కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను బాప్తిస్మం తీసుకోవాలా?

నేను బాప్తిస్మం తీసుకోవాలా?

37వ అధ్యాయం

నేను బాప్తిస్మం తీసుకోవాలా?

కింది మాటల్లో ఏవి సరైనవో టిక్‌ పెట్టండి:

బాప్తిస్మం అనేది క్రైస్తవులకు తప్పనిసరి.

అవును

కాదు

బాప్తిస్మం తీసుకోవడానికి ముఖ్య కారణం, పాపం చేయకుండా అది మిమ్మల్ని కాపాడుతుందని.

అవును

కాదు

బాప్తిస్మం వల్ల రక్షణ పొందడం సాధ్యమౌతుంది.

అవును

కాదు

బాప్తిస్మం తీసుకోకపోతే, దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన పనిలేదు.

అవును

కాదు

మీ తోటివాళ్లు బాప్తిస్మం తీసుకుంటుంటే, మీరు కూడా బాప్తిస్మానికి రెడీ అన్నట్టే.

అవును

కాదు

మీరు దేవుడు చెప్పినట్టు జీవిస్తూ, ఆయనకు ఫ్రెండ్‌ అవ్వడానికి ప్రయత్నిస్తూ, మీరు నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్తున్నారా? అలాగైతే, బాప్తిస్మం తీసుకోవాలని మీకు అనిపించడం సహజమే. కానీ, మీరు దానికి రెడీగా ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? దాన్ని తెలుసుకోవడానికి, పైన మీరు టిక్‌ పెట్టిన మాటల్ని మళ్లీ ఒకసారి చూద్దాం.

బాప్తిస్మం అనేది క్రైస్తవులకు తప్పనిసరి.

అవును. తన శిష్యులు బాప్తిస్మం తీసుకోవాలని యేసు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19, 20) అంతెందుకు, యేసు కూడా స్వయంగా బాప్తిస్మం తీసుకున్నాడు. యేసును అనుసరించాలంటే, మీరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునేంత అనుభవం వచ్చినప్పుడు, బాప్తిస్మం తీసుకోవాలనే నిజమైన కోరిక ఉన్నప్పుడు మీరు అలా చేయాలి.

బాప్తిస్మం తీసుకోవడానికి ముఖ్య కారణం, పాపం చేయకుండా అది మిమ్మల్ని కాపాడుతుందని.

కాదు. బాప్తిస్మం అనేది, మీరు యెహోవాకు సమర్పించుకున్నారని అందరికీ చూపించే ఒక గుర్తు. సమర్పించుకోవడం ఒక వ్యాపార ఒప్పందం లాంటిది కాదు. ఆ ఒప్పందంలో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా షరతులకు కట్టుబడి ఉండాలి. కానీ, మీరు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి ముఖ్య కారణం, ఆయన నియమాల ప్రకారం జీవించాలని ఇష్టపూర్వకంగా కోరుకోవడమే.

బాప్తిస్మం వల్ల రక్షణ పొందడం సాధ్యమౌతుంది.

అవును. రక్షణ పొందాలంటే బాప్తిస్మం తీసుకోవడం ప్రాముఖ్యమని బైబిలు చెప్తుంది. (1 పేతురు 3:21) అంటే దానర్థం, బాప్తిస్మం తీసుకుంటే రక్షణ గ్యారంటీ అని కాదు. అయినా మీరు రక్షణ పొందడం కోసం బాప్తిస్మం తీసుకోకూడదు గానీ యెహోవా మీద ప్రేమతో, మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ ఆయన్ని సేవించాలనే కోరికతో బాప్తిస్మం తీసుకోవాలి.​—మార్కు 12:29, 30.

బాప్తిస్మం తీసుకోకపోతే, దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన పనిలేదు.

కాదు. యాకోబు 4:17 చెప్తున్నట్టు, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నా, తీసుకోకపోయినా “సరైనది చేయడం తెలిసి కూడా దాన్ని చేయకపోతే, అతను పాపం చేస్తున్నట్టే.” కాబట్టి మీకు సరైనది చేయడం తెలిసి, మీ జీవితాన్ని పరిశీలించుకునేంత అనుభవం వస్తే, బహుశా మీ మమ్మీడాడీతో గానీ, పరిణతిగల సహోదరుడు లేదా సహోదరితో గానీ మాట్లాడడం మంచిది. మీరు బాప్తిస్మానికి రెడీ అవ్వడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారు.

మీ తోటివాళ్లు బాప్తిస్మం తీసుకుంటుంటే, మీరు కూడా బాప్తిస్మానికి రెడీ అన్నట్టే.

కాదు. బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి. ఆ కోరిక మీ హృదయంలో కలగాలే తప్ప వాళ్లను, వీళ్లను చూసి కాదు. (కీర్తన 110:3) మీరు ఒక యెహోవాసాక్షిగా ఉండడమంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీకు నమ్మకం కుదరాలి. అప్పుడు మాత్రమే మీరు బాప్తిస్మం తీసుకోవాలి.​—ప్రసంగి 5:​4, 5.

జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం

బాప్తిస్మం అనేది జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం. అది ఎన్నో ఆశీర్వాదాలు తెస్తుంది. అదే సమయంలో, యెహోవాకు మీరు ఇచ్చిన మాట ప్రకారం జీవించాల్సిన పెద్ద బాధ్యత కూడా మీ మీద ఉంటుంది.

మరి మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగైతే, మీరు సంతోషించడానికి మంచి కారణమే ఉంది. యెహోవాను మనస్ఫూర్తిగా సేవిస్తూ, ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీ జీవన విధానంలో చూపించే గొప్ప అవకాశం మీ ముందుంది!​—మత్తయి 22:36, 37.

మూల లేఖనం

“మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి, మీ ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి పవిత్రసేవ చేయండి.”​—రోమీయులు 12:1.

టిప్‌

మీ మమ్మీడాడీ సహాయంతో, మీరు యెహోవాకు దగ్గరవ్వడానికి సంఘంలో ఇంకా ఎవరి సహాయం తీసుకోవచ్చో ఆలోచించండి.​—అపొస్తలుల కార్యాలు 16:1-3.

మీకు తెలుసా . . . ?

రక్షణ పొందేవాళ్లకు వేసే ‘గుర్తులో,’ బాప్తిస్మం తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన భాగం.​—యెహెజ్కేలు 9:4-6.

నేనిలా చేస్తాను!

బాప్తిస్మానికి రెడీ అవ్వడానికి, నేను ఈ బైబిలు విషయాల గురించి ఎక్కువ తెలుసుకుంటాను: ․․․․․

ఈ విషయాల గురించి నేను మా మమ్మీడాడీని ఏం అడగాలనుకుంటున్నాను అంటే ․․․․․

మీకు ఏమనిపిస్తుంది?

● బాప్తిస్మం ఎందుకంత ప్రాముఖ్యమైనది?

● కొంతమంది యౌవనులు ఎందుకు మరీ తొందరగా బాప్తిస్మం తీసుకుంటారు?

● కొంతమంది యౌవనులు బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తారు?

[బ్లర్బ్‌]

“నేను బాప్తిస్మం తీసుకున్నాను అని గుర్తుపెట్టుకోవడం వల్ల తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగాను, తప్పుడు దారిలో వెళ్లి కష్టాలు కొనితెచ్చుకోకుండా జాగ్రత్తపడగలిగాను.”​—హోలీ

[బాక్సు/చిత్రం]

బాప్తిస్మం గురించి తరచూ అడిగే ప్రశ్నలు

బాప్తిస్మం అంటే ఏంటి? నీళ్లలో మునిగి పైకి లేవడం ద్వారా మీరు పాత ప్రవర్తన విషయంలో చనిపోయి, మళ్లీ కొత్త జీవితాన్ని అంటే యెహోవాకు నచ్చే జీవితాన్ని మొదలుపెడతారు.

మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం అంటే అర్థమేంటి? సమర్పించుకోవడం అంటే మీరు ఇక మీకోసం జీవించకుండా, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఇష్టానికే ప్రాముఖ్యత ఇస్తానని మాటివ్వడం. (మత్తయి 16:24) బాప్తిస్మానికి ముందే మీరు అలా ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకోవడం సరైనది.

బాప్తిస్మానికి ముందు మీరు ఏం చేయాలి? మీరు దేవుని వాక్యమైన బైబిలుకు తగ్గట్టు జీవించాలి, మీరు నేర్చుకుంటున్న వాటిని వేరేవాళ్లకు చెప్తూ ఉండాలి. అలాగే ప్రార్థన ద్వారా, బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా దేవునికి ఫ్రెండ్‌ అవ్వాలి. ఎవరో చెప్పారని కాదుగానీ, మీకు మీరే సొంతగా యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకోవాలి.

ఏ వయసులో బాప్తిస్మం తీసుకోవాలి? ఫలానా వయసులో అనేమీ లేదు. కాకపోతే, సమర్పించుకోవడం అంటే ఏంటో అర్థం చేసుకునేంత వయసు, అనుభవం మీకు ఉండాలి.

మీకు బాప్తిస్మం తీసుకోవాలని ఉన్నా, మీ మమ్మీడాడీ కొంచెం ఆగమని చెప్తే అప్పుడేంటి? బహుశా, మీకు ఇంకా అనుభవం రావాలని వాళ్లు అనుకుంటుండవచ్చు. వాళ్ల మాట విని, ఆ సమయాన్ని యెహోవాకు ఇంకా దగ్గరవ్వడానికి ఉపయోగించుకోండి.​—1 సమూయేలు 2:26.

[బాక్సు]

వర్క్‌షీట్‌

మీరు బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా?

మీరు బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, కిందున్న ప్రశ్నల్ని పరిశీలించండి. అయితే, వాటికి జవాబులు రాసేముందు అక్కడ ఇచ్చిన లేఖనాల్ని చూడడం మర్చిపోకండి.

మీరు యెహోవాను నమ్ముతున్నారని ఏయే విధాలుగా చూపిస్తున్నారు?​—కీర్తన 71:5. ...............

తప్పొప్పులను గుర్తించగలిగేలా మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇచ్చుకున్నారని మీరు ఎలా చూపించారు?​—హెబ్రీయులు 5:14. ...............

మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ...............

మీరు వేటి గురించి ప్రార్థిస్తారు? మీ ప్రార్థనలు యెహోవా మీద మీకున్న ప్రేమను ఎలా చూపిస్తున్నాయి?​—కీర్తన 17:6. ...............

ఇంకా బాగా ప్రార్థించడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ...............

మీరు బైబిల్ని క్రమంగా అధ్యయనం చేస్తున్నారా?​—యెహోషువ 1:8. ...............

మీరు ఏయే విషయాల గురించి వ్యక్తిగత అధ్యయనం చేస్తారు? ...............

వ్యక్తిగత అధ్యయనం ఇంకా బాగా చేయడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ...............

మీరు పరిచర్యలో ఆనందిస్తున్నారా? (ఉదాహరణకు: బైబిలు విషయాల్ని మీరు వేరేవాళ్లకు చెప్పగలరా? ఆసక్తి చూపించినవాళ్లను మీరు మళ్లీ కలుస్తున్నారా? ఎవరితోనైనా బైబిలు స్టడీ మొదలుపెట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారా?)

అవును కాదు

మీ మమ్మీడాడీ పరిచర్యకు రాకపోయినా, మీరు వెళ్తారా?​—అపొస్తలుల కార్యాలు 5:42.

అవును కాదు

ఇంకా బాగా పరిచర్య చేయడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు?​—2 తిమోతి 2:15. ...............

మీరు మీటింగ్స్‌కి క్రమంగా వెళ్తారా, లేక అప్పుడప్పుడు మానేస్తారా?​—హెబ్రీయులు 10:25. ...............

మీటింగ్స్‌లో మీరు ఏయే విధాలుగా భాగం వహిస్తున్నారు? ...............

మీ మమ్మీడాడీ మీటింగ్స్‌కి రాలేకపోయినా, మీరు వెళ్తారా (ఒకవేళ వాళ్లు మిమ్మల్ని వెళ్లమంటే)?

అవును కాదు

దేవుని ఇష్టం చేయడం నిజంగా నాకు సంతోషం అని మీరు చెప్పగలరా?​—కీర్తన 40:8.

అవును కాదు

మీరు తోటివాళ్ల ఒత్తిడికి లొంగిపోకుండా ఉన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా?​—రోమీయులు 12:2. ...............

యెహోవా ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉండడానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?​—యూదా 20, 21, అధస్సూచి. ...............

మీ మమ్మీడాడీ, ఫ్రెండ్స్‌ యెహోవాను ఆరాధించడం ఆపేసినా మీరు ఆయన్ని ఆరాధిస్తారా?​—మత్తయి 10:36, 37.

అవును కాదు

[చిత్రం]

పెళ్లిలాగే బాప్తిస్మం కూడా మీ జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం, దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు