కాలరేఖ
-
“ఆదియందు . . .”
-
సా.శ.పూ. 4026 ఆదాము సృష్టి (దాదాపు 6,000 సంవత్సరాల క్రితం)
-
సా.శ.పూ 3096 ఆదాము మరణం (దాదాపు 5,100 సంవత్సరాల క్రితం)
-
సా.శ.పూ 2370 జలప్రళయం (దాదాపు 4,370 సంవత్సరాల క్రితం)
-
సా.శ.పూ 2018 అబ్రాహాము పుట్టాడు
-
సా.శ.పూ 1943 అబ్రాహాముతో నిబంధన (దాదాపు 3,950 సంవత్సరాల క్రితం)
-
సా.శ.పూ 1750 (దాదాపు 3,750 సంవత్సరాల క్రితం) యోసేపును బానిసగా అమ్మేశారు
-
సా.శ.పూ 1613కు ముందు (దాదాపు 3,620 సంవత్సరాల క్రితం) యోబు శ్రమలు
-
సా.శ.పూ 1513 ఐగుప్తు నుండి విడుదల (దాదాపు 3,520 సంవత్సరాల క్రితం)
-
సా.శ.పూ 1473 యిహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానులో అడుగుపెట్టారు
-
సా.శ.పూ 1467 (దాదాపు 3,470 సంవత్సరాల క్రితం) కనానులో చాలా భాగం స్వాధీనం చేసుకోబడింది
-
సా.శ.పూ 1117 (దాదాపు 3,120 సంవత్సరాల క్రితం) సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు
-
సా.శ.పూ 1070 దేవుడు దావీదుతో రాజ్య నిబంధన చేశాడు
-
సా.శ.పూ 1037 సొలొమోను రాజయ్యాడు
-
సా.శ.పూ 1027 (దాదాపు 3,030 సంవత్సరాల క్రితం) యెరూషలేములో దేవాలయ నిర్మాణం పూర్తయింది
-
దాదాపు సా.శ.పూ 1020 పరమగీతము రాయడం పూర్తయింది
-
సా.శ.పూ 997 (దాదాపు 3,000 సంవత్సరాల క్రితం) ఇశ్రాయేలు రెండుగా చీలిపోయింది
-
దాదాపు సా.శ.పూ 717 (దాదాపు 2,720 సంవత్సరాల క్రితం) సామెతలు రాయడం పూర్తయింది
-
సా.శ.పూ 607 (దాదాపు 2,610 సంవత్సరాల క్రితం) యెరూషలేము నాశనం; ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా వెళ్లారు
-
సా.శ.పూ 539 కోరెషు బబులోనును జయించాడు
-
సా.శ.పూ 537 (దాదాపు 2,540 సంవత్సరాల క్రితం) యూదులు యెరూషలేముకు తిరిగివచ్చారు
-
సా.శ.పూ. 455 (దాదాపు 2,400 సంవత్సరాల క్రితం) యెరూషలేము గోడలు కట్టారు;
69 వారాల సంవత్సరాలు మొదలయ్యాయి -
సా.శ.పూ. 443 తర్వాత మలాకీ ప్రవచన పుస్తకాన్ని రాయడం పూర్తిచేశాడు
-
దాదాపు సా.శ.పూ. 2 యేసు పుట్టాడు
-
సా.శ. 29 (దాదాపు 1,980 సంవత్సరాల క్రితం) యేసు బాప్తిస్మం తీసుకున్నాడు,
యేసు దేవుని రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు -
సా.శ. 31 యేసు 12 మంది అపొస్తలులను ఎంపిక చేసుకున్నాడు; కొండమీది ప్రసంగం ఇచ్చాడు
-
సా.శ. 32 యేసు లాజరును పునరుత్థానం చేశాడు
-
సా.శ. 33, నీసాను 14 (దాదాపు 1,970 సంవత్సరాల క్రితం. నీసాను నెల మార్చి, ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది) యేసు చంపబడ్డాడు
-
సా.శ. 33, నీసాను 16 యేసు పునరుత్థానం అయ్యాడు
-
సా.శ. 33, సీవాను 6 పెంతెకొస్తు; పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది (సీవాను నెల మే, జూన్ నెలల మధ్య వస్తుంది)
-
సా.శ. 36 (దాదాపు 1,970 సంవత్సరాల క్రితం) కొర్నేలీ క్రైస్తవుడయ్యాడు
-
దాదాపు సా.శ. 47-48 పౌలు మొదటి మిషనరీ యాత్ర
-
దాదాపు సా.శ. 49-52 పౌలు రెండవ మిషనరీ యాత్ర
-
దాదాపు సా.శ. 52-56 పౌలు మూడవ మిషనరీ యాత్ర
-
సా.శ. 60 - 61 పౌలు రోములో బంధీగా ఉన్నప్పుడు పత్రికలు రాశాడు
-
సా.శ. 62కు ముందు యేసు సోదరుడైన యాకోబు పత్రిక రాశాడు
-
సా.శ. 66 యూదులు రోముపై తిరుగుబాటు చేశారు
-
సా.శ. 70 (దాదాపు 1,930 సంవత్సరాల క్రితం) రోమన్లు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేశారు
-
దాదాపు సా.శ. 96 (దాదాపు 1,910 సంవత్సరాల క్రితం) యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు
-
దాదాపు సా.శ. 100 అపొస్తలుల్లో చివరివాడైన యోహాను చనిపోయాడు