందు ఉపదేశింపబడింది. అయితే భర్త ఇట్టి సన్మానం పొందుటకు యోగ్యుడై యుండాలి; లేకపోతే తన భార్య ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం చాలాకష్టంగా వుంటుంది. భర్త అట్టి సన్మానం పొందడానికి బైబిలునందు తెలుపబడిన తన పాత్రనెలా నిర్వహించగలడు?
సరియైన శిరస్సత్వాన్ని నిర్వహించుట ద్వారా
4. బైబిలు, భర్తకెట్టి స్థానమిస్తుంది?
4 బైబిలు వివాహ ఏర్పాటునందు భర్తకు శిరస్సత్వాన్నప్పగించి ఇలా తెల్పుతుంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.” (ఎఫెసీయులు 5:22-24) ఈ ఏర్పాటు, కుటుంబ సంతోషానికి నిజంగా దోహదపడగలదా? కొందరు స్త్రీలు, పురుషుడు పురుషాహంకారియని అంటే పురుషులు, స్త్రీలతోగల బాంధవ్యంలో డంబాలు పలుకుతూ లేక అహంభావంతో ప్రవర్తిస్తుంటారని వారిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే బైబిలు బోధలలో పురుషులు చెలాయించే అట్టి పురుషాహంకార అధికారమేదియు లేదని మనం బాహాటంగా చెప్పవచ్చు.
5. భర్త తన శిరస్సత్వాన్ని గూర్చి దేనిని గుర్తించాలి, అతడెవరి మాదిరిని అనుసరించాలి?
5 స్త్రీయే గాక పురుషుడు కూడ శిరస్సత్వం క్రింద ఉన్నాడని బైబిలు నొక్కి తెల్పుతుంది. మనం బైబిలును 1 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనమునకు త్రిప్పితే అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి వ్రాసిన యీ మాటలను అచ్చట కనుగొంటాం: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” పురుషునికి క్రీస్తు శిరస్సు, మరి భర్తవైన నీవు దేవున్ని క్రీస్తును మాదిరిగాను బోధకులుగాను తీసికొని వారినుండి శిరస్సత్వాన్ని నిర్వహించే పద్ధతిని నేర్చుకోవాలి.
6. యెహోవా దేవునినుండి, యేసుక్రీస్తు నుండి భర్తలు శిరస్సత్వాన్ని గూర్చి ఏమి నేర్చుకోగలరు?
6 యెహోవా, క్రీస్తుపై తనకున్న శిరస్సత్వాన్ని కృప అనే లక్షణాన్నిబట్టి నిర్వహించాడు, మరి క్రీస్తు “నాదేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు కీర్తన 40:8; హెబ్రీయులు 10:7) యేసుక్రీస్తు శిరస్సత్వము కూడ ప్రేమపూర్వకమైందే. తనకు శిష్యులు కాబోయే వారితో ఆయనిలా అన్నాడు: “నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్తయి 11:29) తన సంఘసభ్యులు అనగా లేఖనాలు పెండ్లి కుమార్తెగా పోల్చిన వారు అట్టి యాజమాన్యం క్రింద నిశ్చయంగా అలాంటి విశ్రాంతిని కనుగొన్నారు. ఆయన వారిని స్వలాభము కొరకు ఉపయోగించు కోలేదు గానీ తన ప్రేమను చూపుటలో తన్నుతానే త్యాగం చేసికొన్నాడు. భర్త కూడ తన భార్య ఎడల ఇలాంటి శిరస్సత్వాన్నే నిర్వహించాలి: “పురుషులారా, మీరును మీభార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించు కొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు . . . మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:25-30, 33) లోబడియుండే విషయంలో క్రీస్తు శిరస్సత్వాన్ని నీవు ఒక మాదిరిగా తీసుకుంటే, అదంత కష్టమేమీ కాదు—నిజానికి అదెంతో ఆనందంగా ఉండగలదు—ఎందుకంటే నీ భార్య, ఆమె భర్తగా నీ శిరస్సత్వం ఎడల ప్రగాఢ గౌరవాన్ని చూపుతుంది.
సంతోషము” అని ఆ శిరస్సత్వానికి లోబడ్డాడు. (7, 8. కొందరు భర్తలు సరియైన రీతిగా శిరస్సత్వం వహించుటలో విఫలమయ్యే కొన్ని విధానాలను పేర్కొనండి.
7 అసంపూర్ణత, జన్మతావచ్చిన స్వార్థాన్నిబట్టి వచ్చే పెద్ద సమస్య ఏమంటే, భర్త తాను కుటుంబ యజమానిగా గౌరవింపబడవలెననే కోరికతో కొన్నిసార్లు తన భార్య ఎడల ప్రేమను, దయను అవసరమైనంతగా కనబరచలేక పోతాడు. తరచూ భార్య, తనభర్త తనను ప్రేమిస్తున్నట్లు భావించడంలేదని, ఆయన తన సంతోషాన్ని తన సంతృప్తినే కోరుకుంటున్నాడని
అంటుంది. మరి కొందరు భార్యలైతే, తమ భర్తలు అధికారం చెలాయిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. బహుశ భార్య, భర్త శిరస్సత్వ అధికారాన్ని ధిక్కరించుట వల్ల అలా జరిగియుండవచ్చును. లేదా, భర్త మొండిఘటమై యుండి, అధికారం చెలాయించే అనేకమంది పురుషుల మధ్య పెరిగియుండవచ్చును. కారణమేదైననూ సరే. శిరస్సత్వాన్ని ఆ విధంగా దుర్వినియోగంచేయడం మూలాన ఎవరి మన్నన కూడ పొందలేరు.8 మరొకవైపు గమనిస్తే, శిరస్సత్వాన్ని అవమానించే బదులు కొందరు భర్తలు దాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు. సమస్త తీర్మానాలు భార్యలే చేసేటట్లు బాధ్యతనంతటిని వారికే వదిలి వేస్తున్నారు. లేదా, ‘తొందర పడవద్దు’ అని తమ భార్యలతో అంటూ, కుటుంబ అవసరతలు దెబ్బతినేంతగా వారు జాప్యం చేస్తున్నారు. వారు శరీర విషయంలో సోమరితనంగా లేక బద్ధకంగా వుండటంలేదు గానీ మానసిక ప్రయత్నాలలో మాంద్యం కనబరిస్తే అది సామెతలు 24:33, 34 లో వర్ణించబడినట్లే వుంటుంది: “కొంచెము నిద్ర, కొంచెము కునుకుపాటు, పరుండుటకై కొంచెము చేతులు ముడుచుకొనుట వలన నీకు దరిద్రత దోచుకొనువాడు వచ్చినట్లు పరుగెత్తివచ్చును. ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును.”—రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్.
9, 10. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు భర్త ఎవరి అభిప్రాయాలను లక్ష్యపెట్టాలి?
9 నీవు నీ నిర్ణయాలలో స్థిరత్వాన్ని, పట్టుదలను, సామర్థ్యాన్ని కనబరిస్తే నీభార్య గౌరవాన్ని పొందగలవు. అనగా ఇంటిలో మరెవరితోను సంప్రదించ కూడదని, నీతో అంగీకరించలేదు గనుక నీభార్య అభిప్రాయానికి ప్రాముఖ్యత నివ్వకూడదని దీని భావం కాదు. పూర్వం అబ్రాహాము శారాల కుటుంబంలో, వారి కుమారుడైన ఇస్సాకు మరియు దాసియగు హాగరు కుమారుని విషయంలో తీవ్రమైన సమస్య వచ్చెనని బైబిలు తొలిభాగంలో మనం చదువుతాం. ఆ విషయంలో అబ్రాహాము అభిప్రాయాలకు అనుగుణంగాలేని పరిష్కారాన్ని శారా ప్రతిపాదించింది. అయితే దేవుడాయనతో “ఆమెమాట వినుము” అని చెప్పాడు.—ఆదికాండము 21:9-12.
10 అయినంత మాత్రాన మనం ఎల్లప్పుడు భార్య అభిప్రాయాలను ఒప్పుకోవాలని తలంచకూడదు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలను గూర్చి ఆమెతో చర్చించి, ఆమె తన తలంపులను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపర్చ వచ్చునని ప్రోత్సహించుట ప్రయోజనకరం. సంభాషణా మార్గాలను తెరచియుంచండి, ఎల్లప్పుడు అందుబాటులో వుండండి, నీవుచేసే తీర్మానాల్లో ఆమె యిష్టాలను జాగ్రత్తగా పరిశీలించు. శిరస్సత్వాన్ని నిర్వహించుటలో అధికారాన్ని చెలాయించవద్దు, దురహంకారాన్ని కనబర్చవద్దు గాని వినయాన్ని వ్యక్తపరచు. నీవేమి పరిపూర్ణుడవుకావు, నీవూ పొరపాట్లు చేస్తావని, మరి నీ పొరపాట్లను నీ భార్య అర్థంచేసుకోవాలని నీవు కోరుకుంటావు. అట్టి పరిస్థితులు తలెత్తినపుడు గర్విష్టియైన వాని భార్యకంటె వినయస్థుడగు వాని భార్య, తనభర్త శిరస్సత్వాన్ని గౌరవించుట సులభం.
మంచి పోషణకర్తగా వుండుట ద్వారా
11, 12. (ఎ) జీవితావసర వస్తువులను ఏర్పాటు చేసే విషయంలో భర్త బాధ్యత ఏమిటి? (బి) అట్టి ఏర్పాట్లు చేయడంలో వాస్తవంగా ఇద్దరి ప్రయత్నాలు ఎలా ఇమిడివున్నాయి?
11 తన కుటుంబానికి జీవితావసర వస్తువులను ఏర్పాటు చేసే బాధ్యత భర్తదే. మొదటి తిమోతి 5:8 దీన్ని గూర్చి ఇలా తెల్పుతుంది: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” పలుదేశాల్లో ఈనాడు, జీవించుటకెంతో డబ్బు కావాలి, భర్తవైన నీవే యీ అవసరతను ఎలా తీర్చవలెనోయని నిర్ణయాలు చేయవలసివుంది. నీవు సంపాదించే డబ్బును ఇంటికి తీసికొని రావడమేగాక నీ భార్యతో సంప్రదించి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చే రీతిగా ఆ డబ్బును ఖర్చుపేట్టే విషయాన్ని గూర్చి మాట్లాడుకొనవలసి వుంటుందని బహుశ నీవు గమనించే యుంటావు. మిత వ్యయానికి సరియైన ఏర్పాట్లు చేసికోవాలని దీని భావం. నీ రాబడిలోనే సర్దుకొని జీవించుటకిది నీకు సహాయపడుతుంది మరి జీతం రాకముందే డబ్బు ఖర్చయినందువల్ల వచ్చే అనవసరమైన తగాదాలకు దిగకుండ అది నివారించగలదు.
సామెతలు 18:22 ఎంతో వాస్తవం: “భార్య దొరికినవానికి మేలు దొరికెను.”
12 భర్తే డబ్బును సంపాదించేవాడైనను కుటుంబపోషణకై సర్వసాధారణంగా ఇద్దరి ప్రయత్నంవల్ల డబ్బు సమకూరుననే విషయాన్ని మర్చిపోకూడదు. నీవే ఇదంతా చేస్తున్నావని భర్తవైన నీవనుకుంటే, కొంచెం ఆగి, సామానులు కొనే వ్యక్తిని, వంట మనిషిని, పాత్రలు తోమే పని మనిషిని, ఇంటిని చక్కదిద్ది, అందంగా అలంకరించే వ్యక్తిని, దాసీని మొదలైనవారిని జీతానికి పెట్టుకుంటే ఎంత ఖర్చవుతుందో ఆలోచించు. సాధారణంగా నీ భార్యే తన వివాహ బంధంలోని బాధ్యతగా యీ పనులన్నిటిని స్వయంగా చేస్తూ ఆ ఖర్చులన్నిటిని తగ్గిస్తుంది. మరి ఆమె ఇంటి ఖర్చులన్నిటిని వ్రాసి పెడితే, ముందు పేర్కొన్న జాబితాలో ఒక “గుమాస్తాను” చేర్చవచ్చును.13. వస్తుసంపద విషయం వచ్చినపుడు దంపతులు ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలి, ఇది వారికెట్లు ప్రయోజనకరమౌతుంది?
13 వస్తురూపకమైనవాటిని ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ ఉండే ఒక అపాయమేమంటే—నీవు, నీ భార్య—జీవిత ధ్యేయంలోను, ధనాపేక్షలోను పడిపోయే అపాయముంది. ఇది చేసినట్లే, కొన్ని కుటుంబ సంగతులు తొలుతనే సంతోషాన్ని ‘తినివేయ’ గలవు. “మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొనిపోలేము” అని బైబిలు రచయిత పౌలు అంటున్నాడు. “కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మునుతామే పొడుచుకొనిరి.” ధనాపేక్షగల జీవితమెంత ఆస్తి నొసంగిననూ, కుటుంబ బంధాలు బలహీనమై, కుటుంబం విచ్ఛిన్నమగుట వలన వచ్చే బాధను అది ఎన్నటికి తీర్చజాలదు. ధనలాభం ఆత్మీయ మానసిక నష్టముల కంటె మిన్నయైంది కాదు.—1 తిమోతి 6:7-10.
14. ఒక వ్యక్తి జీవితంలో వస్తుసంపదే అంత ప్రాముఖ్యమైనదా కాదాయని ఏది నిర్ణయిస్తుంది?
14 ధనాపేక్ష అంటే వస్తుసంపదయెడల మక్కువే, గాని వస్తువులను కల్గివుండడం మాత్రంకాదు. ఒకడు బీదవాడైననూ ధనాపేక్ష కల్గియుండవచ్చును లేదా ధనవంతుడై ఆత్మీయ దృష్టిని కల్గియుండవచ్చును. తన హృదయం దేనిపై ఉందో దానిమీద అది ఆధారపడి వుంది. యేసు ఇలా అన్నాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలుకన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.”—15, 16. భౌతికావసరతలను బాగుగా తీర్చుటయేగాక కుటుంబ సంతోషాన్ని కల్గియుండడానికి భర్త ఇంకా ఏమి చేయాలి?
15 శరీరావసరతలను బాగుగా ఏర్పాటుచేసే భర్త అట్టి లేఖనానుసారమైన హెచ్చరికను లక్ష్యపెడతాడు, మరి భౌతికంగా అవసరమైన వాటిని ఏర్పాటు చేయడమేగాక తన కుటుంబానికి ఆత్మీయ ఏర్పాట్లు కూడ చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆత్మీయంగా వృద్ధిచేయడానికి సమయం, శక్తి లేనంతరీతిగా నీవు కష్టపడి పనిచేసి జీవితావసర వస్తువులను సంపాదించుటలో ప్రయోజనమేమిటి? జీవిత సమస్యలను జయప్రదంగా ఎదిరించడానికి అవసరమయ్యే జ్ఞానం కొరకు కుటుంబంలో మంచి సూత్రముల యెడల దృఢమైన భక్తిని పెంపొందించు కొనుటకు సమయాన్ని వెచ్చించాలి. దేవుని వాక్యమును కలిసి చదవడానికి దాన్ని గూర్చి మాట్లాడడానికి నీ జీవితంలో స్థానమిచ్చినపుడు అంతాకలిసి ప్రార్థించుటవల్ల కల్గినట్లే పైన తెల్పిన జ్ఞానము కల్గుతుంది. కుటుంబ యజమానిగా భర్తవైన నీవు యీ విషయములో నాయకత్వం వహించాలి. వీటివలనకల్గు ప్రయోజనాలే మిన్న. దేవుని వాగ్దాన మెప్పుడూ నిష్ఫలము కాదు: “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:6.
ప్రసంగి 7:12 నందలి హెచ్చరిక యొక్క సమతుల్యతను గుణగ్రహిస్తాడు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును.” కావున, మంచి పోషకునిగా అతడు తన కుటుంబ భౌతికావసరతలను తీర్చే నిమిత్తం కష్టించి పనిచేస్తాడు. అయినను అతడు “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, . . . దేవునియందే నమ్మికయుంచును.” తాను తనభార్య ఇద్దరూ “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము” అతడు ఆత్మీయావసరతల ఎడల ప్రాముఖ్యమైన శ్రద్ధను కనబరచుటలో ఆదర్శప్రాయంగా వుంటాడు. (1 తిమోతి 6:17-19) అటు భౌతిక సంబంధమైన ఇటు ఆత్మీయ సంబంధమైన అవసరతలను తీర్చుటలో భర్త చేసే ప్రయత్నాల విషయంలో దైవభక్తి గల తన భార్య మన్ననలను పొందుతాడు.
16 తనమార్గమును సరాళము చేయునట్లు సృష్టికర్త వైపు నిరీక్షించు భర్త,ఆమెను సన్మానించుట ద్వారా
17-19. భార్యను “సన్మానించుడి” అనే బైబిలు సలహాను దాంపత్య జీవితంలో ఎలా అమలుపరచాలి?
17 అపొస్తలుడైన పేతురు భర్తలతో వారి భార్యలను గూర్చి మాట్లాడుచు, వారు “బలహీనమైన ఘటమని భార్యను సన్మానింపవలెను” అని చెబుతున్నాడు. (1 పేతురు 3:7) అదే వాక్యంలో పేతురు, భార్యతో కాపురం చేసే భర్తవైన నీవు “జ్ఞానముచొప్పున” ఆమెను సన్మానించాలని సూచిస్తున్నాడు.
18 ఇది దాంపత్య జీవితాలకు నిశ్చయంగా వర్తిస్తుంది. స్త్రీ శారీరక, మానసిక నిర్మాణాన్ని ఎరుగని భర్తల మూలంగానే భార్యలలో లైంగిక ఉత్సాహం కనబడటం లేదు. ‘భర్త భార్యకు తన ధర్మమును నడుపవలెను,’ అయితే అది ‘జ్ఞానము చొప్పున, ఆమె బలహీన ఘటమని ఎరిగి సన్మానించవలెను,’ అని దేవునివాక్యం హెచ్చరిక చేస్తుంది. (1 కొరింథీయులు 7:3) నీవు నిజంగా ఆమెను ‘సన్మానిస్తే,’ నీవు కఠినంగా వుండవు, కావలెనని బలవంతపెట్టవు ఆమె బాగా అలసిపోయినపుడు గాని నెలలో ఆమె కొంతవరకు శారీరకంగా బాధలోనున్నపుడు గానీ నీ కామదాహాన్ని, తీర్చవలెనని నీవు మొండి పట్టుపట్టవు. (లేవీయకాండము 20:18 పోల్చండి.) మీరిద్దరు కలిసినపుడు ఆమె కోరికలను మరచి నీ స్వంతసుఖమే కోరుకొనవు. జీవితమందు ఇలాంటి దశలో సర్వసాధారణంగా స్త్రీ కొంచెం నెమ్మదిగా ప్రవర్తిస్తుంది. ఆమెకు ఆప్యాయత, అనురాగం ప్రత్యేకంగా అవసరం. భర్త తన ‘భార్యకు ఆమె ధర్మమును నడుపవలెనని’ బైబిలు తెల్పుతూ, ఇచ్చుటనే గానీ పుచ్చుకొనుటను గూర్చి నొక్కి చెప్పడం లేదు.
19 ఆ విధంగా ఇచ్చుట అనేది సహజంగా తన స్వంత వివాహజతకే పరిమితమై యుండాలి. నిజమే, అనేకమంది పురుషులకీనాడు పరస్త్రీలతో “సంబంధాలున్నాయి.” అయితే వారు చివరకు పొందేదేమిటి? వారు మెల్లిగా వారి కుటుంబ సంతోషాన్ని అణగార్చుతారు. వారు తమ ‘భార్యలను సన్మానించ’ లేకపోతున్నారు, కావున తమ భార్యలు తమ్మును గౌరవించడానికి వారు ఆధారమివ్వడం లేదు. అంతేగాక, దేవునివల్ల ప్రారంభం చేయబడిన ఏర్పాటును, ఆ వివాహాన్నే అప్రతిష్ఠపాలు చేస్తారు. దీనివల్ల వచ్చే బాధలన్నిటి దృష్ట్యా హెబ్రీయులు 13:4 ఎందుకిలా నొక్కి తెల్పుతుందో గ్రహించవలసి వుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.”
20. ఎఫెసీయులు 5:28 లో తెలుపబడినరీతిగా, ఇంకను ఏ విషయాల్లో భార్యను సన్మానించాలి?
20 ఒకడు భార్యను సన్మానించుట, లైంగిక సంబంధాలతోనే ముగిసిపోదు. నిజంగా గౌరవంగల భర్త ఇతర విషయాల్లో కూడ తన భార్య ఎడల సన్మానం కల్గియున్నాడని కనబరుస్తాడు. ఆమెను అందలమెక్కించి ఆమెకు దాసుడై యుండాలని దీని భావం కాదు. కానీ మనం ముందు ఎఫెసీయులు 5:28 లో చదివినట్లే వుండాలి: “పురుషులు కూడ తమసొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.” దీన్ని చేసే పురుషుడు నిశ్చయంగా తన భార్యను ఒక హీనమైన వ్యక్తిగా పరిగణించడు. ఒకడు ‘తన శరీరమువలె’ ఆమెను ప్రేమింపక పోతే భోజన సమయాల్లో తానే అన్నిటికి అర్హమైన వాడని, మిగిలిందే ఆమె భాగమని—నిశ్చయంగా అతడు తలంచునుగదా. తన అందాన్ని గూర్చి మురిసిపడే బదులు, తన వలె లేక ఇంకా ఎక్కువగా తన భార్య అందం ఎడల శ్రద్ధను కల్గియుంటాడు, ఆమె తన వస్త్రాలంకరణలో తాను సంతృప్తిపడునట్లు తన శాయశక్తులా ఆమెకు సహాయపడతాడు. ఒకడు తానుచేసేది విఫలమైనపుడు తన్నుతానే కొట్టుకొనడు. తాను విఫలుడౌతాడని అనుకొన్నపుడు కూడ అలాచేయడు. క్రైస్తవ భర్త, తనభార్య కొన్నిసార్లు తాననుకొనిన వాటిని చేయలేక పోయినంత మాత్రాన ఆమెను కొట్టడు. దీనికి బదులుగా, ఇతరులెవరైనా ఆమెను కఠినంగా చూస్తే, న్యాయంగా అతడామెకు సహాయపడతాడు. అతడు ఆమెను తన శరీరమువలె ప్రేమిస్తాడు.
21, 22. భార్య తన పాత్రను నిర్వహించడంలో సంతోషించేలా భర్త ఆమెకెలా సహాయపడగలడు?
21 నీ భార్యను నీవు ‘సన్మానించ’ వలెనంటే నీ అవసరతల యందు ఏకీభవించే విషయాలను అభినందించుటయే గాక మీ యిద్దరి మధ్యగల మానసిక తారతమ్యములను నీవు గ్రహించాలి. సాధారణంగా, స్త్రీలు అధికారం క్రింద పని చేయాలని కోరుకుంటారు, అయితే అది సరియైన పద్ధతిలో నిర్వహించబడే అధికారమైయుండాలి. ఈ రీతిగానే యెహోవా దేవుడు వారిద్దరిని సృజించాడు. స్త్రీ, ‘పురుషునికి సహాయకారి, అతనికి సాటియైనతోడు.’ (ఆదికాండము 2:18) అయితే పర్యవేక్షణ మరీ నిశితంగా వుంటే, ఆమె తన సామర్థ్యతలను వుపయోగించడానికి పనుల నారంభించడానికి స్వతంత్రత లేకపోయిందని తన జీవితంలోని సంతోషం తొలగిపోయిందని తలంచుట కారంభిస్తుంది, మరి అయిష్టత పెరగవచ్చును.
22 అవధానం నిలుపవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయమేమంటే స్త్రీ సహజంగా తాను అవసరమైందేననుకొనే తన కోరికను బలపరచుటే. సహాయకారియగు భర్తను అనేకమంది గృహిణులు మెచ్చుకుంటారు. గానీ తన భార్యను నిష్కారణంగా నెట్టివేసి తానే అధికారి ననుకొనేవాడు మేలుకంటె కీడునే అధికంగా చేస్తున్నాడు. నీవు దయ, అభినందనను తెల్పుచు, నీవు ఆమెను సన్మానిస్తూ, మీరిద్దరు కలిసి పని చేస్తున్నారని, ఆ పని “మనము,” “మనది” అనేగాని “నేను,” “నీవు” లేక “నాది” అని అనకుండావుండి ఆమె అవసరమేనన్నట్లు ఆమెకు తెలియపరిస్తే, నీవు నీ భార్య నమ్మకాన్ని చూరగొంటావు. నీవామెను ఎంతగా అభినందిస్తున్నావో, ఆమె నీకెంత అవసరమో నిజంగా నీ భార్యకు కనబరస్తున్నావా? నీవు
ఆమెకు జీతమివ్వడం ద్వారా దాన్నిచేయలేవు; మరొక విధంగా నీవు దానిని కనబరచాలి.ఆమె స్త్రీ లక్షణాలను అభినందించండి
23. భావోద్రేక విషయాల్లో సాధారణంగా స్త్రీ, పురుషులు ఎలా వ్యత్యాసం కల్గియున్నారు?
23 మానసిక శాస్త్రవేత్తయైన ఒక స్త్రీ ఇలా వ్రాసింది: “సహజంగా స్త్రీ నొచ్చుకొంటుంది, పురుషుడైతే దీర్ఘంగా ఆలోచిస్తాడు.” దీన్నిబట్టి ఒకరి గుణం మరొకరి గుణంకంటె శ్రేష్ఠమైందికాదని, వారికి భేదమున్నదని అర్థమౌతుంది. నొచ్చుకోని వ్యక్తులను మనం లక్ష్యపెట్టం, లేక బుద్ధిహీనులంటే మనకిష్టం లేదు. స్త్రీలకు నొచ్చుకొని, తలంచే సామర్థ్యముంది, అనేది స్పష్టం. అలాగే పురుషులు కూడ. అయితే సహజంగా స్త్రీ భావోద్రేకాలు తొందరగా బయటపడతాయి, పురుషుడు సర్వసాధారణంగా తాను న్యాయప్రమాణమని తలంచినవాటి విషయాల్లో ఆ ఉద్రేకాన్ని అణచుకోవాలని ప్రయత్నిస్తాడు. కొన్ని మినహాయింపులున్ననూ, భార్యాభర్తలిద్దరు ఒకరికొకరు సహాయకారులుగా ఉండుటకిది మరొక వ్యత్యాసం. స్త్రీలో సహజంగా ఉప్పొంగే ఉద్రేకంతోపాటు, ఇతరుల యెడల ఆమెకున్న ఆసక్తి, ఆమెను పురుషుని కంటె అధికంగా మాట్లాడేలా చేస్తాయి. ఇతరులు ఆమెతో మరల మాట్లాడాలనుకుంటుంది ఇదిగో ఇక్కడే అనేకమంది భర్తలు తప్పిపోతున్నారు.
24. భర్త తన భార్య చెప్పేది విని ఆమెతో మాట్లాడడం ఎందుకు ముఖ్యము?
24 నీవు నీ భార్యతో మాట్లాడతావా? నీవు నీపని విషయమేకాదు ఆమె పనినిగూర్చి కూడ మాట్లాడతావా? నీవు ఆమె చేసే పనియందు శ్రద్ధ కల్గియున్నావా, దానియందు నీకు శ్రద్ధవుందని ఆమెకు కనబరుస్తావా? ఆమె ఆ రోజునెలా గడిపింది? పిల్లలకేమైంది? ఇంటికి వచ్చిన వెంటనే ‘ఈ రాత్రి భోజనమేమిటి?’ అని అడిగి భోజనం తర్వాత వార్తాపత్రికను తలకు అడ్డం పెట్టుకొని ఆమె నీతో మాట్లాడాలనే కుతూహలంతో దగ్గిరికి వచ్చినపుడు నీవు గొణగటం మొదలుపెట్టవద్దు. నీ భార్యయందు, ఆమె తలంపులందు, ఆమె పనులందు, జరిగే వాటియందు ఆమెకున్న భావాల్లో నీవు శ్రద్ధ చూపించు. ఆమె పథకాలను ప్రోత్సహించు, ఆమె కార్యసిద్ధిని సామెతలు 12:18; 16:24.
మెచ్చుకో. ఆమె చేసే దానికి నీవు సహాయపడితే, ఆమె నిర్లక్ష్యపరచిన వాటిని ఆమె చేయడానికి ఆరంభించవచ్చునేమో. విమర్శ విషం వంటిది, క్రుంగదీసేదై వుండవచ్చును. కానీ అవసరమైనచోట ఇచ్చే వాస్తవమైన అభినందన ప్రాణాన్ని తెప్పరిల్ల చేయగలిగేంత ఉపశమనాన్నిచ్చే మందు, ఉత్తేజాన్ని కల్గించే పదార్థం!—25, 26. (ఎ) బహుమానము భార్యకెట్టి సమాచారాన్నిస్తుంది? (బి) ఎటువంటి బహుమానాన్ని ఆమెకివ్వడం అతి ప్రాముఖ్యం?
25 అప్పుడప్పుడు నీవామెకు ఏదైనా బహుమతినిస్తావా? పెద్ద ఖరీదైన వస్తువేమీకాకున్నను, ఏదో ఒక చిన్న వస్తువును అంటే ‘నేను నీకివ్వాలనుకున్నాను’ అని తెలుపగల వస్తువును ఇవ్వవచ్చును. ప్రత్యేక సమయాల్లోనే ఇవ్వవలసిన అవసరమేమీ లేదు, నీవామెకు అది ఇవ్వాలని తలంచావు, అంతేగానీ మరే ఇతర కారణం లేకుండా, ఎవరి ప్రోద్భలం లేకుండగనే ఇవ్వవచ్చు. అనుకోని ఆనందాలు ఎల్లప్పుడూ ఉల్లాసకరంగా వుంటాయి. ఆమె నీకిష్టమైన ప్రత్యేక వంటను నీకు తెలియకుండానే వండి నీకు వడ్డిస్తే నీవు సంతోషించవా? ఆలాగే నీవును ఆమెను ఆశ్చర్యంలో ముంచెయ్యి, ఆమెకు ఆనందాన్ని అందించు. చిన్న జ్ఞాపకార్థములు, ప్రేమతో ఇచ్చేవి, మామూలుగా ఇచ్చే బహుమతులకన్న—బహుశ సణుగుతూ, గొణుగుతూ ఇచ్చే వాటికన్న—తప్పనిసరియనే భావంతో ఇచ్చినవాటికన్న, మిన్నయైనవి. “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:7) అలాగే భార్యలు కూడ ప్రత్యేక రకమైన వంట కాకపోవచ్చును గానీ దీనిని జ్ఞాపకముంచుకొనండి, “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.”—సామెతలు 15:17.
26 నిన్ను నీవు అప్పగించుకొనుట—నీ సమయాన్ని, నీ శక్తులను, నీ అవధానాన్ని, నీ ఆలోచనలను, ప్రాముఖ్యంగా నీ హృదయంలో వున్నవాటిని అందించుట అతిప్రాముఖ్యం. చాలమంది పురుషులకిది కష్టంగా ఉంటుంది. మురిపించి మాట్లాడడం బుద్ధిహీనమని, పురుష లక్షణం కాదని వారికి తోచునేమో. అయితే నీవు నీ భార్యను ప్రేమిస్తే ఒకసారి ఆమెను అలాచూసి, స్పర్శించి, ఒక మాట మాట్లాడితే, అది ఆమెనెంతగా పరమగీతము 1:2, 15; లూకా 6:38.
మురిపిస్తుందో నీవు జ్ఞాపకముంచుకో. ఇవి లోపిస్తే ఆమెకెంతో నిరాశ, నిస్పృహ, అసంతోషం కలుగవచ్చు. కాబట్టి బైబిల్లో వ్రాయబడిన పరమగీతముల మాదిరిని అనుసరించండి. ఇతరుల ఎడల అనురాగబంధాలను వ్యక్తపరచుటవలన, వాటిని వ్యక్తపరచిన వారికది శ్రేష్ఠం. మనుష్యులు నిరాటంకంగా, ఉత్సాహపూరితులగు వారివలన ఆకర్షింపబడతారు. మరి ఉత్సాహపూరిత వ్యక్తి అనగా ఎవరు? తాను లక్ష్యపెట్టేవారికి తన భావాలను, ఉత్సాహాన్ని బయలుపరచే వ్యక్తియేగదా. అట్టి ఉత్సాహం అంటురోగంవంటిది; అది ఇచ్చినవారికి మరల తిరిగివస్తుంది.—27, 28. (ఎ) భర్త తాను సరియైన శిరస్సత్వాన్ని నిర్వహిస్తున్నాడా లేదాయని ధృవపరచుకోవడానికి తన్నుతాను ఏమని ప్రశ్నించుకోవచ్చు? (బి) ఈ విషయంలో శ్రద్ధ కనబరచుట ఎందుకు మంచిది?
27 భర్తా, నిన్ను నీవే ఇలా ప్రశ్నించుకో: నా యాజమాన్యం, నా భార్య గౌరవించగల్గునంత సులభమైందా? నేను ఆమెను నావలె ప్రేమిస్తున్నానా? లేక నా తృప్తి, నా కోరికల విషయంలో మాత్రమే నేను శ్రద్ధ కల్గియున్నానా? ఆమె అవసరతలను ఎంతవరకు లక్ష్యపెడుతున్నాను? కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసికొనకమునుపే ఆమె అభిప్రాయాలు వింటున్నానా, ఆమె కోరికలను లక్ష్యపెడుతున్నానా? నేను ఆమె క్షేమాన్ని దృష్టిలో వుంచుకొని నిర్ణయాలు చేస్తున్నానా? తాను బలహీన ఘటమని, స్త్రీయని ఆమెను సన్మానిస్తున్నానా? నేను ఆమెతో సంభాషిస్తున్నానా, నా హృదయాన్ని ఆమె కొరకు తెరచియుంచానా?
28 నీవు వీటన్నిటిని పరిపూర్ణంగా నెరవేర్చలేవు. కానీ నీవు పట్టుదలతో కూడిన వినయంగల ప్రయత్నం చేస్తే, నీ భార్య ప్రగాఢ గౌరవాన్ని, దేవుని అంగీకారాన్ని పొందే భర్తగా నిన్ను తయారు చేయుటకిది తోడ్పడుననే దృఢనమ్మకాన్ని కల్గియుండగలవు.
[అధ్యయన ప్రశ్నలు]
[49వ పేజీలోని చిత్రం]
స్వల్పకార్యాలు అత్యంత ప్రభావం కల్గిస్తాయి