కీర్తనలు 145:1-21

  • గొప్ప రాజైన దేవుణ్ణి స్తుతించడం

    • ‘దేవుని గొప్పతనాన్ని నేను చాటిచెప్తాను’ (6)

    • “యెహోవా అందరికీ మంచి చేస్తాడు” (9)

    • “నీ విశ్వసనీయులు నిన్ను స్తుతిస్తారు” (10)

    • దేవుని శాశ్వత రాజరికం (13)

    • దేవుని చెయ్యి ప్రతీ జీవిని తృప్తిపరుస్తుంది (16)

దావీదు స్తుతిగీతం. א [ఆలెఫ్‌] 145  నా దేవా, నా రాజా, నేను నిన్ను ఘనపరుస్తాను,+నిరంతరం నీ పేరును స్తుతిస్తాను.+ ב [బేత్‌]   రోజంతా నేను నిన్ను స్తుతిస్తాను.+నిరంతరం నీ పేరును స్తుతిస్తాను.+ ג [గీమెల్‌]   యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు;+ఆయన గొప్పతనాన్ని అర్థంచేసుకోవడం అసాధ్యం.+ ד [దాలెత్‌]   తరతరాలు ప్రజలు నీ పనుల్ని స్తుతిస్తారు;నీ శక్తివంతమైన కార్యాల గురించి చెప్తారు.+ ה [హే]   నీ ఘనత, మహిమ, వైభవం గురించి వాళ్లు మాట్లాడతారు,+నీ అద్భుతమైన పనుల గురించి నేను ధ్యానిస్తాను. ו [వావ్‌]   వాళ్లు సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీ కార్యాల* గురించి మాట్లాడతారు,నీ గొప్పతనాన్ని నేను చాటిచెప్తాను. ז [జాయిన్‌]   నీ అపారమైన మంచితనాన్ని గుర్తుచేసుకున్నప్పుడు వాళ్ల స్తుతులు పొంగిపొర్లుతాయి,+నీ నీతిని బట్టి వాళ్లు సంతోషంతో కేకలు వేస్తారు.+ ח [హేత్‌]   యెహోవా కనికరం,* కరుణ గలవాడు,+ఆయన ఓర్పును,* గొప్ప విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడు.+ ט [తేత్‌]   యెహోవా అందరికీ మంచి చేస్తాడు,+ఆయన కరుణ ఆయన పనులన్నిట్లో కనిపిస్తుంది. י [యోద్‌] 10  యెహోవా, నీ పనులన్నీ నిన్ను మహిమపరుస్తాయి,+నీ విశ్వసనీయులు నిన్ను స్తుతిస్తారు.+ כ [కఫ్‌] 11  నీ రాజరిక మహిమను వాళ్లు చాటిచెప్తారు,+నీ గొప్ప బలం గురించి మాట్లాడతారు;+ ל [లామెద్‌] 12  అలా వాళ్లు, నీ శక్తివంతమైన పనుల గురించి,మహిమాన్వితమైన నీ రాజరిక వైభవం+ గురించి ఇతరులకు తెలియజేస్తారు. מ [మేమ్‌] 13  నీ రాజరికం నిరంతరం ఉంటుంది,నీ పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.+ ס [సామెఖ్‌] 14  పడిపోయే వాళ్లందర్నీ యెహోవా ఆదుకుంటాడు,+కృంగిపోయిన వాళ్లందర్నీ ఆయన పైకి లేపుతాడు. ע [అయిన్‌] 15  అన్ని ప్రాణుల కళ్లు ఆశతో నీవైపు చూస్తున్నాయి;నువ్వు తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తావు.+ פ [పే] 16  నువ్వు నీ గుప్పిలి విప్పిప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు.+ צ [సాదె] 17  యెహోవా తన మార్గాలన్నిట్లో నీతిగలవాడు,+తన పనులన్నిట్లో విశ్వసనీయుడు.+ ק [ఖొఫ్‌] 18  తనకు మొరపెట్టే వాళ్లందరికీ,నిజాయితీతో* తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు.+ ר [రేష్‌] 19  తనకు భయపడేవాళ్ల కోరికను ఆయన తీరుస్తాడు;+సహాయం కోసం వాళ్లు పెట్టే మొరలు విని వాళ్లను రక్షిస్తాడు.+ ש [షీన్‌] 20  తనను ప్రేమించే వాళ్లందర్నీ యెహోవా కాపాడతాడు,+అయితే దుష్టులందర్నీ ఆయన పూర్తిగా నాశనం చేస్తాడు.+ ת [తౌ] 21  నా నోరు యెహోవా స్తుతుల్ని ప్రకటిస్తుంది;+ప్రతీ ప్రాణి యుగయుగాలు ఆయన పవిత్రమైన పేరును స్తుతించాలి.+

అధస్సూచీలు

లేదా “శక్తి.”
లేదా “దయ.”
లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
లేదా “సత్యంతో.”