కీర్తనలు 15:1-5
దావీదు శ్రావ్యగీతం.
15 యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?+
2 మచ్చ లేకుండా జీవిస్తూ,*+సరైనది చేస్తూ,+తన హృదయంలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తే కదా.+
3 అతను తన నాలుకతో లేనిపోనివి కల్పించి చెప్పడు,+తన పొరుగువానికి ఏ కీడూ చేయడు,+తన స్నేహితుల పేరు చెడగొట్టడు.*+
4 అతనికి నీచుడంటే అసహ్యం,+యెహోవాకు భయపడేవాళ్లను అతను ఘనపరుస్తాడు.
నష్టం కలిగినా, అతను తన వాగ్దానాన్ని* నిలబెట్టుకుంటాడు.+
5 అతను తన డబ్బును వడ్డీకి ఇవ్వడు,+నిర్దోషులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు.+
అలాంటి వ్యక్తి ఎప్పటికీ కదిలించబడడు.*+
అధస్సూచీలు
^ లేదా “యథార్థంగా నడుస్తూ.”
^ లేదా “స్నేహితుల్ని అవమానించడు.”
^ అక్ష., “ఒట్టును.”
^ లేదా “తడబడడు.”