కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహ దినానంతరము

వివాహ దినానంతరము

అధ్యాయము 3

వివాహ దినానంతరము

1. ప్రసంగి 4:9, 10 నందు వివరించబడి నటువంటి సహకారం ఒకని వివాహానికి ఎలా సహాయపడగలదు?

నీ వివాహం జరిగిపోయింది, నీవు నీ జంటతో కలిసి క్రొత్త కాపురంలో ప్రవేశిస్తున్నావు. నీ సంతోషం పరిపూర్ణమైందా? నీవిక ఒంటరిగా లేవు, నీవు నమ్మకం కల్గివుండడానికి, నీ కష్టసుఖాలను పంచుకోవడానికి నీకొక తోడు దొరికింది. ప్రసంగి 4:9, 10 వచనాలు నీ విషయంలో సత్యమని నీవు గ్రహించావా?—“ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వాని లేవనెత్తువాడు లేక పోవును” గదా? నీ వివాహం ఇలాంటి సహకారంతోనే పెంపారుచున్నదా? ఇద్దరి జీవితాలు ఇలా ఆనందంగా కలిసిపోవడానికి కొంత సమయం ప్రయత్నం అవసరమే. కానీ అనేక వివాహిత జీవితాల్లో అసలు ఇలా జరగడంలేదని చెప్పడం చాలా విచారకరంగా ఉంది.

2, 3. (ఎ) వివాహానంతరం జీవితంలో ఎలాంటి వాస్తవాలను ఎదుర్కొనవలసి వుంటుంది? (బి) ఒకరి వివాహానంతరం అవసరమైన మార్పులు చేసుకోవలసిన అవసరముందనుట ఎందుకు సహేతుకమై యున్నది?

2 ప్రేమ కథల్లో, తరచూ ప్రేమికులిద్దరిని కలపడం ఒక సమస్యగా వున్నట్లు కనబడుతుంది. కానీ కలిసిన తదుపరి వారిద్దరూ ఆ క్షణము నుండి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అన్నట్లు చూపబడుతుంది. నిజజీవితములోనైతే వివాహానంతరం దినదినము సంతోషంగా జీవించుట ఒక నిజమైన సవాలుగా ఉంటుంది. వివాహదినపు ఆనందాలను అనుభవించిన పిమ్మట ఇక దైనందిన జీవితం ప్రారంభమౌతుంది: అనగా పెందలకడ లేవడం, పనికి వెళ్ళడం, కొనడం, వంటావార్పు చేయడం, వంట పాత్రలు, ఇంటిని శుభ్రం చేయడం మొదలైన పనులుంటాయి.

3 వివాహబంధంలో మార్పులు అవసరం. క్రియారూపకం, వాస్తవంకాని కొన్ని కనీసపు ఆశయాలు, అభిప్రాయాలతో అలాంటి అనుబంధంలోనికి మీరిద్దరు వచ్చారు. ఈ ఆశయాలు నెరవేరనపుడు, మొదట కొన్ని వారాలు గడిచిన అనంతరం కొంతవరకు అసంతృప్తి చెందియుంటారు. అయితే జ్ఞాపకముంచుకొనండి, నీ జీవితంలో నీ వెంతో మార్పుచేసికొని యున్నావు. ఇప్పుడు నీవు ఒంటరిగా జీవించడంలేదు లేక ఇంతకాలం నీవెవరితో నివసించావో ఆ కుటుంబంతో నీవుండడం లేదు. ఇప్పుడు నీవొక క్రొత్తవ్యక్తితో కాపురం చేస్తున్నావు. నీవెరుగని వ్యక్తితో, బహుశ ఆ వ్యక్తిని గూర్చి తెలిసియున్నదనే భావనతో జీవిస్తున్నావు. నీ కార్యక్రమం క్రొత్తది, నీ పని క్రొత్తదే కావచ్చును, నీ ఆర్థిక వ్యయపట్టిక వేరు, మరి క్రొత్త స్నేహితులతోను, క్రొత్త అత్తింటివారితోను అలవాటు పడవలసి వుంటుంది. నీ వివాహానందాల విజయం, వీటిని సర్దుకొని పోవుటలో నీవు చూపే ఇష్టంపై ఆధారపడి వుంటుంది.

నీవు సర్దుకొనిపోగలవా?

4. వివాహమైన వ్యక్తి అవసరమైన మార్పులు చేసుకోవడానికి లేఖనాల్లోని ఏ సూత్రాలు సహాయపడగలవు? (1 కొరింథీయులు 10:24; ఫిలిప్పీయులు 4:5)

4 గర్వమువల్ల సర్దుబాటు చేసికొని పోవుటకు కొందరికి కష్టంగా వుంటుంది. అయితే బైబిలు తెల్పుతున్నట్లు, “నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారము కల్గును.” అహంభావము విపత్కరం కావచ్చు. (సామెతలు 16:18, న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) ఒకడు సర్దుబాటు చేసికొనడానికి, లొంగివుండడానికి ఇష్టాన్ని కనబరచాలని యేసు యీలా సిఫారసు చేశాడు: “నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రమును కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్ళుము” అని తెల్పిన సందర్భంలో ఆయన అట్టి సర్దుబాటును గూర్చి తెల్పాడు. నీతో సన్నిహితంగావున్న వ్యక్తితో వాదించే బదులు, ఇలా చేయాలని అపొస్తలుడైన పౌలు అన్నాడు: “అన్యాయము సహించుట మేలు కాదా?” (మత్తయి 5:40, 41; 1 కొరింథీయులు 6:7) ఇతరులతో సమాధానంగా వుండడానికి క్రైస్తవులు అంతమట్టుకు చేయగల్గినపుడు, ప్రేమానుబంధంలోనున్న, వివాహితులైన ఇద్దరు వ్యక్తులు తమ క్రొత్త సంబంధం జయప్రదం కావడానికి నిశ్చయంగా అవసరమైన మార్పులు చేసికొనగల్గాలి.

5. ఒక వ్యక్తి తన వివాహజతను గూర్చి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలా తలంచవచ్చును?

5 ఒకడు సంతోషాన్నో లేక అసంతోషాన్నో కల్గియుండే అవకాశాలు ప్రతి సందర్భంలోనూ ఉంటాయి. దేని విషయంలో నీవు జాగ్రత్తగా వుంటావు? సదుద్దేశమా? లేక దురుద్దేశమా? దేనియందు దృష్టి ఉంచుతావు? క్రొత్తగా వచ్చిన భార్య ఇలా తలంచవచ్చు: ‘మాకిప్పుడు వివాహమైపోయింది, మరి నన్ను నాకిష్టమైన స్థలాలకు తీసికొనివెళ్ళి, నాతో సమయాన్ని గడిపిన ఆ ప్రియుడెక్కడ? అతనిలో అప్పటి అనుతాపము లేదు. నేను అన్నింటిని అంగీకరిస్తానని అనుకొంటున్నాడు. నిశ్చయంగా అతడు నేను ముందెరిగిన వ్యక్తికాడు!’ లేక ఇప్పుడతడు కుటుంబానికి మంచి పోషణకర్తగా వుండటానికి కష్టించి పని చేస్తున్నాడని ఆమె గ్రహించి అతన్ని అభినందిస్తుందా? మరి యీ నూతన భర్త, తన భార్య వంటపనిలోను, ఇంటిని శుభ్రం చేయుటలోను కష్టించి పనిచేస్తున్నందున అప్పుడప్పుడు ఎంతో అలసిపోయి, అందంగా కనబడురీతిగా అలంకరించుకొనుటకై ఆమెకంత వ్యవధిలేదని గమనిస్తున్నాడా? లేక తనకు తానే ఇలా అనుకుంటున్నాడా: ‘నేను వివాహమాడిన ఆ అందాల ముద్దుగుమ్మ ఏమయ్యింది? తాను కోరిన పురుషుడామెకు దొరికాడు గనుక ఇకామె మారిపోయిందా?’

6. భార్యాభర్తలిద్దరూ, వారి వివాహాన్ని జయప్రదం చేయడానికి కృషిచేస్తే అది వారిద్దరి అనుబంధానికెలా తోడ్పడుతుంది?

6 వివాహానికి ముందు చేసిన క్రియలన్నిటిని ఇప్పుడు ఒక్కరే చేయడానికి సమయంలేదు లేక శక్తిచాలదు అని ఇద్దరూ గ్రహించాలి. సర్దుబాటు చేసికోవడానికి, వివాహాన్ని జయప్రదంగా కొనసాగించడానికి లోతైన తృప్తికరమగు బాధ్యతను చేపట్టుటకిదియే సమయం. ఒకరు వివాహాన్ని విచ్ఛిన్నం చేయవచ్చునుగానీ దాన్ని జయప్రదం చేయుటకు యిద్దరు కావాలి. వివాహాన్ని చేయుట ఒక ఘనకార్యం. ఘనకార్యమనగా ఎన్నికష్టాలున్నను ఒక కార్యాన్ని సాధించి తీరుట. ఈ ప్రయత్నంలో మీరిద్దరూ చేతులు కలిపితే యీ ఘనకార్య సాధనలో మీ మీ వంతు నెరవేర్చినట్లే, ఈ పరస్పర లక్ష్యసాధనమే మీ యిద్దరిని కలుపుతుంది; మిమ్మల్ని సన్నిహితులను చేస్తుంది. అది మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. సకాలంలో మీరు మీ వివాహానికి ముందు ఊహించిన వాటన్నిటికంటె గొప్పదైన ప్రేమానుబంధాన్నిది కల్గిస్తుంది; మరి అలాంటి ఐక్యతానందాలతో ఒకరియెడల మరొకరికిగల విభేదాలను మరచి సర్దుబాటు చేసికొనుటకానందిస్తారు.

7. తీర్మానాలు చేయవలసివస్తే, ఎప్పుడు లోబడియుండుట మంచిది?

7 ప్రేమ వర్ధిల్లగా గర్వం క్షీణిస్తుంది, సంతోషమనేది కట్టుబాటులో లేదు గానీ ఇచ్చుటతోపాటు విధేయత, అణకువ, వ్యక్తిగత ఇష్టాలు కనబరచుటలో ఇమిడియున్నది. అది, ఇంటికొరకు ఒక వస్తువును కొనుటయే కావచ్చును లేదా సెలవుకాలాన్నెలా గడపాలనే విషయమే కావచ్చు. ఇతరుల సంతోషం ఎడల శ్రద్ధచూపితే, ఆ దంపతులు అపొస్తలుడైన పౌలు మాటలకు తగినట్లు ప్రవర్తిస్తారు: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:4.

దాంపత్య జీవితాన్ని గూర్చి సమదృష్టి కల్గియుండుట

8, 9. దాంపత్య జీవితాన్నిగూర్చి లేఖనాల దృష్టి ఏమిటి?

8 బైబిలు దాంపత్యజీవితాన్ని దాచడంలేదు. కాని కవితారూపంలో, దీనివల్ల భార్యాభర్తల మధ్య కలిగే ప్రగాఢమైన అనుభూతిని గూర్చి తెల్పుతుంది; దాంపత్య జీవితం భార్యాభర్తలకే పరిమితమై యుండాలని కూడ అది నొక్కితెల్పుతుంది. ఈ వాక్యభాగం సామెతలు 5:15-21 నందు కనుగొనబడును:

“నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవైయుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు? నరుని మార్గములను యెహోవా యెరుగును. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.”

9 అయినను, వివాహం జయప్రదమగుట దంపతుల దాంపత్య సుఖం మీదనే ఆధారపడివుందని లేక ఇద్దరికి సంబంధించిన ఇతర పొరపాట్లను యీ దాంపత్య సుఖంవల్ల సర్దుకొనిపోవచ్చునని అధికంగా నొక్కిచెప్పడం పొరపాటు. పుస్తకాల్లో, సినిమాల్లో, వ్యాపారరీత్యా వచ్చే లైంగికతకు సంబంధించిన సమాచార వెల్లువ—ఇవన్నీ అధికంగా కామదాహాన్ని రేపుటకే కల్పించబడియున్నందున—సంభోగం తప్పనిసరియని చూపిస్తున్నాయి. అయినను దేవుని వాక్యం అందుకు సమ్మతించడం లేదు. అన్ని విషయాల్లోనూ ఆశానిగ్రహాన్ని సిఫారసు చేస్తుంది. జీవితంలో సహితం అట్టి క్రియ అదుపు తప్పితే వివాహ సంబంధాన్నే చులకన చేయగల అలవాట్లకు అది దారి తీయగలదు.—గలతీయులు 5:22, 23; హెబ్రీయులు 13:4.

10. వివాహదంపతులు తమ దాంపత్య జీవితంలో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడగల కొన్ని విషయాలేమిటి?

10 వివాహానంతరం దాంపత్య జీవితాన్ని సర్దుబాటు చేసికొనుటకు తరచు కష్టతరంగా వుండవచ్చును, మరి కొంతకాలం పట్టవచ్చును. అజ్ఞానమువల్లను, తన జతయొక్క అవసరతను గుర్తెరుగకపోవుటవల్లను సర్వసాధారణంగా ఇలా జరుగుతుంది. ముందుగానే మర్యాదస్థుడును, వివాహితుడైన స్నేహితునితో అలాంటి వాటిని గూర్చి సంప్రదిస్తే సహాయకరంగా వుండవచ్చును. స్త్రీపురుషులు, వ్యత్యాసంగా సృజింపబడుటయేగాక వారి భావనలు కూడ వ్యత్యాసంగా వుంటాయి. స్త్రీని ఆప్యాయంగా చూచుకొనే అవసరతను గమనించుట ముఖ్యం. అయితే లైంగికానుభూతి ఒక సిగ్గుకరమైన క్రియ అనే భావన లేక నంగనాచితనానికి లేదా అణకువ చూపినట్లు నటించుట అనే వ్యతిరేక తలంపులను కలిగియుండకూడదు. లేదా కొందరు పురుషుల మాదిరి దాంపత్య సుఖమే ఒక ఘనవిజయమన్నట్లుండ కూడదు. ‘భర్త తన భార్య ఎడల తన ధర్మమును నెరవేర్చవలెనని,’ ‘భార్య కూడ తన భర్త ఎడల తన ధర్మమును నెరవేర్చవలెనని’ బైబిలు తెల్పుతుంది. అలా చేయడంలో బైబిలుయొక్క యీ సూత్రం దానికి తగియున్నది: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” ఇరువురి ఇష్టాలను తీర్చుకొనుటకు అట్టి ప్రేమ, అభిలాషవుంటే సర్దుబాటు చేసుకోవచ్చు.—1 కొరింథీయులు 7:3; 10:24.

అసమ్మతి స్వభావం లేకుండానే అసమ్మతిని వ్యక్తపరచండి

11-13. ఇరువురి మధ్యనున్న, భేదాభిప్రాయాలు తీవ్ర విచ్ఛిన్నతలకు దారి తీయకుండా మనం దేనిని మనస్సు నందుంచుకొనవలెను?

11 లోకంలో ఏ ఇద్దరూ ఒకే విధంగా వుండరు. ప్రతివారు తప్పని సరిగా తేడాకల్గివుంటారు. మరి దీని భావమేమనగా, ఏ ఇద్దరు వ్యక్తులైనా ప్రతివిషయంలో ఏకీభవించలేరు. అనంగీకారాల్లో అనేకములు అల్పమైనవేగానీ కొన్ని మాత్రం తీవ్రంగానే వుండవచ్చు. కొన్ని కుటుంబాల్లో అసమ్మతి వ్యక్తమయిన వెంటనే అరుపులు, ఒకరినొకరు నెట్టుకోవడం, కొట్టుకోవడం, వస్తువులను విసిరివేయడం; ఇద్దరిలో ఎవరో ఒకరు కొన్ని రోజులపాటు లేక వారాల తరబడి వేరై ఉండటం లేదా ఒకరితోనొకరు మాట్లాడకుండ మూతిముడుచుకొని ఉండటం జరుగుతుంది. అట్టి పరిస్థితి రాకుండనే అసమ్మతిని తెల్పే అవకాశముంది. ఎలా? కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఎదుర్కొనుటవలన అలా చేయవచ్చును.

12 మనందరం అసంపూర్ణులమే, అందరికి లోపాలున్నాయి, సదభిప్రాయాలున్ననూ, బలహీనతలు వాటంతటవే బహిర్గతమౌతాయి. ఇది తన విషయంలో నిజమని అపొస్తలుడైన పౌలు గుర్తెరిగాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” (రోమీయులు 7:19) మన మొదటి తలిదండ్రుల నుండి మనము పాపాన్ని వారసత్వంగా పొందాము. పరిపూర్ణత మన శక్తికి మించింది. కావున “నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?”—సామెతలు 20:9; కీర్తన 51:5; రోమీయులు 5:12.

13 మనం మనస్వంత బలహీనతలను ఒప్పుకొని వాటినిమిత్తం క్షమాపణ కోరుతాము. మరి మన వివాహజతకున్న బలహీనతలను అంగీకరించి వాటిని క్షమించలేమా? మనం పాపులమని నిశ్చయంగా ఒప్పుకొనుటకు సిద్ధపడతాము కానీ ఒక ప్రత్యేక పాపాన్ని సమర్థించుకొని, దాన్ని అంగీకరించడానికి వెనుకాడుదుమా? ఇలా, తప్పును ఒప్పుకొనక పోవుట సాధారణంగా ప్రజలకున్న అలవాటేనని, అందులో మన వివాహజతకూడ వుందని గ్రహించగల వివేచన మనకున్నదా, మరి మనం వాటిని సర్దుకొని పోతున్నామా? “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” అని ప్రేరేపిత సామెత తెల్పుతుంది. ఇతరులవలె, నీవును నిశ్చయంగా, “బంగారు సూత్రాన్ని” అంగీకరిస్తావు. యేసు యీ విషయాన్ని, ప్రఖ్యాతిగాంచిన తన కొండమీది ప్రసంగంలో తెలిపాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” అనేకులు దాన్ని పెదవులతో ఆచరిస్తారు; కొద్దిమందే దాన్ని అభ్యసిస్తారు. దాన్ని ఖచ్చితంగా అనుసరించడం వల్ల మానవుల అనుబంధానికి సంబంధించిన సమస్యలు, వివాహ సమస్యలు కూడ తీరిపోతాయి.—సామెతలు 19:11; మత్తయి 7:12.

14, 15. (ఎ) ఒకడు తన వివాహజతను అనవసరంగా మరొకరితో పోల్చినపుడు ఏమి సంభవిస్తుంది? (బి) కొన్నిసార్లు ఏయే విషయాల్లో అజ్ఞానంగా అలా పోల్చుతారు?

14 మనలో ప్రతివారు, ఒక వ్యక్తిగా తలంచబడాలని, పరిగణించబడాలని కోరుకుంటారు. ఒకడు మనల్ని వేరొకనితో ప్రతికూలంగా పోల్చితే, బహుశ మన గుణగణాలు లేదా సామర్థ్యము తక్కువని చెబితే మనకెలా వుంటుంది? సాధారణంగా మనం బాధపడతాం లేక యిష్టపడం. అనగా ‘నేనావ్యక్తిని కాదే, నేను నేనే’ అని అంటున్నట్లే దాని అర్థం. సాధారణంగా అలా ఇతరులతో పోల్చుకొనడం ప్రోత్సాహకరమైంది కాదు, ఎందుకంటే మనం తెలివిగల వారిగా పరిగణింపబడాలని కోరుకుంటాము.

15 ఈ విషయాన్ని వివరించాలంటే: భర్తవైన నీవు, నీ భార్య చేసే వంటను మెచ్చుకుంటున్నావా లేక నీ తల్లివలె ఆమె వంట చేయలేదని ఫిర్యాదు చేస్తున్నావా? నీ తల్లి క్రొత్తగా పెళ్ళి చేసికున్నప్పుడు వంట ఎంత బాగుగా చేసిందో నీకు తెలుసా? నీ భార్యే ఆమెకంటె ఎక్కువ రుచికరంగా వంట చేస్తుందేమో. క్రొత్త క్రొత్త పనులుచేసి వాటిలో నైపుణ్యాన్ని సంపాదించుకొనుటకై భార్యకు అవకాశమివ్వండి. మరి భార్యయైన నీవు క్రొత్తగా పెళ్ళిచేసికొన్న నీ భర్త నీ తండ్రివలె తన జీతమంతా ఇంటికి తీసికొనిరాడని ఫిర్యాదు చేస్తున్నావా? నీ తండ్రి క్రొత్తగా పెండ్లి చేసికొన్నప్పుడు ఎంత సంపాదించేవాడో? అదీ అవసరం లేదు. అవసరమైందల్లా నీ భర్తకు నీవు చేసే సహాయమే. నీవు పెందలకడనే లేచి, ఆయన ఉద్యోగానికి వెళ్ళకముందే అతనికి నాస్త తయారుచేసి ఇస్తున్నావా? అందువల్ల, తన కష్టాన్ని నీవు గ్రహించినట్లు, తనకు నీవు మద్దతు నిస్తున్నట్లు ఆయన భావిస్తున్నాడా? అత్తింటి వారి విషయంలో పరస్పరంగా తగవులాడుకుంటున్నారా లేక స్నేహితులను ఎన్నుకొనడంలో అనంగీకారం, లేదా వినోదం విషయంలో అసమ్మతిని వ్యక్తపరచుకుంటున్నారా? ఇటువంటివి మరి ఇతర అనంగీకారాలు తలెత్తవచ్చు. నీవు వాటినెట్లు పరిష్కరిస్తావు?

16. సమస్యలు తీర్చడానికి తగవులాటలు అవసరమని చెప్పే సిద్ధాంతంలో తప్పేమిటి?

16 సమస్యల పరిష్కారానికి తగవులాటలు ఉపయోగకరమని ఆధునిక మనస్తత్వశాస్త్రజ్ఞులలో కొందరి అభిప్రాయం. ఇలాంటి వివాదాలు పెరిగి ఒత్తిడి పుట్టించి చివరకు పెద్ద కొట్లాటలకు దారితీస్తాయి. అట్టి కోపతాపాలలో దీర్ఘకాలంగా అణగియున్న వాటిని వెళ్ళగ్రక్కుతారు, బహిరంగంగా చెప్పుకొంటారు, అప్పుడు వాటిని తొలగించుకుంటారు—అని ఆ సిద్ధాంత వాదన. ఇది జరగనంతవరకు, వివాదాలు లోలోపల అణగి, వ్యాకులపడి, పిదప కొంతకాలానికి ఉద్రిక్తమౌతాయి. అయితే అలాంటి వాటిలో గొప్ప అపాయముంది, ఇట్టి ఆవేశపూరితమగు కోపోద్రేకాలు నీవు తలంచనివాటిని చెప్పేలా నిన్ను నడపవచ్చు, మనస్సుకు మాయని గాయం తగలవచ్చు. నీవు ఎదుటి వ్యక్తి ఎడల ఎంతో తీవ్రమైన తప్పును చేస్తావేమో, తద్వారా మీ యిద్దరిని కలుపజాలనంత అగాధం ఏర్పడుతుంది. సామెతలు 18:19 ఇలా హెచ్చరిస్తుంది: “బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.” బైబిలునందు కనుగొనబడు శ్రేష్ఠమైన హెచ్చరిక ఏమంటే, “కలహం చెలరేగక ముందే విడిచిపెట్టుము.”—సామెతలు 17:14 రివైజ్‌డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌.

సంభాషించుకొనండి!

17. లోలోపల దాచుకున్న అసమ్మతి పెరిగి పెల్లుబుకే స్థితికిరాకుండా ఆపడానికి ఏమి చేయవచ్చును?

17 నీలో అసమ్మతి భావాలు బ్రద్దలయ్యేంత పెద్దగా అవి పెరగక ముందే వాటిని గూర్చి చర్చించడం ఎంతో ఉత్తమం. తప్పును దాచిపెట్టి పెరగనివ్వడంవల్ల అది దాని నిజస్థితికంటె ఇంకా హీనస్థితికి దిగజారిపోవుట దాదాపు ఎప్పుడూ జరుగుతునే వుంటుంది. దాన్నిగూర్చి అప్పుడే చర్చించండి లేదా దాన్ని మరచిపోండి. ఏదో అది జారిపోయే మాటేనా? ఆలాగైతే దాన్ని అలాగే జారిపోనివ్వండి. అది చర్చించ నగత్యతగలదేనా? నీ జత నిన్ను బాధపెట్టేపని ఏదైనా చేశాడా? గ్రుడ్డిగా ఖండించవద్దు; ప్రశ్న రూపంలో విషయాన్ని అడిగి తెలిసికొనడానికి ప్రయత్నించండి లేదా చర్చించడానికి తగిన సలహాయివ్వండి. ఉదాహరణకు నీవిలా అనవచ్చు: ‘ప్రియా, నేను గ్రహించనిదేదో వుంది. ఇందుకు నీవు నాకు సహాయపడగలవా?’ తదుపరి తాను చెప్పేది వినండి. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని అర్థముచేసికోవడానికి ప్రయత్నించండి. సామెతలు 18:13 నందలి హెచ్చరికను లక్ష్యపెట్టండి: “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” ఒకరు వెంటనే మనలను తప్పుగా భావిస్తే, మనలో ఎవ్వరూ దాన్ని ఇష్టపడరు. కాబట్టి తక్షణమే ప్రతి క్రియచేసే బదులు, ఆ క్రియ వెనుకగల అభిప్రాయాన్ని లేక ఉద్దేశాన్ని వివేచించడానికి ప్రయత్నించండి. సామెతలు 20:5 ఇచ్చిన సలహా ప్రకారం ప్రవర్తించండి: “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.”

18. వ్యతిరేక స్వభావాలను తొలగించుటకేది మనకు తోడ్పడవచ్చు?

18 నీకు మానసిక అస్థిరతవుందా? మానసిక అస్థిరతగల వ్యక్తి ఇతరులతో జీవించుట కష్టమే. మానసిక అస్థిరతలు మన ఆధీనమందు లేవని అవి మెదడులోనే రసాయన పదార్థాల వలన నడుపబడతాయని కొందరి అభిప్రాయం. అది నిజమో కాదో తెలియదు గానీ, స్వభావాలు మాత్రం అంటురోగాలవంటివి. మనం మన చుట్టున్న వారినిబట్టి సంతోషించగలం లేదా విచారించగలం. సంగీతం మనలో అనేక భావాల్ని సృష్టించగలదు. కథలు కూడ ఆలాగే చేయగలవు. మన మనస్సులో దాగివుండే ఆలోచనలు, మనం తలంచే పద్ధతిపై ప్రభావము కల్గివుంటాయి. నీవు వ్యతిరేక భావాలను కూడబెట్టుకొనివుంటే మానసికంగా కృంగిపోతావు. చిత్తవృత్తివలన నీవు నీ మనస్సును, సహేతుకమైన, శ్రేయస్కరమైన తలంపులను తలంచేటట్లు చేయగలవు. అట్టి తలంపులను గూర్చి ధ్యానించండి. (ఫిలిప్పీయులు 4:8) ఇది కష్టమని నీవనుకుంటే, శరీర కష్టం చేయండి—శ్రమించి పనిచేయండి, అది కలుపు మొక్కలు తీయుటేగానీ చెమటోడ్చి గదిని తుడుచుటేగానీ; బయటకు వెళ్లి పరుగెత్తండి లేదా చెట్లమధ్య నడవండి లేదా అంతకంటె మంచి పని ఏదైననూ సరే మరొకరికి సహాయకరమగు దానిని వెదకి దాన్ని చేయండి—నీ మనస్సు, శక్తి సామర్థ్యతలను, మరొక స్థలంలో పని చేయగల దేనివైపునకైననూసరే మళ్ళించండి. దురభిప్రాయంకన్నా సదభిప్రాయాన్ని పెంచుకొనుటయే శ్రేష్ఠం, అది నీకు నీ జతకు నిశ్చయంగా ఎంతో సరదాగా వుంటుంది!

19. తన వివాహజత మానసిక స్థితికి తగినట్లుగా తానెట్లు ప్రవర్తింపవచ్చును?

19 అయినను పరిస్థితులు నిన్ను విచారంలో ముంచివేసే సమయాలున్నవి లేక వ్యాధి, వేదన నిన్ను బాధపెడతాయి. లేక నీ భార్య విషయంలోనైతే, రుతుస్రావములు, గర్భధారణ మూలంగా శక్తివంతమగు హార్మోనులు రక్తస్రావముల ద్వారా బహిర్గతమై ఆమె నరముల నిర్మాణమును, బావ ప్రేరణలను బాగుగా బలహీనపరుస్తాయి. స్త్రీ తనకు తెలియకుండానే రుతుస్రావానికి ముందు శారీరకంగా కలిగే నొప్పివల్ల బాధపడుచుండ వచ్చు. అలాంటి సమయాల్లో భర్త విసుగుచెందే బదులు యీ ముఖ్యాంశాన్ని మనస్సునందుంచుకొని, సూక్ష్మబుద్ధిని చూపవచ్చు. అట్టి విశేష సమయాల్లో భార్యాభర్తలిద్దరూ వారి ఉద్రేకానికిగల కారణమేమిటో గ్రహించి, యుక్తంగా ప్రవర్తించాలి. “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.” మరియు “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 16:23; 17:17.

20-22. (ఎ) వ్యర్థమగు మత్సరమును ఎందుకు వదలుకోవాలి? (బి) తన వివాహజత క్షేమంగానున్నట్లు భావించుటకేమి చేయాలి?

20 నీవు వివాహమాడిన వ్యక్తికి మత్సరముందా? తనకున్న పేరు ప్రతిష్ఠలు, వివాహవిషయాల్లో తాను మత్సరపడుట సమంజసమే. వినాళ గ్రంథులు మరల హృదయస్పందనను వృద్ధిచేయుటకారంభించే రీతిగానే, మత్సరము దాచబడినదాని పక్షం వహిస్తుంది. మత్సరమునకు వ్యతిరేకమైనది నిర్లక్ష్యము. మరి మనం మన వివాహం విషయంలో నిర్లక్ష్యంగా వుండకూడదు సుమా.

21 అయితే మరొక విధమైన మత్సరమున్నది, అది సందేహముల ప్రేరేపణ, ఊహలవల్ల కల్గిన మత్సరము. వివేచనాశూన్యమగు పిచ్చి మత్సరం, వివాహాన్ని అసంతోషకరమగు బందిఖానాగా మార్చుతుంది, అచ్చట నమ్మకం, నిజమైన ప్రేమ నిలువజాలవు. అట్టి పద్ధతిలోనైతే “ప్రేమ మత్సరపడదు,” విషపూరితమగు మత్సరం “ఎముకలకు కుళ్లు.”—1 కొరింథీయులు 13:4; సామెతలు 14:30.

22 నీ జత మత్సరంవల్ల తనకు భద్రతలేదని భావించడానికి న్యాయసహితమగు హేతువుంటే, వెంటనే దాన్ని తొలగించండి. నిజమైన కారణం లేకపోతే, మాటలద్వారా అతి ముఖ్యంగా నీ క్రియల ద్వారా మత్సరపడిన ఆ వ్యక్తిలో దృఢ నమ్మకాన్ని కల్గించడానికి నీ శక్తికొలది కృషిచేసి, హృదయాన్ని ఆకట్టుకో.

23. వివాహసమస్యలు తీర్చడానికి, పరుల సహాయం వెదకాలని తలంచే వ్యక్తి, ప్రయోజనకరమగు రీతిగా దేనిని గూర్చి ఆలోచించవచ్చును?

23 వివాహితులమధ్య తగాదాలను తీర్చడానికి పరులు సహాయపడగలరా? బహుశ సహాయపడవచ్చును కానీ ఇరువైపులవారు అందుకు సమ్మతిస్తే తప్ప వారిని పిలువకూడదు. మొదటిగా, “నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము.” (సామెతలు 25:9) అత్తింటివారి సలహాను అడుగుటలో ప్రత్యేకంగా చిక్కున్నది. వారు నిష్పక్షపాతులు కాకపోవచ్చును, జ్ఞానయుక్తంగా బైబిలిట్లు తెల్పుతుంది: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) భార్యకు కూడ తన తలిదండ్రులకు, భర్తకు సంబంధించినవాటి విషయాల్లో అది, వర్తిస్తుంది. వారివారి తలిదండ్రులను అత్తింటి వారిని తగవు తీర్చమని అడిగే బదులు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బంధువుల మద్దతుపొందే బదులు, భార్యాభర్తలిద్దరు కలిసికట్టుగా వుండి, వారిద్దరే సమస్యలను ఎదుర్కొనేవారని, వాటిని వారిద్దరు కలిసి పరిష్కరించుకోవలసిన అవసరముందని గుర్తెరగాలి. ఒకరి సమ్మతి లేకుండ పరులను పిలుచుటవలన ఇతరుల దృష్టిలో ఇద్దరూ చులకనై పోతారు. నీవు నిర్మొహమాటంగా యథార్థంగా ప్రేమతో సంగతులను సమాలోచిస్తే మీ సమస్యలను మీరే పరిష్కరించుకొనలేని పరిస్థితి కలగడానికిగల కారణముండదు. అనుభవంగలవానిని సలహా అడుగవచ్చును. కానీ పరిష్కారం తుదకు మీ ఇద్దరిమీదే ఆధారపడివుంది.

24, 25. వివాహ సమస్యలను తీర్చుకొనుటలో గర్వం అడ్డొస్తుంటే ఒకడేమి చేయాలి?

24 “తన్నుతాను ఎంచుకొనుదానికంటె ఎక్కువగా ఎంచుకొనవద్దు లేక అధికంగా ఎంచుకొనవద్దు” అని అపొస్తలుడైన పౌలు సలహా ఇస్తున్నాడు (రోమీయులు 12:3, న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) తదుపరి ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) కొన్నిసార్లు మన గర్వమణచబడినపుడు మనం నిజంగా అంతగొప్పవారం కామని గ్రహించుటకది సహాయపడుతుంది. నిశ్చయంగా మనలను భూమితో పోల్చితే మనమంత పెద్దవారం కాము. భూమి సూర్యకుటుంబములో ఎంతో చిన్నది ఆ సూర్యకుటుంబం విశ్వంలో ఎంతో చిన్నది. యెహోవా దృష్టిలో “జనములు లేనట్టుగానే యుండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.” (యెషయా 40:17) అటువంటి తలంపులు, మనము సంగతులను సరిగ్గా వాటివాటి పరిమాణములో చూడటానికి, అంగీకారములు అంత ప్రాముఖ్యమైనవికావని గ్రహించడానికి సహాయపడతాయి.

25 అప్పుడప్పుడు చేసుకునే తమాషా కూడ వీటిని మనం అంత తీవ్రంగా తీసికొనకుండ వుండడానికి సహాయపడవచ్చు. నిన్ను నీవు పరిహసించుకోగల్గితే అది నీ పరిపక్వతకు గుర్తు, మరి అది జీవితంలోని అనేక గడ్డు సమస్యలను సరిచేస్తుంది.

“నీ ఆహారమును నీళ్లమీద వేయుము”

26, 27. పరస్పర భేదాలను సావధానంగా పరిష్కరించుకోవడానికి వివాహ జత సమ్మతించకపోతే బైబిలునందలి ఏ సూత్రాలను వర్తింపజేయాలి, ఎందుకు?

26 పరస్పర భేదాలను సావధానంగా పరిష్కరించుకోవడానికి నీవు చేసే ప్రయత్నాలను నీ జత ఒప్పుకొనకపోతే అప్పుడేమి చేస్తావు? బైబిలు సలహాను పాటించండి: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.” ఈ విషయంలో మనం అనుకరించడానికి యేసు మాదిరియైయున్నాడు: “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు.” సాధారణంగా ప్రజలకున్న అలవాటు ఎదుటివాడు చేసిందే వీడు చేసి చూపడమే. నీవును అట్టిదానికి అలవాటుపడితే ఇతరులు నిన్ను సరిదిద్దేలా, వారు నిన్ను నిన్నుగానే తయారుచేయడానికి అనుమతించినట్లే అవుతుంది. కాని వాస్తవానికి వారు నిన్ను తమవలె తయారుచేస్తారు. దీనిని జరుగనిస్తే నిన్ను, నీ స్థానాన్ని, ప్రేమతో నీవనుసరించు నియమాలను తృణీకరించినట్లే అవుతుంది. దీనికి బదులు, యేసును అనుకరించండి, ఆయన తానేమైయున్నాడో దానినే హత్తుకొంటూ తన చుట్టు ఉన్నవారి బలహీనతలను బట్టి మార్పుచెందక నిలకడగా వున్నాడు: “మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.”—రోమీయులు 12:17; 1 పేతురు 2:23; 2 తిమోతి 2:13.

27 కీడును మేలుచే జయించగల సమర్థుడవైతే మంచినే చేయడానికి ఉపక్రమించు. “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) మృదువైన సమాధానం బలహీనతనుండి వచ్చునది కాదుగానీ బలమునుండియే వస్తుంది, మరి నీ జత దీనిని గుర్తించును. అనేకులు కీడుకు ప్రతి కీడు చేస్తారు గనుక నీవు మంచితనం ద్వారా కీడును మేలుగా మార్చవచ్చు. కొన్ని లేఖనాలు దీనిని ఇలా తెల్పుతున్నవి: “నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.” “మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.” “నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.” (సామెతలు 11:25; లూకా 6:38; ప్రసంగి 11:1, రివైజ్‌డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌) నీ మంచితనం ఫలించి నీ జతనుండి మేలును రాబట్టుటకు కొంతకాలం పట్టవచ్చును. నీవు యీరోజు విత్తనము విత్తి రేపే పంటను కోయవు. అయినను, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. . . . మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:7-9.

28. బైబిల్లోని సామెతల పుస్తకంలో, సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపడానికి సహాయపడే కొన్ని శ్రేష్ఠమైన సూత్రాలేమిటి, అవెలా సహాయపడతాయి?

28 వివాహ దంపతులు గమనించుటకు ఇచ్చట కొన్ని లేఖనాలు, ప్రశ్నలు పొందుపరచబడినవి:

సామెతలు 14:29: “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.” నీవు ఆలోచించడానికి సమయం తీసికుంటే, కోపపడడానికి సరియైన హేతువు లేదని తరచూ నీవు గమనించడం లేదా?

సామెతలు 17:27: “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.” నీవెప్పుడూ మెత్తగా వుండి, నీ జతను ఉత్తేజపరచుమాటలేమీ చెప్పకుండవుంటావా?

సామెతలు 25:11: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” ఒకసారి సరియైనదిగా కనబడు మాట మరియొకసారి తప్పుగా కన్పిస్తుంది. సమయోచితంగా మాట్లాడే ఇంద్రియ జ్ఞానం నీకుందా?

సామెతలు 12:18: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” నీమాటల ప్రభావం నీ జతపై ఎలా ఉంటాయోనని నీవు మాట్లాడక మునుపే కొంచెం ఆగి ఆలోచిస్తావా?

సామెతలు 10:19: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” కొన్నిసార్లు ఆందోళనలో మనం మనమనుకున్న దానికంటె అధికంగా మాట్లాడతాం. తరువాత బాధపడతాం. ఇటువంటి విషయాల్లో నీవు జాగ్రత్తపడతావా?

సామెతలు 20:3: “కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.” వాదించడానికి ఇద్దరు అవసరం. నీవే ఆ వాదనను ఆపగల పరిపక్వత కల్గియున్నావా?

సామెతలు 10:12: “పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును.” నీవు గతించిన వాటిని త్రవ్వి బయటికి తీస్తావా లేక వాటిని వెనుకకు త్రోసివేయ గల్గినంత ప్రేమను నీజత ఎడల నీవు కనబరుస్తావా?

సామెతలు 14:9, “న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌”: “మూఢులు మార్పులు చేసికొనుటలో ఎంతో మొండితనము చూపిస్తారు; సమాధానపడుట అనగానేమో యథార్థవంతులకు తెలుసు.” నీవు పొరపాట్లను క్షమించకుండ నీవివాహంలో సమాధానాన్ని వెదకకుండేంత అహంకారివా?

సామెతలు 26:20: “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.” నీవు వాదించకుండ వుంటావా లేక ఆఖరిమాట కూడ అనాలని అనుకుంటావా?

ఎఫెసీయులు 4:26: “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” విభేదములతోనే గడుపుతూ, దానివల్ల కలుగు అశాంతిలోనే నీవు, నీజత మ్రగ్గిపోతారా?

29. సంతోషభరితమగు వివాహంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నించడంలో ఏ కొన్ని ముఖ్య విషయాలను మనస్సు నందుంచుకోవాలి?

29 జ్ఞానయుక్తమైన హెచ్చరికను అమలు పరచినపుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం కల్గుతుంది. ప్రయత్నించి చూడండి. అదేరీతిగా, నీజత ఇచ్చే సలహాను తీసికొనుటకు ఒప్పుకోండి. అది పని చేస్తుందేమో చూడండి. ఏదైనా తప్పు జరిగితే ఎవరిని నిందించాలి? అనేది ప్రాముఖ్యం కాదు. సంగతులను చక్కపెట్టే మార్గమేమిటి, అనేదే ముఖ్యం. సర్దుబాటు చేసికొనే విధంగా వుండండి, విభేదాలను వ్రెళ్లగ్రక్కండి, వాటిని గూర్చి చర్చించండి, నిన్ను గూర్చి నీవు అంతగా బాధపడవద్దు. సంభాషించు! ‘నిన్నువలె నీ జతను కూడ ప్రేమిస్తే’ వివాహ సంబంధాన్ని సర్దుబాటు చేసికొని దానిని సంతోషభరితంగా మార్చుకొనుట కష్టతరం కాదు.—మత్తయి 19:19.

[అధ్యయన ప్రశ్నలు]