మీ కుటుంబానికి ఇతర ఉపకరణాలు
మీ కుటుంబానికి ఇతర ఉపకరణాలు
మీ కుటుంబం కోసం ఇతర విలువైన సాహిత్యాలు కావాలనుకుంటున్నారా? ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో దేనినైనా ఒకదానిని లేక అన్నింటిని తర్వాతి పేజీలోనున్న మీకనుకూలమైన అడ్రసునుపయోగించి వాచ్టవర్కు వ్రాసి పొందవచ్చును.
• నా బైబిలు కథల పుస్తకము. పెద్ద సైజు పేజీలతో (దాదాపు 7ʺ x 9ʺ) కూడిన ఈ పుస్తకంలో బైబిలునుంచి తీసుకోబడ్డ 116 కథలున్నాయి. చరిత్ర జరిగిన క్రమంలోనే అవి కూర్చబడ్డాయి. ఈ పుస్తకం ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు తయారుచేయబడింది. చదివే వయస్సులేని చిన్నపిల్లలు కూడా పుస్తకంలోని అందమైన చిత్రాలనుండి ప్రయోజనం పొందగలరు. ఇది పసుపు-బంగారపు వన్నెగల అట్టపై ఎర్రని పేరుతో ముద్రించబడ్డ 256 పేజీల పుస్తకం. పెద్ద అచ్చు, మంచి పేపరు ఉపయోగించబడింది. ఇది 40.00 రూపాయల చందాకు లభ్యమవుతుంది.
• లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్. ఈ పుస్తకం కూడా చిన్నపిల్లల కొరకు తయారుచేయబడిందే. తలిదండ్రులను పిల్లలను దగ్గరకుచేర్చి, నేర్చుకోవడం ఓ ఆనందదాయక అనుభవంగా చేసే బోధనా పద్ధతులు అందులో ఉపయోగించబడ్డాయి. బైబిలుయొక్క ఉన్నత నైతిక ప్రమాణాలను పిల్లలకు బోధించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశము. జీవితంలోని శ్రేష్ఠమైన సూత్రాలను పిల్లలకు బోధించడంద్వారా వారు నేటి సమస్యలను ఎదుర్కొనేలా వారికి మీరు నిజంగా సహాయపడగలరు. మనోహరంగా వివరించబడిన ఈ గట్టి అట్టగల, 192 పేజీల పుస్తకం, పెద్ద అచ్చులో, సులభంగా అర్థం చేసుకోగల పదాలతో ఉంది. ఇది 12.00 రూపాయల చందాకు లభ్యమవుతుంది.
• యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు. ఈనాటి లోక దుర్నీతి ప్రభావాల్ని ఎదిరించేందుకు ఈ పుస్తకం యౌవనులకు సహాయపడును. వంచన, మద్యపానము, మాదకద్రవ్యాలు, లైంగిక దుర్నీతి, చెట్టాపట్టాలేసుకొని తిరగడం, జతగా తిరగడం, మొదలైనవి ఇందులో చర్చించబడిన కొన్ని అంశాలు. ఇది 320 పేజీల పుస్తకము. ఇది 20.00 రూపాయల చందాకు లభ్యమవుతుంది.