దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 24:1-31

  • దావీదు యాజకుల్ని 24 విభాగాలుగా విభజించడం (1-19)

  • ఇతర లేవీయుల బాధ్యతలు (20-31)

24  అహరోను వంశస్థుల విభాగాలు ఇవి: అహరోను కుమారులు నాదాబు, అబీహు,+ ఎలియాజరు, ఈతామారు.+  అయితే నాదాబు, అబీహు తమ తండ్రి కన్నా ముందే చనిపోయారు,+ వాళ్లకు కుమారులు లేరు. ఎలియాజరు,+ ఈతామారు మాత్రం యాజకులుగా సేవ చేస్తూ ఉన్నారు.  దావీదు, ఎలియాజరు కుమారుల్లో నుండి సాదోకుతో,+ ఈతామారు కుమారుల్లో నుండి అహీమెలెకుతో కలిసి అహరోను వంశస్థుల్ని వాళ్ల సేవ కోసం విభాగాలుగా విభజించాడు.  ఈతామారు కుమారుల్లో కన్నా ఎలియాజరు కుమారుల్లో ఎక్కువమంది అధిపతులు ఉన్నారు కాబట్టి, వాళ్లను దానికి తగ్గట్టుగా విభజించారు; ఎలియాజరు కుమారుల్లో 16 మంది తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నారు, ఈతామారు కుమారుల్లో 8 మంది తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నారు.  అంతేకాదు, పవిత్ర స్థల అధిపతులు, సత్యదేవుని సేవచేసే అధిపతులు ఎలియాజరు కుమారుల్లోనూ ఈతామారు కుమారుల్లోనూ ఉన్నారు. కాబట్టి ఒక గుంపును ఇంకో గుంపుతో పాటు చీట్లు+ వేసి వాళ్లను విభజించారు.  అప్పుడు నెతనేలు కుమారుడూ లేవీయుల కార్యదర్శీ అయిన షెమయా, రాజు ఎదుట, అధిపతుల ఎదుట, యాజకుడైన సాదోకు+ ఎదుట, అబ్యాతారు+ కుమారుడైన అహీమెలెకు+ ఎదుట, యాజకుల అలాగే లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దల ఎదుట వాళ్ల పేర్లను నమోదు చేశాడు; ఎలియాజరు కుమారుల్లో నుండి ఒక పూర్వీకుల కుటుంబం ఎంచుకోబడింది, అలాగే ఈతామారు కుమారుల్లో నుండి ఒక పూర్వీకుల కుటుంబం ఎంచుకోబడింది.  మొదటి చీటి యెహోయారీబుకు వచ్చింది; రెండో చీటి యెదాయాకు,  మూడో చీటి హారీముకు, నాలుగో చీటి శెయొరీముకు,  ఐదో చీటి మల్కీయాకు, ఆరో చీటి మీయామినుకు, 10  ఏడో చీటి హక్కోజుకు, ఎనిమిదో చీటి అబీయాకు,+ 11  తొమ్మిదో చీటి యేషూవకు, పదో చీటి షెకన్యాకు, 12  పదకొండో చీటి ఎల్యాషీబుకు, పన్నెండో చీటి యాకీముకు, 13  పదమూడో చీటి హుప్పాకు, పద్నాలుగో చీటి యెషెబాబుకు, 14  పదిహేనో చీటి బిల్గాకు, పదహారో చీటి ఇమ్మేరుకు, 15  పదిహేడో చీటి హెజీరుకు, పద్దెనిమిదో చీటి హప్పిస్సేసుకు, 16  పందొమ్మిదో చీటి పెతహయాకు, ఇరవయ్యో చీటి యెహెజ్కేలుకు, 17  ఇరవై ఒకటో చీటి యాకీనుకు, ఇరవై రెండో చీటి గామూలుకు, 18  ఇరవై మూడో చీటి దెలాయ్యాకు, ఇరవై నాలుగో చీటి మయజ్యాకు వచ్చింది. 19  యెహోవా మందిరంలోకి వచ్చి సేవ చేయడానికి, వాళ్ల కోసం చేసిన అధికారిక ఏర్పాటు అది.+ అది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఆజ్ఞాపించినట్టు, వాళ్ల పూర్వీకుడైన అహరోను నియమించిన పద్ధతి ప్రకారం చేయబడింది. 20  మిగతా లేవీయుల్లో వీళ్లు: అమ్రాము+ కుమారుల్లో షూబాయేలు;+ షూబాయేలు కుమారుల్లో యెహెదయా; 21  రెహబ్యా+ కుమారుల్లో అధిపతైన ఇష్షీయా; 22  ఇస్హారీయుల్లో షెలోమోతు;+ షెలోమోతు కుమారుల్లో యహతు; 23  హెబ్రోను కుమారుల్లో అధిపతైన యెరీయా,+ రెండోవాడైన అమర్యా, మూడోవాడైన యహజీయేలు, నాలుగోవాడైన యెక్మెయాము; 24  ఉజ్జీయేలు కుమారుల్లో మీకా; మీకా కుమారుల్లో షామీరు. 25  మీకా సహోదరుడు ఇష్షీయా; ఇష్షీయా కుమారుల్లో జెకర్యా. 26  మెరారి+ కుమారులు: మహలి, మూషి; యహజీయాహు కుమారుల్లో బెనో. 27  మెరారి వంశస్థుల్లో: యహజీయాహు కుమారుల్లో బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ; 28  మహలి కుమారుల్లో ఎలియాజరు; ఈ ఎలియాజరుకు కుమారులు లేరు;+ 29  కీషు కుమారుల్లో యెరహ్మెయేలు; 30  మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం లేవి కుమారులు. 31  వాళ్లు కూడా తమ సహోదరులైన అహరోను కుమారులు చేసినట్టే రాజైన దావీదు ఎదుట, సాదోకు ఎదుట, అహీమెలెకు ఎదుట, యాజకుల అలాగే లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దల ఎదుట చీట్లు+ వేశారు. పెద్దవాళ్ల పూర్వీకుల కుటుంబం అలాగే చిన్నవాళ్ల పూర్వీకుల కుటుంబం ఒకేలా ఎంచబడింది.

అధస్సూచీలు