దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5:1-26

  • రూబేను వంశస్థులు (1-10)

  • గాదు వంశస్థులు (11-17)

  • హగ్రీయీలను జయించడం (18-22)

  • మనష్షే అర్ధగోత్రం వాళ్లు (23-26)

5  ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను+ కుమారుల వివరాలు కింద నమోదు చేయబడ్డాయి. అతను మొదటి కుమారుడే అయినా, అతను తన తండ్రి పడకను అపవిత్రపర్చాడు*+ కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది.+ కాబట్టి ఇశ్రాయేలు కుటుంబ వంశావళి పట్టికలో రూబేను మొదటి కుమారుడిగా నమోదు చేయబడలేదు.  యూదా+ తన సహోదరుల కన్నా గొప్పవాడే అయినా, నాయకుడు కాబోయే వ్యక్తి అతని నుండే వచ్చినా,+ జ్యేష్ఠత్వపు హక్కు మాత్రం యోసేపుకు వచ్చింది.  ఇశ్రాయేలు పెద్ద కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+  యోవేలు వంశస్థులు: అతని కుమారుడు షెమయా, షెమయా కుమారుడు గోగు, గోగు కుమారుడు షిమీ,  షిమీ కుమారుడు మీకా, మీకా కుమారుడు రెవాయా, రెవాయా కుమారుడు బయలు,  బయలు కుమారుడు బెయేర; ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు+ బందీగా తీసుకెళ్లాడు; బెయేర రూబేనీయులకు ప్రధానుడు.  వాళ్ల కుటుంబాల వంశావళి పట్టిక ప్రకారం అతని సహోదరులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా,  బెల; ఇతను ఆజాజు కుమారుడు; ఆజాజు షెమ కుమారుడు; షెమ యోవేలు కుమారుడు; బెల ఇంటివాళ్లు అరోయేరులో,+ అలాగే నెబో, బయల్మెయోను+ వరకు నివసించారు.  వాళ్ల పశువుల సంఖ్య గిలాదు ప్రాంతంలో+ వృద్ధి అయ్యింది కాబట్టి, వాళ్లు తూర్పున యూఫ్రటీసు నది+ దగ్గరి ఎడారి* సరిహద్దు వరకు స్థిరపడ్డారు. 10  సౌలు రోజుల్లో, వాళ్లు హగ్రీయీలతో యుద్ధం చేసి వాళ్లను ఓడించారు. దాంతో గిలాదుకు తూర్పున ఉన్న ప్రాంతమంతట్లో వాళ్లు తమ డేరాల్లో నివసించారు. 11  గాదు వంశస్థులు వాళ్లకు పక్కనే, బాషాను దేశంలో సల్కా+ వరకు నివసించారు. 12  బాషానులో యోవేలు నాయకుడు, రెండో నాయకుడు షాపాము. వాళ్లతోపాటు యహనై, షాపాతు కూడా నాయకులుగా ఉన్నారు. 13  వాళ్ల పూర్వీకుల కుటుంబాలకు చెందిన వాళ్ల సహోదరులు: మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు; మొత్తం ఏడుగురు. 14  వీళ్లు హూరీ కుమారుడైన అబీహాయిలు కుమారులు. హూరీ యారోయ కుమారుడు; యారోయ గిలాదు కుమారుడు; గిలాదు మిఖాయేలు కుమారుడు; మిఖాయేలు యెషీషై కుమారుడు; యెషీషై యహదో కుమారుడు. యహదో బూజు కుమారుడు. 15  గూనీ మనవడూ అబ్దీయేలు కుమారుడూ అయిన అహీ వాళ్ల పూర్వీకుల కుటుంబానికి పెద్ద. 16  వాళ్లు గిలాదులో, బాషానులో,+ వాటి చుట్టుపక్కల పట్టణాల్లో, షారోనులో పచ్చికబయళ్లు విస్తరించివున్న ప్రాంతం వరకు నివసించారు. 17  యూదా రాజైన యోతాము+ రోజుల్లో, ఇశ్రాయేలు రాజైన యరొబాము* రోజుల్లో వాళ్లందరూ వంశావళి పట్టికలో నమోదు చేయబడ్డారు. 18  రూబేనీయుల, గాదీయుల, మనష్షే అర్ధగోత్రం వాళ్ల సైన్యంలో డాళ్లు, కత్తులు, విల్లులు ధరించిన 44,760 మంది బలమైన యోధులు ఉన్నారు. వాళ్లు యుద్ధంలో శిక్షణ పొందినవాళ్లు. 19  వాళ్లు హగ్రీయీలతో, యెతూరు, నాపీషు,+ నోదాబు వంశస్థులతో యుద్ధం చేశారు.+ 20  ఆ యుద్ధంలో దేవుడు వాళ్లకు సహాయం చేసి హగ్రీయీలను, వాళ్లతోపాటు ఉన్నవాళ్లందర్నీ అప్పగించాడు. ఎందుకంటే యుద్ధంలో సహాయం చేయమని వాళ్లు దేవుణ్ణి వేడుకున్నారు; అంతేకాదు వాళ్లు ఆయనమీద నమ్మకం ఉంచారు కాబట్టి ఆయన వాళ్ల మొర విన్నాడు.+ 21  వాళ్లు వాళ్ల పశువుల్ని, అంటే 50,000 ఒంటెల్ని, 2,50,000 గొర్రెల్ని, 2,000 గాడిదల్ని, అలాగే 1,00,000 మంది ప్రజల్ని పట్టుకున్నారు. 22  యుద్ధం చేసింది సత్యదేవుడే+ కాబట్టి శత్రువులు చాలామంది చనిపోయారు. వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడేంత వరకు ఆ ప్రజల దేశంలోనే నివసించారు.+ 23  మనష్షే అర్ధగోత్రం వాళ్లు బాషాను నుండి బయల్హెర్మోను, శెనీరు, హెర్మోను పర్వతం+ వరకు ఉన్న ప్రాంతంలో నివసించారు. వాళ్లు చాలామంది ఉన్నారు. 24  వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దలు: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు; వాళ్లు బలమైన యోధులు, పేరు పొందినవాళ్లు, తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. 25  అయితే వాళ్లు తమ పూర్వీకుల దేవునికి నమ్మకద్రోహం చేసి, వాళ్ల ఎదుట నుండి ఆయన నిర్మూలించిన దేశ ప్రజల దేవుళ్లను పూజించారు.*+ 26  కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అష్షూరు రాజైన పూలు (అంటే, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు)+ మనసును రేపాడు.+ దాంతో అతను రూబేనీయుల్ని, గాదీయుల్ని, మనష్షే అర్ధగోత్రం వాళ్లను బందీలుగా తీసుకెళ్లాడు. వాళ్లను హాలహు, హాబోరు, హారా, గోజాను నది దగ్గరికి తీసుకెళ్లాడు.+ వాళ్లు ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు.

అధస్సూచీలు

లేదా “అగౌరవపర్చాడు.”
పదకోశం చూడండి.
అంటే, యరొబాము II.
లేదా “దేవుళ్లతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు.”