కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి

ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి

ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి

ఐగుప్తునుండి జరిగిన నిర్గమనం గురించి అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తెలుసు. కాని మోషే, దేవుని ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికోసం ఏమి వేచివుంది? వారు ఎటువైపు ప్రయాణించారు, వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి వారు యొర్దాను నదిని ఎలా చేరుకున్నారు?

వారు చేరుకోవలసింది కనాను దేశమే అయినా మోషే సమీప మార్గంలో అంటే మధ్యధరా సముద్రపు ఇసుక తీరం వెంబడి 250 మైళ్ళ దూరంవుండే మార్గంలో ప్రయాణించలేదు ఎందుకంటే అది వారిని నేరుగా శత్రువుల క్షేత్రమైన ఫిలిష్తియకు తీసుకువెళుతుంది. అయితే ఆయన సీనాయి ద్వీపకల్పంలోని విస్తారమైన ప్రాంతం గుండా కూడా ప్రయాణించలేదు ఎందుకంటే కంకర మరియు సున్నపురాళ్ళ ద్వీపకల్పం చాలా వేడిగా ఉండేది. దానికి బదులుగా మోషే ఆ ప్రజలను దక్షిణవైపుగా తీరప్రాంతంలోని సన్నని మైదానం వెంబడి నడిపించాడు. మారా దగ్గర వారు మొదటి మజిలీ చేశారు, అక్కడ యెహోవా చేదు నీళ్ళను తియ్యని నీళ్ళుగా మార్చాడు. a ఏలీమును విడిచి బయలుదేరాక ప్రజలు ఆహారం కోసం సణిగినప్పుడు దేవుడు పూరేడులు పంపించాడు, ఆ తర్వాత వారికి మన్నా దయచేశాడు. రెఫీదీములో ఇశ్రాయేలీయులు మళ్ళీ నీళ్ళ విషయంలో సణిగారు, దాడి చేయడానికి వచ్చిన అమాలేకీయులు ఓడించబడ్డారు, సమర్థులైన పురుషుల సహాయం తీసుకొమ్మని మోషే మామ ఆయనకు ఉద్భోదించాడు.​—⁠నిర్గ 15-18 అధ్యాయాలు.

ఆ తర్వాత మోషే దక్షిణదిశగా దూరానవున్న పర్వతాలవైపు ఇశ్రాయేలీయులను నడిపించాడు, వారు సీనాయి పర్వతంవద్ద మజిలీచేశారు. అక్కడ దేవుని ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, వారు దేవాలయ గుడారం నిర్మించి బలులు అర్పించారు. రెండవ సంవత్సరంలో వారు ఉత్తరంవైపు బహుశా 11 రోజులు ప్రయాణించి “ఘోరమైన మహారణ్యములోనుండి” కాదేషు (కాదేషు బర్నేయ) ప్రాంతానికి చేరుకున్నారు. (ద్వితీ 1:1, 2, 19; 8:​15) పదిమంది వేగులవారు ఇచ్చిన ప్రతికూల నివేదిక కారణంగా భయపడినందువల్ల ఆ ప్రజలు 38 సంవత్సరాలపాటు సంచరించవలసి వచ్చింది. (సంఖ్యా 13:1-14: 34) అలా సంచరిస్తున్నప్పుడు వారు ఎబ్రోనాలో, ఎసోన్గెబెరులో ఆగి మళ్ళీ కాదేషుకు తిరిగివెళ్ళారు.​—⁠సంఖ్యా 33:33-36.

చివరకు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి సమీపించే సమయం వచ్చినప్పుడు వారు నేరుగా ఉత్తరదిక్కుకు ప్రయాణించలేదు. వారు ప్రయాణించిన మార్గం వారిని ఎదోము మధ్యగా “రాజమార్గములో,” అంటే రహదారిలో చుట్టుత్రిప్పి తీసుకెళ్లింది. (సంఖ్యా 21:22; ద్వితీ 2:​1-8) ఈ దారిలో ఒక జనాంగమంతా వారి పిల్లలతో, పశువులతో, గుడారాలతో ప్రయాణించడం అంత సులభం కాదు. వారు జెరెదు, అర్నోను (దాదాపు 520 మీటర్ల లోతున్న) ప్రాంతాల్లోని కష్టభరితమైన వంపులుగల మార్గంలో ఎక్కుతూ దిగుతూ ప్రయాణించవలసి వచ్చింది.​—⁠ద్వితీ 2:13, 14, 24.

చివరకు ఇశ్రాయేలీయులు నెబో కొండకు చేరుకున్నారు. మిర్యాము కాదేషులో, అహరోను హోరు కొండమీద మరణించారు. మోషే తాను ప్రవేశించాలని కోరుకున్న వాగ్దాన దేశం కనుచూపుమేరలో ఉందనగా మరణించాడు. (ద్వితీ 32:48-52; 34:​1-5) 40 సంవత్సరాల క్రితం ఆరంభమైన ప్రయాణం ముగించి, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగించబడింది.​—⁠యెహో 1:1-4.

[అధస్సూచి]

a అనేక మజిలీల ఖచ్చితమైన స్థలాలు ఎక్కడో తెలియదు.

[8వ పేజీలోని బాక్సు]

ఈ కాలంలో వ్రాయబడిన బైబిలు పుస్తకాలు:

ఆదికాండము

నిర్గమకాండము

లేవీయకాండము

సంఖ్యాకాండము

ద్వితీయోపదేశకాండము

యోబు

కీర్తనలు (కొంతభాగం)

[9వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

విడుదలై వస్తున్నప్పుడు ప్రయాణించిన మార్గం

ఇశ్రాయేలీయులు ప్రయాణించిన మార్గం

A7 ఐగుప్తు

A5 రామెసేసు?

B5 సుక్కోతు?

C5 ఏతాము?

C5 పీహహీరోతు

D6 మారా

D6 ఏలీము

E6 సీను అరణ్యము (Sin)

E7 దోపకా

F8 రెఫీదీము

F8 సీనాయి పర్వతం (హోరేబు)

F8 సీనాయి అరణ్యము

F7 కిబ్రోతుహత్తావా

G7 హజేరోతు

G6 రిమ్మోను పారెసు

G5 రీసా

G3 కాదేషు

G3 బెనేయాకాను

G5 హోర్‌హగ్గిద్గాదు

H5 యొత్బాతా

H5 ఎబ్రోనా

H6 ఎసోన్గెబెరు

G3 కాదేషు

G3 సీను అరణ్యము (Zin)

H3 హోరు కొండ

H3 సల్మానా

I3 పూనొను

I3 ఈయ్యె అబారీము

I2 మోయాబు

I1 దీబోను

I1 అల్మోను దిబ్లాతాయిము

H1 యెరికో

[ఇతర ప్రదేశాలు]

A3 గోషెను

A4 ఓను

A5 మెంఫెసు (నోపు)

B3 సోయను

B3 తహపనేసు

C5 మిగ్దోలు

D3 షూరు

D5 ఏతాము అరణ్యము

F5 పారాను అరణ్యము

G1 ఫిలిష్తియ

G1 అష్డోదు

G2 గాజా

G2 బెయేర్షెబా

G3 అస్మోను

G3 నెగెబు

H1 యెరూషలేము

H1 హెబ్రోను (కిర్యతర్బా)

H2 అరాదు (కనానీయుల)

H4 శేయీరు

H4 ఎదోము

I7 మిద్యాను

ముఖ్య దారులు

ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళే మార్గం

షూరుకు వెళ్ళే మార్గం

I4 రాజమార్గము

గుంపులు ప్రయాణించే మార్గం

ఎల్‌ హజ్‌ మార్గం

[పర్వతాలు]

F8 సీనాయి పర్వతం (హోరేబు)

H3 హోరు కొండ

I1 నెబో కొండ

[సముద్రాలు]

E2 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

D7/G7 ఎర్ర సముద్రం

I1 ఉప్పు సముద్రం

[నదులు, ఏరులు]

A6 నైలునది

F3 ఐగుప్తు నది

I2 అర్నోను

I3 జెరెదు

[8వ పేజీలోని చిత్రం]

బిడారులు సీనాయి ద్వీపకల్పాన్ని దాటాయి

[8వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం ఎదుట మజిలీ చేశారు

[9వ పేజీలోని చిత్రం]

కాదేషు దగ్గరున్న లేదా సమీపంలోని ఊటల నుండి నీరు లభ్యమైంది

[9వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులందరు అర్నోను ఏటిలోయగుండా ప్రయాణించవలసి వచ్చింది