కీర్తనలు 130:1-8
యాత్ర కీర్తన.
130 యెహోవా, తీవ్రమైన నిరాశలో ఉండి నీకు ప్రార్థిస్తున్నాను.+
2 యెహోవా, నా స్వరం విను.
సహాయం కోసం నేను పెట్టే మొరల్ని నువ్వు ఆలకించాలి.
3 యెహోవా,* నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే,*యెహోవా, ఎవరు నిలవగలరు?*+
4 అయితే, ప్రజలు నీ మీద భయభక్తులు చూపించేలా,+నీ దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది.+
5 నేను యెహోవా మీద ఆశపెట్టుకుంటున్నాను, నా ప్రాణం ఆయన మీద ఆశపెట్టుకుంటోంది;ఆయన మాట కోసం నేను ఎదురుచూస్తున్నాను.
6 ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా,+అవును, ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా ఆత్రంగానా ప్రాణం యెహోవా కోసం ఎదురుచూస్తోంది.+
7 ఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురుచూస్తూ ఉండాలి,ఎందుకంటే యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు.+ఆయనకున్న విడిపించే శక్తి గొప్పది.
8 ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ల తప్పులన్నిటి నుండి విడిపిస్తాడు.
అధస్సూచీలు
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “లెక్కపెట్టుకుంటూ వెళ్తే.”
^ లేదా “నిర్దోషిగా ఎంచబడతారు?”