కీర్తనలు 55:1-23
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. మాస్కిల్.* దావీదు కీర్తన.
55 దేవా, నా ప్రార్థన విను,+కరుణ చూపించమని నేను చేస్తున్న విన్నపాన్ని నిర్లక్ష్యం చేయకు.*+
2 నా ప్రార్థన విని నాకు జవాబివ్వు.+
ఆందోళన వల్ల నాకు మనశ్శాంతి కరువైంది,+నేను ఎంతో కలవరపడుతున్నాను,
3 శత్రువు మాటల వల్ల,దుష్టుని ఒత్తిడి వల్ల నేను వేదన పడుతున్నాను.
వాళ్లు నా మీద కష్టాల్ని కుమ్మరిస్తున్నారు,కోపంతో నా మీద పగ పెంచుకుంటున్నారు.+
4 నా హృదయం ఆందోళనగా ఉంది,+మరణ భయం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.+
5 నేను భయంతో కంపిస్తున్నాను,తీవ్రమైన భయంతో వణికిపోతున్నాను.
6 నేను ఇలా అంటూ ఉన్నాను: “నాకు పావురంలా రెక్కలుంటే,
ఎగిరిపోయి సురక్షితమైన చోట నివసించేవాణ్ణి.
7 దూరంగా ఎగిరిపోయి,+
ఎడారిలో నివాసం ఉండేవాణ్ణి.+ (సెలా)
8 పెనుగాలి నుండి, తుఫాను నుండి తప్పించుకుని,సురక్షితమైన స్థలానికి పారిపోయేవాణ్ణి.”
9 యెహోవా, వాళ్లను గందరగోళంలో పడేసి వాళ్ల ఆలోచనల్ని* తారుమారు చేయి,+ఎందుకంటే నగరంలో దౌర్జన్యం, గొడవలు నాకు కనిపించాయి.
10 అవి పగలూరాత్రీ దాని ప్రాకారాల మీద తిరుగుతున్నాయి;నగరం ద్వేషంతో, కష్టాలతో నిండిపోయింది.+
11 దాని మధ్యలో నాశనం ఉంది;అణచివేత, మోసం దాని సంతవీధిని ఎప్పుడూ విడిచివెళ్లవు.+
12 నన్ను దూషిస్తున్నవాడు నా శత్రువు అయ్యుంటే,+నేను దాన్ని భరించేవాణ్ణి.
నా మీదికి లేచినవాడు నా విరోధి అయ్యుంటే,నేను అతనికి కనిపించకుండా దాక్కునేవాణ్ణి.
13 కానీ నాలాంటి వాడివీ*+ నా దగ్గరి స్నేహితుడివీనాకు బాగా తెలిసినవాడివీ అయిన నువ్వే ఆ పని చేశావు.+
14 మనం మధురమైన స్నేహాన్ని ఆస్వాదించేవాళ్లం;జనసమూహంతో పాటు దేవుని మందిరంలోకి నడిచి వెళ్లేవాళ్లం.
15 నాశనం నా శత్రువుల్ని తరిమి పట్టుకోవాలి!+
వాళ్లు ప్రాణాలతోనే సమాధిలోకి* దిగిపోవాలి;ఎందుకంటే వాళ్ల నివాసాల్లో, వాళ్ల హృదయాల్లో చెడు ఉంది.
16 నేనైతే దేవునికి మొరపెట్టుకుంటాను,యెహోవా నన్ను కాపాడతాడు.+
17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధతో మూల్గుతున్నాను,+ఆయన నా స్వరం వింటాడు.+
18 నాతో పోరాడుతున్న వాళ్ల నుండి నన్ను రక్షించి,* నాకు ప్రశాంతతను దయచేస్తాడు,ఎందుకంటే చాలామంది నా మీదికి వస్తున్నారు.+
19 పూర్వకాలం నుండి సింహాసనం మీద కూర్చున్న దేవుడు+నా మొర విని, వాళ్ల మీద చర్య తీసుకుంటాడు.+ (సెలా)
వాళ్లు మారడానికి ఇష్టపడరు,వాళ్లకు దేవుడంటే భయం లేదు.+
20 అతను* తన స్నేహితుల మీద దాడిచేశాడు;+తన ఒప్పందాన్ని మీరాడు.+
21 అతని మాటలు వెన్న కన్నా మెత్తగా ఉంటాయి,+కానీ అతని హృదయం కలహంతో నిండిపోయింది.
అతని మాటలు నూనె కన్నా నునుపుగా ఉంటాయి,కానీ అవి పదునైన కత్తులు.+
22 నీ భారం యెహోవా మీద వేయి,+ఆయనే నిన్ను ఆదుకుంటాడు.+
నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.*+
23 కానీ దేవా, నువ్వు దుష్టుల్ని లోతైన గోతిలో పడేస్తావు.+
రక్తపాతం సృష్టించినవాళ్లు, మోసగాళ్లు సగం కాలం కూడా బ్రతకరు.+
నేనైతే నీ మీదే నమ్మకం పెట్టుకుంటాను.
అధస్సూచీలు
^ లేదా “సహాయం కోసం నేను మొరపెట్టినప్పుడు నీ ముఖం చాటేయకు.”
^ లేదా “భాషను.”
^ లేదా “నాతో సమానుడివీ.”
^ అక్ష., “విడిపించి.”
^ అంటే, 13, 14 వచనాల్లోని ఒకప్పటి స్నేహితుడు.
^ లేదా “తడబడనివ్వడు.”