19వ ప్రశ్న
బైబిల్లోని ఏ పుస్తకాల్లో ఏముంది?
హీబ్రూ లేఖనాలు (“పాత నిబంధన”)
మొదటి ఐదు కాండాలు (5 పుస్తకాలు):
ఆదికాండం, నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం
సృష్టి నుండి ప్రాచీన ఇశ్రాయేలు జనం మొదలయ్యే వరకు
చారిత్రక పుస్తకాలు (12 పుస్తకాలు):
యెహోషువ, న్యాయాధిపతులు, రూతు
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి వెళ్లడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు
1వ, 2వ సమూయేలు; 1వ, 2వ రాజులు; 1వ, 2వ దినవృత్తాంతాలు
యెరూషలేము నాశనమయ్యే వరకు ఇశ్రాయేలు జనం చరిత్ర
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు
బబులోను చెర నుండి తిరిగొచ్చిన తర్వాత యూదుల చరిత్ర
కావ్య పుస్తకాలు (5 పుస్తకాలు):
యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం
జ్ఞాన వాక్కులు, గీతాల కూర్పు
ప్రవచన పుస్తకాలు (17 పుస్తకాలు):
యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ
దేవుని ప్రజల గురించిన ప్రవచనాలు, లేదా ముందే చెప్పిన విషయాలు
క్రైస్తవ గ్రీకు లేఖనాలు (“కొత్త నిబంధన”)
నాలుగు సువార్తలు (4 పుస్తకాలు):
మత్తయి, మార్కు, లూకా, యోహాను
యేసు జీవితం, పరిచర్య గురించిన చరిత్ర
అపొస్తలుల కార్యాలు (1 పుస్తకం):
క్రైస్తవ సంఘం మొదలవడం, మిషనరీ పని గురించిన చరిత్ర
ఉత్తరాలు (21 పుస్తకాలు):
రోమీయులు, 1వ, 2వ కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలొస్సయులు, 1వ, 2వ థెస్సలొనీకయులు
ఆయా క్రైస్తవ సంఘాలకు రాసిన ఉత్తరాలు
1వ, 2వ తిమోతి, తీతు, ఫిలేమోను
ఆయా క్రైస్తవులకు రాసిన ఉత్తరాలు
హెబ్రీయులు, యాకోబు, 1వ, 2వ పేతురు, 1వ, 2వ, 3వ యోహాను, యూదా
క్రైస్తవులకు మామూలు ఉత్తరాలు
ప్రకటన (1 పుస్తకం):
అపొస్తలుడైన యోహానుకు వచ్చిన ప్రవచనాత్మక దర్శనాల పరంపర