దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4:1-43
4 యూదా కుమారులు: పెరెసు,+ ఎస్రోను,+ కర్మీ, హూరు,+ శోబాలు.+
2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కన్నాడు; యహతు అహూమైని, లహదును కన్నాడు. ఇవి సొరాతీయుల+ కుటుంబాలు.
3 ఏతాము+ తండ్రి* కుమారులు: యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు (వీళ్ల సహోదరి పేరు హజ్జెలెల్పోని),
4 గెదోరు తండ్రైన పెనూయేలు, హూషా తండ్రైన ఏసెరు. వీళ్లు ఎఫ్రాతా మొదటి కుమారుడూ బేత్లెహేము+ తండ్రీ అయిన హూరు+ కుమారులు.
5 తెకోవ+ తండ్రైన అష్షూరుకు+ హెలా, నయరా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
6 నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హయహష్తారీని కన్నది. వీళ్లు నయరా కుమారులు.
7 హెలా కుమారులు: జెరెతు, ఇస్హారు, ఎత్నాను.
8 కోజు ఆనూబుకు, జోబేబాకు, హారుము కుమారుడైన అహర్హేలు కుటుంబాలకు తండ్రి అయ్యాడు.
9 యబ్బేజు తన సహోదరులకన్నా ఘనుడయ్యాడు; అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అంటూ అతనికి యబ్బేజు* అని పేరు పెట్టింది.
10 యబ్బేజు ఇశ్రాయేలు దేవుణ్ణి, “నువ్వు నన్ను ఆశీర్వదించి, నా ప్రాంతం విస్తరించేలా చేయి. నాకు ఎలాంటి హానీ జరగకుండా నాకు ఎప్పుడూ తోడుగా ఉండి, నన్ను విపత్తు నుండి రక్షించు!” అని వేడుకున్నాడు. దేవుడు అతను కోరినట్టు చేశాడు.
11 షూవహు సహోదరుడైన కెలూబు మెహీరును కన్నాడు; మెహీరు ఎష్తోనును కన్నాడు.
12 ఎష్తోను బేత్రఫాను, పాసెయను, ఈర్నాహాషు తండ్రైన తెహిన్నాను కన్నాడు. వీళ్లు రేకావాళ్లు.
13 కనజు కుమారులు: ఒత్నీయేలు,+ శెరాయా; ఒత్నీయేలు కుమారుడు* హతతు.
14 మెయానొతై ఒఫ్రాను కన్నాడు. శెరాయా యోవాబును కన్నాడు, ఇతను గెహరాషీము* నివాసుల తండ్రి, వాళ్లకు చేతిపనుల్లో నైపుణ్యం ఉండేది కాబట్టి ఆ పేరు వచ్చింది.
15 యెఫున్నె కుమారుడైన కాలేబు+ కుమారులు: ఈరూ, ఏలా, నయము; ఏలా కుమారుడు* కనజు.
16 యెహల్లెలేలు కుమారులు: జీఫు, జీఫా, తీర్యా, అశర్యేలు.
17 ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను; ఆమె* మిర్యామును, షమ్మయిని, ఎష్టెమోయకు తండ్రైన ఇష్బాహును కన్నది.
18 (యూదురాలైన అతని భార్య, గెదోరు తండ్రైన యెరెదును, శోకో తండ్రైన హెబెరును, జానోహ తండ్రైన యెకూతీయేలును కన్నది.) వీళ్లు ఫరో కూతురైన బిత్యా కుమారులు, ఈమె మెరెదు భార్య.
19 హోదీయా భార్యకు, అంటే నహము సహోదరికి పుట్టిన కుమారులు గర్మీయుడైన కెయీలాను, మాయకాతీయుడైన ఎష్టెమోయను కన్నారు.
20 షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు: జోహేతు, బెన్జోహేతు.
21 యూదా కుమారుడైన షేలహు+ కుమారులు: లేకా తండ్రైన ఏరు, మారేషా తండ్రైన లద్దాయి, నాణ్యమైన బట్టలు తయారుచేసే అష్బేయ వంశస్థులు,
22 మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్న యోకీమీ, కోజేబా మనుషులు, యోవాషు, శారాపు; అలాగే యాషూబిలెహెము. ఈ వివరాలు ప్రాచీనమైనవి.
23 వీళ్లు నెతాయీములో, గెదేరాలో నివసించిన కుమ్మరులు. వాళ్లు అక్కడ నివసిస్తూ రాజు కోసం పనిచేశారు.
24 షిమ్యోను కుమారులు:+ నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు.+
25 షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా.
26 మిష్మా వంశస్థులు: అతని కుమారుడు హమ్మూయేలు, హమ్మూయేలు కుమారుడు జక్కూరు, జక్కూరు కుమారుడు షిమీ.
27 షిమీకి 16 మంది కుమారులు, ఆరుగురు కూతుళ్లు; అయితే అతని సహోదరులకు ఎక్కువమంది కుమారులు లేరు; వాళ్ల కుటుంబాల్లో ఎవరికీ యూదా మనుషులకు ఉన్నంతమంది కుమారులు లేరు.+
28 వాళ్లు నివాసమున్న నగరాలు: బెయేర్షెబా, మోలాదా,+ హజర్షువలు,+
29 బిల్హా, ఎజెము,+ తోలాదు,
30 బెతూయేలు,+ హోర్మా,+ సిక్లగు,+
31 బేత్-మర్కాబోతు, హాజర్సూసా, బేత్బీరీ, షరాయిము. దావీదు పరిపాలన మొదలుపెట్టేంత వరకు వాళ్లు ఆ నగరాల్లోనే నివసించారు.
32 వాళ్లు నివసించిన నగరాలు: ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను;+ మొత్తం ఐదు నగరాలు,
33 అలాగే బయలు వరకున్న వాటి చుట్టుపక్కల పల్లెలు. ఇవి వాళ్ల వంశావళి పట్టికల్లో నమోదైన పేర్లు, వాళ్లు నివసించిన ప్రాంతాలు.
34 ఇంకా మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా,
35 యోవేలు, అశీయేలు మునిమనవడూ శెరాయా మనవడూ యోషిబ్యా కుమారుడూ అయిన యెహూ,
36 అలాగే ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా,
37 అలాగే జీజా; ఇతను షిపి కుమారుడు, షిపి అల్లోను కుమారుడు, అల్లోను యెదాయా కుమారుడు, యెదాయా షిమ్రీ కుమారుడు, షిమ్రీ షెమయా కుమారుడు;
38 వంశావళిలో పేర్లతో ప్రస్తావించబడిన వీళ్లు తమ కుటుంబాలకు ప్రధానులు; వాళ్ల పూర్వీకుల కుటుంబాలు వృద్ధి అయ్యాయి.
39 వాళ్లు తమ మందల కోసం పచ్చికబయళ్లను వెదకడానికి లోయకు తూర్పు వైపున్న గెదోరు ద్వారం దగ్గరికి వెళ్లారు.
40 చివరికి వాళ్లకు సారవంతమైన, మంచి పచ్చికబయళ్లు కనిపించాయి. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశస్థులు+ నివసించేవాళ్లు.
41 వంశావళి పట్టికలో పేర్లు నమోదైన వీళ్లు, యూదా రాజైన హిజ్కియా+ రోజుల్లో అక్కడికి వచ్చి అక్కడ నివసిస్తున్న హాము వంశస్థుల, మెయోనీయుల డేరాల్ని పడగొట్టారు. వాళ్లను పూర్తిగా నాశనం చేశారు; అక్కడ తమ మందలకు పచ్చికబయళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు.
42 షిమ్యోనీయుల్లో కొంతమంది, అంటే 500 మంది, ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకత్వం కింద శేయీరు పర్వతం+ దగ్గరికి వెళ్లారు.
43 వాళ్లు అక్కడికి తప్పించుకొని పారిపోయిన మిగతా అమాలేకీయుల్ని చంపి,+ ఈ రోజు వరకు అక్కడే నివసిస్తున్నారు.
అధస్సూచీలు
^ ఈ అధ్యాయంలోని కొన్ని పేర్లు, మనుషుల్ని కాకుండా స్థలాల్ని సూచించవచ్చు. ఆ సందర్భాల్లో “తండ్రి” అనే మాట, స్థాపించిన వ్యక్తిని సూచిస్తుండవచ్చు.
^ యబ్బేజు అనే పేరుకు “వేదన” అనే అర్థమున్న హీబ్రూ పదంతో సంబంధం ఉండవచ్చు.
^ అక్ష., “కుమారులు.”
^ “చేతిపనుల్లో నైపుణ్యం ఉన్నవాళ్ల లోయ” అని అర్థం.
^ అక్ష., “కుమారులు.”
^ 18వ వచనంలో ఉన్న బిత్యాను సూచిస్తుండవచ్చు.