దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 27:1-34
-
రాజు సేవలో ఉన్న అధికారులు (1-34)
27 ఇది ఇశ్రాయేలీయుల, అంటే పూర్వీకుల కుటుంబాల పెద్దల, సహస్రాధిపతుల,* శతాధిపతుల,*+ అధికారుల సంఖ్య; వీళ్లు సంవత్సరంలో ప్రతీ నెల వంతులవారీగా, విభాగాలకు సంబంధించిన ప్రతీ విషయంలో రాజుకు సేవ చేసేవాళ్లు;+ ప్రతీ విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
2 మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము+ ఉండేవాడు, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
3 ఇతను పెరెసు వంశస్థుడు;+ మొదటి నెలలో సేవ చేయడానికి నియమించబడిన గుంపుల అధిపతులందరికీ ఇతను నాయకుడు.
4 రెండో నెలలోని విభాగానికి అహోహీయుడైన+ దోదై+ అధిపతి, వాళ్లలో మిక్లోతు నాయకుడు; అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
5 మూడో నెలలో సేవ చేయడానికి నియమించబడిన మూడో గుంపుకు ముఖ్య యాజకుడైన యెహోయాదా+ కుమారుడు బెనాయా+ అధిపతి, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
6 ఈ బెనాయా ఆ ముప్పై మంది బలమైన యోధుల్లో ఒకడు, ఆ ముప్పై మందికి అధిపతి; అతని విభాగానికి అతని కుమారుడైన అమ్మీజాబాదు అధిపతి.
7 నాలుగో నెలలో నాలుగో అధిపతి యోవాబు సహోదరుడైన+ అశాహేలు,+ అతని తర్వాత అతని కుమారుడు జెబద్యా అధిపతి; అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
8 ఐదో నెలలో ఐదో అధిపతి ఇశ్రాహేతీయుడైన షమ్హూతు, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
9 ఆరో నెలలో ఆరో అధిపతి తెకోవీయుడైన+ ఇక్కేషు కుమారుడు ఈరా,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
10 ఏడో నెలలో ఏడో అధిపతి ఎఫ్రాయిమీయులకు చెందిన పెలోనీయుడైన హేలెస్సు,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
11 ఎనిమిదో నెలలో ఎనిమిదో అధిపతి జెరహీయులకు+ చెందిన హూషాతీయుడైన సిబ్బెకై,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
12 తొమ్మిదో నెలలో తొమ్మిదో అధిపతి బెన్యామీనీయులకు చెందిన అనాతోతీయుడైన+ అబీయెజరు,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
13 పదో నెలలో పదో అధిపతి జెరహీయులకు+ చెందిన నెటోపాతీయుడైన మహరై,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
14 పదకొండో నెలలో పదకొండో అధిపతి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన పిరాతోనీయుడైన బెనాయా,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
15 పన్నెండో నెలలో పన్నెండో అధిపతి ఒత్నీయేలు సంతతికి చెందిన నెటోపాతీయుడైన హెల్దయి, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
16 వీళ్లు ఇశ్రాయేలు గోత్రాల నాయకులు: రూబేనీయుల్లో జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల్లో మయకా కుమారుడైన షెఫట్య;
17 లేవి గోత్రంలో కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోను వంశస్థుల్లో సాదోకు;
18 యూదా గోత్రంలో దావీదు సహోదరుల్లో ఒకడైన ఎలీహు;+ ఇశ్శాఖారు గోత్రంలో మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ;
19 జెబూలూను గోత్రంలో ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలి గోత్రంలో అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;
20 ఎఫ్రాయిమీయుల్లో అజజ్యా కుమారుడైన హోషేయ; మనష్షే అర్ధగోత్రంలో పెదాయా కుమారుడైన యోవేలు;
21 గిలాదులోని మనష్షే అర్ధగోత్రంలో జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీను గోత్రంలో అబ్నేరు+ కుమారుడైన యహశీయేలు;
22 దాను గోత్రంలో యెరోహాము కుమారుడైన అజరేలు. వీళ్లు ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు.
23 దావీదు 20 సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్లను లెక్కపెట్టలేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని ఆకాశ నక్షత్రాలంత మందిని చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు.+
24 సెరూయా కుమారుడైన యోవాబు లెక్కించడం మొదలుపెట్టాడు, కానీ దాన్ని పూర్తి చేయలేదు; అలా లెక్కించడం వల్ల దేవుని కోపం ఇశ్రాయేలు మీదికి వచ్చింది;+ దావీదు రాజు చరిత్ర వివరాల్లో ఆ సంఖ్య నమోదు చేయబడలేదు.
25 రాజు ఖజానాల+ మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పొలాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, కోటల్లో ఉన్న గోదాముల* మీద ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.
26 భూమిని సాగుచేసే పొలం పనివాళ్ల మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.
27 రామాతీయుడైన షిమీ ద్రాక్షతోటల మీద అధికారి; కోతకోసిన ద్రాక్షలతో తయారుచేసిన ద్రాక్షారసాన్ని నిల్వచేసే గోదాముల మీద షిప్మోతీయుడైన జబ్ది అధికారి.
28 షెఫేలాలోని+ ఒలీవ తోటల మీద, అత్తి చెట్ల+ మీద గెదెరీయుడైన బయల్-హానాను అధికారి; నూనెను నిల్వచేసే స్థలం మీద యోవాషు అధికారి.
29 షారోనులో+ మేతమేసే మందల మీద షారోనీయుడైన షిట్రయి అధికారి, లోయ మైదానాల్లోని మందల మీద అద్లాయి కుమారుడైన షాపాతు అధికారి.
30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి.
31 గొర్రెల, మేకల మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీళ్లందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించబడిన అధికారులు.
32 దావీదు సహోదరుని కుమారుడైన యోనాతాను+ ఒక సలహాదారుడు, అవగాహన ఉన్నవాడు, కార్యదర్శి; హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాకుమారుల్ని+ చూసుకునేవాడు.
33 అహీతోపెలు+ రాజు సలహాదారుడు, అర్కీయుడైన హూషై+ రాజు స్నేహితుడు.*
34 అహీతోపెలు తర్వాత, బెనాయా+ కుమారుడైన యెహోయాదా, అబ్యాతారు సలహాదారులు; యోవాబు+ రాజు సైన్యాధిపతి.
అధస్సూచీలు
^ అంటే, 100 మంది మీద అధిపతులు.
^ అంటే, 1,000 మంది మీద అధిపతులు.
^ లేదా “ఖజానాల.”
^ లేదా “ఆంతరంగికుడు.”