దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 18:1-17

  • దావీదు విజయాలు (1-13)

  • దావీదు పరిపాలన (14-17)

18  కొంతకాలం తర్వాత దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించి, వాళ్లను లోబర్చుకున్నాడు; అతను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి గాతును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకున్నాడు.+  తర్వాత దావీదు మోయాబును ఓడించాడు;+ మోయాబీయులు దావీదుకు సేవకులై, అతనికి కప్పం కట్టారు.+  దావీదు సోబా+ రాజైన హదదెజరును+ హమాతు+ దగ్గర ఓడించాడు. హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.+  దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాల్ని, 7,000 మంది గుర్రపురౌతుల్ని, 20,000 మంది సైనికుల్ని పట్టుకున్నాడు.+ తర్వాత, రథాల్ని లాగే 100 గుర్రాల్ని తప్ప మిగతా వాటన్నిటినీ కుంటివాటిగా చేశాడు.+  దమస్కుకు చెందిన సిరియన్లు సోబా రాజైన హదదెజరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, దావీదు 22,000 మంది సిరియన్లను చంపాడు.  తర్వాత దావీదు దమస్కుకు చెందిన సిరియాలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు; సిరియన్లు దావీదుకు సేవకులై అతనికి కప్పం కట్టారు. దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+  అంతేకాదు, దావీదు హదదెజరు సేవకుల దగ్గర నుండి బంగారంతో చేసిన గుండ్రటి డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు.  హదదెజరు నగరాలైన టిబ్హతు నుండి, కూను నుండి దావీదు పెద్ద మొత్తంలో రాగిని తీసుకొచ్చాడు. ఆ రాగితో సొలొమోను రాగి సముద్రాన్ని,+ స్తంభాల్ని, రాగి పాత్రల్ని చేయించాడు.+  దావీదు సోబా రాజైన హదదెజరు సైన్యాన్నంతటినీ ఓడించాడని హమాతు రాజైన తోయి విన్నప్పుడు,+ 10  అతను వెంటనే దావీదు బాగోగుల గురించి అడగడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన హదోరమును దావీదు రాజు దగ్గరికి పంపించాడు; దావీదు హదదెజరుతో పోరాడి, అతన్ని ఓడించాడు కాబట్టి తోయి అలా చేశాడు (ఎందుకంటే హదదెజరుకు, తోయికి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి); హదోరము అన్నిరకాల వెండి, బంగారు, రాగి వస్తువుల్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. 11  దావీదు రాజు దేశాలన్నిటి నుండి, అంటే ఎదోము నుండి, మోయాబు నుండి, అలాగే అమ్మోనీయుల+ నుండి, ఫిలిష్తీయుల+ నుండి, అమాలేకీయుల+ నుండి కొల్లగొట్టిన వెండిబంగారాలతో పాటు వాటిని కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు.*+ 12  సెరూయా+ కుమారుడైన అబీషై+ ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయుల్ని హతం చేశాడు.+ 13  అతను ఎదోములో సైనిక స్థావరాల్ని స్థాపించాడు. ఎదోమీయులందరూ దావీదు సేవకులయ్యారు.+ దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+ 14  దావీదు ఇశ్రాయేలు అంతటి మీద పరిపాలిస్తూ+ తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు.+ 15  సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతిగా,+ అహీలూదు కుమారుడైన యెహోషాపాతు+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు. 16  అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా, షవ్షా కార్యదర్శిగా ఉన్నారు. 17  యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయుల+ మీద, పెలేతీయుల+ మీద అధికారిగా ఉన్నాడు. దావీదు కుమారులు రాజు తర్వాతి స్థానంలో ముఖ్య అధికారులుగా ఉన్నారు.

అధస్సూచీలు

లేదా “రక్షణను.”
లేదా “పవిత్రపర్చాడు.”
లేదా “రక్షణను.”