దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 26:1-32

  • ద్వారపాలకుల విభాగాలు (1-19)

  • ఖజానాల అధికారులు, ఇతర అధికారులు (20-32)

26  ద్వారపాలకుల+ విభాగాలు ఈ విధంగా ఉన్నాయి: కోరహీయుల్లో మెషెలెమ్యా,+ అతను ఆసాపు వంశస్థుడైన కోరే కుమారుడు.  మెషెలెమ్యా కుమారులు ఎవరంటే: మొదటివాడైన జెకర్యా, రెండోవాడైన యెదీయవేలు, మూడోవాడైన జెబద్యా, నాలుగోవాడైన యత్నీయేలు,  ఐదోవాడైన ఏలాము, ఆరోవాడైన యెహోహానాను, ఏడోవాడైన ఎల్యోయేనై.  ఓబేదెదోము కుమారులు ఎవరంటే: మొదటివాడైన షెమయా, రెండోవాడైన యెహోజాబాదు, మూడోవాడైన యోవాహు, నాలుగోవాడైన శాకారు, ఐదోవాడైన నెతనేలు,  ఆరోవాడైన అమ్మీయేలు, ఏడోవాడైన ఇశ్శాఖారు, ఎనిమిదోవాడైన పెయుల్లెతై; ఆ విధంగా దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించాడు.  అతని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టారు; వాళ్లు బలవంతులు, సమర్థులు కాబట్టి తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉండేవాళ్లు.  షెమయా కుమారులు: ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు; అతని సహోదరులైన ఎలీహు, సెమక్యా కూడా సమర్థులే.  వీళ్లందరూ ఓబేదెదోము వంశస్థులు; వాళ్లూ, వాళ్ల కుమారులూ, వాళ్ల సహోదరులూ సమర్థులు, సేవ చేయడానికి అర్హులు; ఓబేదెదోముకు చెందినవాళ్లు మొత్తం 62 మంది.  మెషెలెమ్యాకు+ మొత్తం 18 మంది కుమారులు, సహోదరులు ఉన్నారు; వాళ్లు సమర్థులు. 10  మెరారి వంశస్థుడైన హోసాకు కుమారులు ఉన్నారు. షిమ్రీ వాళ్లకు అధిపతి, అతను మొదటి కుమారుడు కాకపోయినా అతని తండ్రి అతన్ని అధిపతిగా నియమించాడు. 11  హిల్కీయా రెండోవాడు, టెబల్యాహు మూడోవాడు, జెకర్యా నాలుగోవాడు. హోసా కుమారులు, సహోదరులు మొత్తం 13 మంది. 12  ఈ ద్వారపాలకుల విభాగాల్లో, అధిపతులకు కూడా తమ సహోదరుల్లాగే యెహోవా మందిరంలోని సేవకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. 13  కాబట్టి వేర్వేరు ద్వారాల దగ్గర కాపలా కాయడానికి, తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం తక్కువవాళ్లు, గొప్పవాళ్లు అందరూ చీట్లు+ వేశారు. 14  తూర్పు వైపున్న ద్వారం కోసం చీటి వేసినప్పుడు అది షెలెమ్యా పేరున పడింది. అతని కుమారుడైన జెకర్యా తెలివిగల* సలహాదారుడు; వాళ్లు చీట్లు వేసినప్పుడు, ఉత్తరం వైపున్న ద్వారం అతనికి వచ్చింది. 15  దక్షిణం వైపున్న ద్వారం ఓబేదెదోముకు వచ్చింది, అతని కుమారులు+ గోదాముల మీద నియమించబడ్డారు. 16  పడమటి వైపున్న ద్వారం షుప్పీముకు, హోసాకు+ వచ్చింది; అది పైకి వెళ్లే రహదారి దగ్గర్లోని షల్లెకెతు ద్వారం దగ్గర ఉండేది; కాపలాకాసే గుంపులు పక్కపక్కన ఉండేవి. 17  తూర్పు వైపున ఆరుగురు లేవీయులు ఉండేవాళ్లు; ప్రతీరోజు ఉత్తరం వైపున నలుగురు, దక్షిణం వైపున నలుగురు ఉండేవాళ్లు; గోదాముల దగ్గర ఇద్దరేసి చొప్పున రెండు గుంపులు ఉండేవి.+ 18  పడమటి వైపున్న వరండాను కాపలా కాయడానికి రహదారి+ దగ్గర నలుగురు, వరండా దగ్గర ఇద్దరు ఉండేవాళ్లు. 19  ఇవి కోరహీయుల వంశస్థుల్లో, మెరారీయుల వంశస్థుల్లో ద్వారపాలకుల విభాగాలు. 20  లేవీయుల విషయానికొస్తే, సత్యదేవుని మందిర ఖజానాల మీద, ప్రతిష్ఠించిన* వస్తువులు ఉన్న ఖజానాల మీద అహీయా అధికారిగా ఉండేవాడు.+ 21  లద్దాను కుమారుల్లో: అంటే గెర్షోనీయుడైన లద్దాను కుమారుల్లో యెహీయేలీ;+ అతను గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో ఒకడు. 22  యెహీయేలీ కుమారులు: జేతాము, అతని సహోదరుడైన యోవేలు. వాళ్లు యెహోవా మందిర ఖజానాల+ మీద అధికారులుగా ఉండేవాళ్లు. 23  అమ్రామీయుల్లో నుండి ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు;+ 24  మోషే మనవడూ గెర్షోము కుమారుడూ అయిన షెబూయేలు గోదాముల మీద అధికారిగా ఉన్నాడు. 25  అతని సహోదరులైన ఎలీయెజెరు+ వంశస్థుల విషయానికొస్తే, ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా,+ రెహబ్యా కుమారుడు యెషయా, యెషయా కుమారుడు యోరాము, యోరాము కుమారుడు జిఖ్రీ, జిఖ్రీ కుమారుడు షెలోమోతు. 26  దావీదు రాజు,+ పూర్వీకుల కుటుంబాల పెద్దలు,+ సహస్రాధిపతులు,* శతాధిపతులు,* సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన* వస్తువులున్న ఖజానాలన్నిటి+ మీద ఈ షెలోమోతు, అతని సహోదరులు అధికారులుగా ఉన్నారు. 27  యుద్ధాల్లో+ కొల్లగొట్టిన వాటిలో+ నుండి కొంతభాగాన్ని యెహోవా మందిర నిర్వహణ కోసం వాళ్లు పవిత్రపర్చారు; 28  అలాగే దీర్ఘదర్శి+ అయిన సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు,+ సెరూయా+ కుమారుడైన యోవాబు+ ప్రతిష్ఠించిన వాటన్నిటినీ కూడా వాళ్లే చూసుకునేవాళ్లు. ఎవరైనా దేన్నైనా ప్రతిష్ఠిస్తే అది షెలోమీతు,* అతని సహోదరుల పర్యవేక్షణ కింద ఉంచబడేది. 29  ఇస్హారీయుల్లో+ కెనన్యా, అతని కుమారులు ఇశ్రాయేలు మీద అధికారులుగా, న్యాయమూర్తులుగా+ దేవుని మందిరం బయటి బాధ్యతల్ని నిర్వహించడానికి నియమించబడ్డారు. 30  హెబ్రోనీయుల్లో+ హషబ్యా, అతని సహోదరులు యొర్దాను పడమటి వైపున్న ప్రాంతంలో ఇశ్రాయేలు కార్యనిర్వహణను చూసుకునేవాళ్లు; వాళ్లు యెహోవా సేవకు, రాజు సేవకు సంబంధించిన పనులన్నిటి విషయంలో బాధ్యత వహించేవాళ్లు; వాళ్లు మొత్తం 1,700 మంది, వాళ్లు సమర్థులు. 31  హెబ్రోనీయుల్లో, తమ కుటుంబాల వంశావళి పట్టిక ప్రకారం యెరీయా+ హెబ్రోనీయుల అధిపతి. దావీదు పరిపాలన 40వ సంవత్సరంలో,+ కొంతమంది దావీదు మనుషులు హెబ్రోనీయుల్లో బలవంతులు, సమర్థులు అయిన పురుషుల కోసం వెదికారు. అలాంటివాళ్లను గిలాదులోని యాజెరులో+ కనుగొన్నారు. 32  యెరీయా సహోదరులు మొత్తం 2,700 మంది; వాళ్లు సమర్థులు, పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. కాబట్టి రాజైన దావీదు సత్యదేవునికి, రాజుకు సంబంధించిన పనులన్నిటి కోసం వాళ్లను రూబేనీయుల మీద, గాదీయుల మీద, మనష్షే అర్ధగోత్రం మీద నియమించాడు.

అధస్సూచీలు

లేదా “బుద్ధిగల.”
లేదా “పవిత్రపర్చిన; సమర్పించిన.”
లేదా “పవిత్రపర్చిన.”
అంటే, 100 మంది మీద అధిపతులు.
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
లేదా “షెలోమోతు.”