కీర్తనలు 118:1-29
118 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.
2 ఇశ్రాయేలు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
3 అహరోను ఇంటివాళ్లు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
4 యెహోవాకు భయపడేవాళ్లు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
5 కష్టకాలంలో నేను యెహోవాకు* మొరపెట్టాను;యెహోవా* నాకు జవాబిచ్చాడు, సురక్షితమైన* స్థలంలోకి నన్ను తీసుకొచ్చాడు.+
6 యెహోవా నా పక్షాన ఉన్నాడు; నేను భయపడను.+
మనుషులు నన్నేమి చేయగలరు?+
7 నాకు సహాయకుడిగా* యెహోవా నా పక్షాన ఉన్నాడు;+నన్ను ద్వేషించేవాళ్ల పతనాన్ని నేను కళ్లారా చూస్తాను.+
8 మనుషుల్ని నమ్ముకోవడం కన్నాయెహోవాను ఆశ్రయించడం మంచిది.+
9 అధిపతుల్ని నమ్ముకోవడం కన్నా+యెహోవాను ఆశ్రయించడం మంచిది.
10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి,అయితే యెహోవా పేరున
నేను వాటిని తరిమికొట్టాను.+
11 వాళ్లు నన్ను చుట్టుముట్టారు,అవును, అన్నివైపులా నన్ను చుట్టుముట్టారు,
అయితే నేను యెహోవా పేరున వాళ్లను తరిమికొట్టాను.
12 వాళ్లు కందిరీగల్లా నన్ను చుట్టుముట్టారు,కానీ ముళ్లకంపలకు అంటుకున్న నిప్పులా వాళ్లు ఇట్టే ఆరిపోయారు.
యెహోవా పేరుననేను వాళ్లను తరిమికొట్టాను.+
13 నేను పడిపోయేలా వాళ్లు* నన్ను గట్టిగా నెట్టారు,అయితే యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవాయే* నా ఆశ్రయం, నా బలం;ఆయనే నాకు రక్షణ అయ్యాడు.+
15 నీతిమంతుల డేరాల్లోఉత్సాహ ధ్వనులు, రక్షణ* ధ్వనులు వినిపిస్తాయి.
యెహోవా కుడిచెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తోంది.+
16 యెహోవా కుడిచెయ్యి విజయంతో పైకెత్తబడింది;యెహోవా కుడిచెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తోంది.+
17 నేను చనిపోను,యెహోవా* పనుల్ని ప్రకటించడానికి నేను బ్రతికే ఉంటాను.+
18 యెహోవా* నన్ను కఠినంగా శిక్షించాడు,+కానీ మరణానికి అప్పగించలేదు.+
19 నా కోసం నీతి ద్వారాలు తెరవండి;+నేను వాటిలోకి ప్రవేశించి యెహోవాను* స్తుతిస్తాను.
20 ఇది యెహోవా గుమ్మం.
నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.+
21 నేను నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నువ్వు నాకు జవాబిచ్చావు,+నాకు రక్షణ అయ్యావు.
22 కట్టేవాళ్లు వద్దనుకున్న రాయిముఖ్యమైన మూలరాయి* అయింది.+
23 ఇది యెహోవా వల్ల జరిగింది,+ఇది మన కళ్లకు ఆశ్చర్యం.+
24 ఇది యెహోవా చేసిన రోజు;ఈ రోజు మనం సంతోషించి, ఉల్లసిద్దాం.
25 యెహోవా, నిన్ను వేడుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని రక్షించు!
యెహోవా, దయచేసి మాకు విజయాన్ని అనుగ్రహించు!
26 యెహోవా పేరున వస్తున్న వ్యక్తి దీవించబడాలి;+యెహోవా మందిరంలో నుండి మేము మిమ్మల్ని దీవిస్తున్నాం.
27 యెహోవాయే దేవుడు;ఆయనే మనకు వెలుగు ఇస్తున్నాడు.+
చేతిలో మట్టలు పట్టుకొని పండుగ ఊరేగింపులో చేరండి,+బలిపీఠపు కొమ్ముల+ వరకూ వెళ్లండి.
28 నువ్వే నా దేవుడివి, నేను నిన్ను స్తుతిస్తాను;నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను.+
29 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి,+ ఆయన మంచివాడు;ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+
అధస్సూచీలు
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “విశాలమైన.”
^ లేదా “నాకు సహాయం చేసేవాళ్లతో పాటు” అయ్యుంటుంది.
^ లేదా “నువ్వు” అయ్యుంటుంది.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “విజయ.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “మూలకు తల.”