కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుకు సుపరిచితమైన యెరూషలేము, ఆలయము

యేసుకు సుపరిచితమైన యెరూషలేము, ఆలయము

యేసుకు సుపరిచితమైన యెరూషలేము, ఆలయము

యోసేపు మరియలు యేసు జన్మించిన వెంటనే ఆయనను, ఆయన పరలోక తండ్రి తన నామమును స్థాపించిన ప్రాంతానికి అంటే యెరూషలేముకు తీసుకొనివెళ్ళారు. (లూకా 2:​22-39) పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు యేసు పస్కా పండుగ కోసం మళ్ళీ అక్కడకు వెళ్ళాడు. ఆయన తన అవగాహనతో ఆలయములోని బోధకులను ఆశ్చర్యపరిచాడు. (లూకా 2:​41-51) హేరోదు రాజు నిర్మాణ కార్యక్రమంలో భాగమైన ఆ ఆలయ నిర్మాణ పని “నలువదియారు సంవత్సరముల” కంటే ఎక్కువకాలం కొనసాగింది.​—⁠యోహా 2:20.

యేసు తన పరిచర్యా కాలంలో యెరూషలేములోని పండుగలకు హాజరయ్యాడు, ఆయన అక్కడ తరచూ జనసమూహాలకు బోధించాడు. ఆయన రూకలు మార్చేవారిని, వ్యాపారులను రెండుసార్లు ఆలయ ప్రాంగణం నుండి వెళ్ళగొట్టాడు.​—⁠మత్త 21:12; యోహా 2:13-16.

ఆలయపు ఉత్తర భాగాన బేతెస్ద కోనేరువద్ద యేసు, 38 సంవత్సరాలుగా బాధపడిన వ్యక్తిని స్వస్థపరిచాడు. అంతేకాక నగరంలోని దక్షిణ భాగానవున్న సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పి, దేవుని కుమారుడు ఒక గ్రుడ్డివానికి చూపునిచ్చాడు.​—⁠యోహా 5:1-15; 9:1, 7, 11.

యేసు తన స్నేహితులైన లాజరు మరియ మార్తలను, యెరూషలేముకు తూర్పువైపు “ఇంచుమించు కోసెడు దూరము”లోవున్న బేతనియవద్ద తరచూ సందర్శించేవాడు. (యోహా 11:1, 18; 12:​1-11; లూకా 10:38-42; 19:​29; 18వ పేజీలోని “యెరూషలేము ప్రాంతము”ను చూడండి.) యేసు తన మరణానికి కొద్ది రోజుల ముందు ఒలీవల కొండను దాటుకొని యెరూషలేమును సమీపించాడు. ఆయన పశ్చిమవైపున ఉన్న నగరాన్ని చూసేందుకు ఆగి, దాని విషయమై యేడ్వడాన్ని ఊహించుకోండి. (లూకా 19:​37-44) ఆయనకు కనిపించిన దృశ్యం, ప్రక్క పేజీలో పైన మీకు కనిపించే దృశ్యంలాగే ఉండివుండవచ్చు. ఆ తర్వాత ఆయన గాడిద పిల్ల ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు, అలా యెరూషలేముకు రావడానికి ఆయన బహుశా నగరానికి తూర్పువైపున ఉండే ద్వారాల్లోని ఒక దానిని ఉపయోగించి ఉండవచ్చు. జన సమూహాలు ఆయనను ఇశ్రాయేలు భావిరాజుగా స్తుతించాయి.​—⁠మత్త 21:9-12.

యేసు మరణానికి ముందు సంభవించిన ప్రాముఖ్యమైన సంఘటనలు యెరూషలేములో లేదా యెరూషలేము సమీపంలో సంభవించాయి: యేసు ప్రార్థన చేసిన గెత్సేమనే తోట; మహాసభ; కయప గృహం; పిలాతు అధికార మందిరము; చివరకు గొల్గొతా.​—⁠మార్కు 14:32, 53-15:​1, 16, 22; యోహా 18:1, 13, 24, 28.

యేసు తన పునరుత్థానం తర్వాత యెరూషలేములో, దాని పరిసర ప్రాంతాల్లో కనిపించాడు. (లూకా 24:​1-49) ఆ తర్వాత ఆయన ఒలీవల కొండపైనుండి పరలోకానికి ఆరోహణమయ్యాడు.​—⁠అపొ 1:6-12.

[31వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెరూషలేము/హేరోదు కట్టించిన ఆలయం

ఆలయ భాగాలు

 1. అతిపరిశుద్ధ స్థలము

 2. పరిశుద్ధ స్థలము

 3. దహన బలిపీఠము

 4. పోతపనితో చేయబడిన సముద్రము

 5. యాజకుల ఆవరణ

 6. ఇశ్రాయేలీయుల ఆవరణ

 7. స్త్రీల ఆవరణ

 8. అన్యజనుల ఆవరణ

 9. అడ్డుగోడ (సోరెగ్‌)

10. రాజవంశ మంటపము

11. సొలొమోను మంటపము

ఆలయం

ద్వారము

 

యాజకుల ఆవరణ

ద్వారము

అతిపరిశుద్ధ దహన

స్థలము పరిశుద్ధ స్థలము బలిపీఠము ఇశ్రాయేలీయుల స్త్రీల

ఆవరణ ఆవరణ

పోతపనితో చేయబడిన

సముద్రము

 

ద్వారము సొలొమోను

అడ్డుగోడ (సోరెగ్‌) మంటపము

 

అన్యజనుల ఆవరణ

 

ద్వారము

రాజవంశ మంటపము

 

ద్వారాలు

అంటోనియా కోట

వంతెన

మహా సభ

టైరోపియన్‌ లోయ

సిలోయము కోనేరు

నీటి కాలువ

కయప గృహం?

అధికార మందిరం

గొల్గొతా?

గొల్గొతా?

బేతెస్ద కోనేరు

గెత్సేమనే తోట?

ఒలీవల కొండ

కిద్రోను వాగు

గిహోను ఊట

ఏన్‌రోగేలు

హిన్నోము లోయ (గెహెన్నా)

[30వ పేజీలోని చిత్రాలు]

ఆధునిక యెరూషలేము తూర్పువైపు దృశ్యం: (A) ఆలయ ప్రాంతము, (B) గెత్సేమనే తోట, (C) ఒలీవల కొండ, (D) యూదా అరణ్యము, (E) మృత సముద్రం

[31వ పేజీలోని చిత్రం]

యేసు కాలంలో, ఒలీవల కొండపైనుండి పశ్చిమవైపు దృశ్యం