దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 25:1-31

  • దేవుని మందిరం కోసం సంగీతకారులు, గాయకులు (1-31)

25  అంతేకాదు దావీదు, అలాగే ఆలయ సేవ అధిపతులు కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను+ కుమారుల్లో కొంతమందిని ప్రత్యేకపర్చారు; వీణలతో,* తంతివాద్యాలతో,+ తాళాలతో+ ప్రవచిస్తూ సేవ చేయడం కోసం వాళ్లను అలా ప్రత్యేకపర్చారు. ఆ సేవ కోసం నియమించబడిన వాళ్ల పట్టిక ఇది,  ఆసాపు కుమారుల్లో: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా; వీళ్లు ఆసాపు నిర్దేశం కింద ఉండేవాళ్లు. ఆసాపు, రాజు నిర్దేశంలో ప్రవచించేవాడు.  యెదూతూను+ కుమారుల్లో: గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా,+ వీళ్లు మొత్తం ఆరుగురు; వీళ్లు వీణతో ప్రవచిస్తూ, యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించే+ తమ తండ్రి యెదూతూను నిర్దేశం కింద ఉండేవాళ్లు.  హేమాను+ కుమారుల్లో: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.  వీళ్లందరూ హేమాను కుమారులు; అతను రాజు కోసం దర్శనాలు చూసేవాడు, సత్యదేవుణ్ణి మహిమపర్చడానికి దేవుని మాటల్ని రాజుకు ప్రకటించేవాడు; సత్యదేవుడు హేమానుకు 14 మంది కుమారుల్ని, ముగ్గురు కూతుళ్లను ఇచ్చాడు.  సత్యదేవుని మందిర సేవ కోసం తాళాలతో, తంతివాద్యాలతో, వీణలతో+ యెహోవా మందిరంలో పాటలు పాడడానికి వీళ్లందరూ తమ తండ్రి నిర్దేశం కింద ఉండేవాళ్లు. ఆసాపు, యెదూతూను, హేమాను రాజు నిర్దేశం కింద ఉండేవాళ్లు.  వీళ్లూ, యెహోవాకు పాటలు పాడడంలో శిక్షణ పొందిన వీళ్ల సహోదరులూ మొత్తం 288 మంది, వీళ్లంతా ప్రవీణులు.  కాబట్టి గొప్పవాళ్లు-తక్కువవాళ్లు, ప్రవీణులు-నేర్చుకునేవాళ్లు అనే తేడా లేకుండా అందరూ చీట్లు+ వేసుకుని బాధ్యతల్ని పంచుకున్నారు.  మొదటి చీటి ఆసాపు కుమారుడైన యోసేపు+ పేరున వచ్చింది, రెండో చీటి గెదల్యాకు+ వచ్చింది (అతను, అతని సహోదరులు, అతని కుమారులు మొత్తం 12 మంది); 10  మూడో చీటి జక్కూరుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 11  నాలుగో చీటి యిజ్రీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 12  ఐదో చీటి నెతన్యాకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 13  ఆరో చీటి బక్కీయాహుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 14  ఏడో చీటి యెషర్యేలాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 15  ఎనిమిదో చీటి యెషయాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 16  తొమ్మిదో చీటి మత్తన్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 17  పదో చీటి షిమీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 18  పదకొండో చీటి అజరేలుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 19  పన్నెండో చీటి హషబ్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 20  పదమూడో చీటి షూబాయేలుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 21  పద్నాలుగో చీటి మత్తిత్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 22  పదిహేనో చీటి యెరేమోతుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 23  పదహారో చీటి హనన్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 24  పదిహేడో చీటి యొష్బెకాషాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 25  పద్దెనిమిదో చీటి హనానీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 26  పందొమ్మిదో చీటి మల్లోతికి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 27  ఇరవయ్యో చీటి ఎలీయ్యాతాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 28  ఇరవై ఒకటో చీటి హోతీరుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 29  ఇరవై రెండో చీటి గిద్దల్తీకి+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 30  ఇరవై మూడో చీటి మహజీయోతుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 31  ఇరవై నాలుగో చీటి రోమమ్తీయెజెరుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది.

అధస్సూచీలు

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.