దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 7:1-40
7 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను;+ మొత్తం నలుగురు.
2 తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు. వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. తోలా నుండి బలమైన యోధులు వచ్చారు; దావీదు రోజుల్లో వాళ్ల సంఖ్య 22,600.
3 ఉజ్జీ వంశస్థులు:* ఇజ్రహయా, ఇజ్రహయా కుమారులైన మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ ఐదుగురు తమ కుటుంబాలకు పెద్దలు.*
4 వాళ్లకు చాలామంది భార్యలు, కుమారులు ఉన్నారు, కాబట్టి తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం వాళ్ల వంశస్థుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులు 36,000 మంది ఉన్నారు.
5 ఇశ్శాఖారు కుటుంబాలన్నిట్లో ఉన్న వాళ్ల సహోదరులు బలమైన యోధులు; వంశావళి పట్టికలో నమోదు చేయబడినదాని ప్రకారం వాళ్ల సంఖ్య 87,000.+
6 బెన్యామీను కుమారులు:+ బెల,+ బేకెరు,+ యెదీయవేలు;+ మొత్తం ముగ్గురు.
7 బెల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ; మొత్తం ఐదుగురు. వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు, బలమైన యోధులు. వాళ్ల వంశావళి పట్టికలో నమోదైనవాళ్లు 22,034 మంది.+
8 బేకెరు కుమారులు: జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరేమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీళ్లందరూ బేకెరు కుమారులు.
9 వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దల ప్రకారం, వాళ్ల వంశావళి పట్టికలో 20,200 మంది బలమైన యోధులు ఉన్నారు.
10 యెదీయవేలు+ వంశస్థులు బిల్హాను, బిల్హాను కుమారులు; బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
11 వీళ్లందరూ యెదీయవేలు కుమారులు; వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దల ప్రకారం, వాళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న బలమైన యోధులు 17,200 మంది ఉన్నారు.
12 షుప్పీమువాళ్లు, హుప్పీమువాళ్లు ఈరు+ కుమారులు; హుషీమువాళ్లు అహేరు కుమారులు.
13 నఫ్తాలి కుమారులు:+ యహసయేలు, గూనీ, యేసెరు, షల్లూము. వీళ్లు బిల్హా వంశస్థులు.*+
14 మనష్షే+ వంశస్థులు: అశ్రీయేలు, ఇతన్ని సిరియాకు చెందిన మనష్షే ఉపపత్ని కన్నది. (ఆమె గిలాదు తండ్రైన మాకీరును+ కన్నది.
15 మాకీరు హుప్పీముకు, షుప్పీముకు పెళ్లిళ్లు చేశాడు. వాళ్ల సహోదరి పేరు మయకా.) రెండోవాడి పేరు సెలోపెహాదు;+ అయితే సెలోపెహాదుకు కూతుళ్లు మాత్రమే ఉన్నారు.+
16 మాకీరు భార్య మయకా ఒక కుమారుణ్ణి కని అతనికి పెరెషు అని పేరు పెట్టింది; అతని తమ్ముడి పేరు షెరెషు; షెరెషు కుమారులు: ఊలాము, రేకెము.
17 ఊలాము కుమారుడు* బెదాను. వీళ్లందరూ, మనష్షే మనవడూ మాకీరు కుమారుడూ అయిన గిలాదు వంశస్థులు.
18 అతని సహోదరి హమ్మోలెకెతు. ఆమె ఇషోదును, అబీయెజరును, మహలాను కన్నది.
19 షెమీదా కుమారులు: అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
20 ఎఫ్రాయిము వంశస్థులు:+ షూతలహు,+ అతని కుమారుడు బెరెదు, బెరెదు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఎలాదా, ఎలాదా కుమారుడు తాహతు,
21 తాహతు కుమారుడు జాబాదు, జాబాదు కుమారుడు షూతలహు, ఏసెరు, ఎల్యాదు. ఆ దేశంలో పుట్టిన గాతు+ మనుషులు ఎఫ్రాయిము వంశస్థుల పశువుల్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఏసెరును, ఎల్యాదును చంపారు.
22 అప్పుడు వాళ్ల తండ్రి ఎఫ్రాయిము చాలా రోజులపాటు దుఃఖించాడు, అతని సహోదరులు అతని దగ్గరికి వచ్చి ఓదార్చేవాళ్లు.
23 తర్వాత ఎఫ్రాయిము తన భార్యతో కలిశాడు, ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. తన కుటుంబం మీదికి విపత్తు వచ్చిన సమయంలో ఆమె అతన్ని కన్నది కాబట్టి ఎఫ్రాయిము అతనికి బెరీయా* అని పేరు పెట్టాడు.
24 అతని కూతురు షెయెరా; ఆమె దిగువ బేత్-హోరోనును,+ ఎగువ బేత్-హోరోనును+ అలాగే ఉజ్జెన్షెయెరాను కట్టించింది.
25 రెపహు, రెషెపు ఎఫ్రాయిము వంశస్థులు. రెషెపు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను,
26 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
27 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.*+
28 ఎఫ్రాయిము వంశస్థులు స్థిరపడిన ప్రాంతాలు ఇవి: బేతేలు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; తూర్పు వైపు నహరా, పడమటి వైపు గెజెరు, దాని చుట్టుపక్కల పట్టణాలు; షెకెము, దాని చుట్టుపక్కల పట్టణాలు; అయ్యా,* దాని చుట్టుపక్కల పట్టణాల వరకు;
29 మనష్షే వంశస్థుల పక్కన బేత్షెయాను,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; తానాకు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; మెగిద్దో+ దాని చుట్టుపక్కల పట్టణాలు; దోరు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు. ఈ ప్రాంతాల్లో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు వంశస్థులు నివసించారు.
30 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా.+ వాళ్ల సహోదరి శెరహు.+
31 బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయీతుకు తండ్రి.
32 హెబెరుకు యప్లేటు, షోమేరు, హోతాము, వాళ్ల సహోదరి షూయ పుట్టారు.
33 యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్లు యప్లేటు కుమారులు.
34 షెమెరు* కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
35 అతని సహోదరుడైన హేలెము* కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36 జోపహు కుమారులు: సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
37 బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర.
38 యెతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా.
39 ఉల్లా కుమారులు: ఆరహు, హన్నీయేలు, రిజెయా.
40 వీళ్లందరూ ఆషేరు వంశస్థులు; వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు, ఎంపిక చేయబడినవాళ్లు, బలమైన యోధులు, ప్రధానుల పెద్దలు; వాళ్ల వంశావళి పట్టిక ప్రకారం+ వాళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్లు 26,000 మంది ఉన్నారు.+
అధస్సూచీలు
^ అక్ష., “ప్రధానులు.”
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ “విపత్తుతో” అని అర్థం.
^ “యెహోవాయే రక్షణ” అని అర్థం.
^ లేదా “గాజా” అయ్యుంటుంది; అయితే ఇది ఫిలిష్తీయుల గాజా కాదు.
^ 32వ వచనంలో షోమేరు అని కూడా పిలవబడ్డాడు.
^ ఇతను బహుశా 32వ వచనంలోని హోతాము అయ్యుంటాడు.