కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందుమాట, విషయసూచిక

ముందుమాట, విషయసూచిక

2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు అనే ప్రాంతంలో యేసు క్రీస్తు అనే ఒక గొప్ప బోధకుడు ఉండేవాడు. ఒకసారి ఆయన గలిలయ సముద్రం దగ్గరున్న కొండ మీద కూర్చుని ప్రజలకు బోధిస్తున్నప్పుడు వాళ్లకు ఎన్నో మంచి సలహాలు చెప్పాడు. ఆ సలహాలన్నీ మత్తయి అనే బైబిలు పుస్తకంలో 5 నుండి 7 అధ్యాయాల్లో ఉన్నాయి. వాటిని చదివి మీరూ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాం.

  • 5వ అధ్యాయం

    • యేసు కొండమీద బోధించడం మొదలుపెట్టడం (1, 2)

    • తొమ్మిది సంతోషాలు (3-12)

    • ఉప్పు, వెలుగు (13-16)

    • ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు (17 -20)

    • కోపం (21-26), వ్యభిచారం (27-30), విడాకులు (31, 32), ఒట్టు వేయడం (33-37), ప్రతీకారం (38-42), శత్రువుల్ని ప్రేమించడం (43-48) గురించి సలహా

  • 6వ అధ్యాయం

    • వేరేవాళ్లకు కనిపించేలా నీతికార్యాలు చేయొద్దు (1-4)

    • ఎలా ప్రార్థించాలి (5-15)

      • ప్రార్థనలో ఏ విషయాలు అడగాలో యేసు నేర్పించాడు (9-13)

    • ఉపవాసం (16-18)

    • భూమ్మీద, పరలోకంలో సంపదలు (19-24)

    • ఆందోళనపడడం మానేయండి (25-34)

      • రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి (33)

  • 7వ అధ్యాయం

    • తీర్పు తీర్చడం ఆపేయండి (1-6)

    • అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉండండి (7-11)

    • ఇతరులతో ఎలా ఉండాలి (12)

    • ఇరుకు ద్వారం (13,14)

    • ఫలాల్ని బట్టి గుర్తుపట్టవచ్చు (15-23)

    • బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు (24-27)

    • ప్రజలు యేసు బోధకు చాలా ఆశ్చర్యపోవడం (28, 29)