17వ ప్రశ్న
బైబిలు మీ కుటుంబానికి ఎలా సహాయం చేస్తుంది?
భర్తలు/తండ్రులు
“అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి. తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటున్నాడు. ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు . . . మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి.”
“తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి; బదులుగా యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ వాళ్లను పెంచండి.”
భార్యలు
‘భార్యకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.’
“భార్యలారా, మీ భర్తలకు లోబడివుండండి. ప్రభువు శిష్యులు అలా చేయడం సరైనది.”
పిల్లలు
“పిల్లలారా, ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి, ఇది దేవుని దృష్టికి సరైనది. వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఇదే: ‘నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, నువ్వు భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తావు.’ ”
“పిల్లలారా, ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి. ఇది ప్రభువుకు ఇష్టం.”