దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 8:1-40

  • బెన్యామీను వంశస్థులు (1-40)

    • సౌలు వంశం (33-40)

8  బెన్యామీను+ తన మొదటి కుమారుడైన బెలను,+ రెండో కుమారుడైన అష్బేలును,+ మూడో కుమారుడైన అహరహును,  నాలుగో కుమారుడైన నోహాను, ఐదో కుమారుడైన రాపాను కన్నాడు.  బెల కుమారులు: అద్దారు, గెరా,+ అబీహూదు,  అబీషూవ, నయమాను, అహోయహు,  గెరా, షెపూపాను, హూరాము.  గెబా+ నివాసుల పూర్వీకుల కుటుంబాలకు పెద్దలైన ఏహూదు కుమారులు మానహతుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. వాళ్లు:  నయమాను, అహీయా, గెరా; వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడినప్పుడు గెరా వాళ్లకు నాయకత్వం వహించాడు. అతను ఉజ్జాను, అహీహూదును కన్నాడు.  మోయాబీయుల్ని పంపించేసిన తర్వాత షహరయీము మోయాబు ప్రాంతంలో పిల్లల్ని కన్నాడు. అతని భార్యలు హుషీము, బయరా.*  అతను తన భార్య హోదెషు ద్వారా యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, 10  యెవూజును, షాక్యాను, మిర్మాను కన్నాడు. వీళ్లు అతని కుమారులు, పూర్వీకుల కుటుంబాల పెద్దలు. 11  షహరయీము హుషీము ద్వారా అబీటూబును, ఎల్పయలును కన్నాడు. 12  ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఇతను ఓనోను,+ లోదును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని కట్టించాడు), 13  బెరీయా, షెమ. వీళ్లు అయ్యాలోను+ నివాసుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు. వీళ్లు గాతు నివాసుల్ని వెళ్లగొట్టారు. 14  అలాగే అహ్యో, షాషకు, యెరేమోతు, 15  జెబద్యా, అరాదు, ఏదెరు, 16  మిఖాయేలు, ఇష్పా, యోహా; వీళ్లు బెరీయా కుమారులు; 17  జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, 18  ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు; వీళ్లు ఎల్పయలు కుమారులు; 19  అలాగే యాకీము, జిఖ్రీ, జబ్ది, 20  ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21  అదాయా, బెరాయా, షిమ్రాతు; వీళ్లు షిమీ కుమారులు; 22  ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23  అబ్దోను, జిఖ్రీ, హానాను, 24  హనన్యా, ఏలాము, అంతోతీయా, 25  ఇపెదయా, పెనూయేలు; వీళ్లు షాషకు కుమారులు; 26  షంషెరై, షెహర్యా, అతల్యా, 27  యహరెష్యా, ఏలీయా, జిఖ్రీ; వీళ్లు యెరోహాము కుమారులు. 28  వీళ్లు వంశాల ప్రకారం పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. ఈ పెద్దలు యెరూషలేములో నివసించారు. 29  గిబియోనుకు తండ్రైన యెహీయేలు గిబియోనులో+ నివసించాడు. అతని భార్య పేరు మయకా.+ 30  అతని మొదటి కుమారుడు అబ్దోను, మిగతావాళ్లు సూరు, కీషు, బయలు, నాదాబు, 31  గెదోరు, అహ్యో, జెకెరు. 32  మిక్లోతు షిమ్యాను కన్నాడు. వాళ్లందరూ యెరూషలేములో తమ సహోదరుల* దగ్గర నివసించారు. 33  నేరు+ కీషును కన్నాడు; కీషు సౌలును కన్నాడు;+ సౌలు యోనాతానును,+ మెల్కీషూవను,+ అబీనాదాబును,+ ఎష్బయలును* కన్నాడు.+ 34  యోనాతాను మెరీబ్బయలును*+ కన్నాడు. మెరీబ్బయలు మీకాను కన్నాడు.+ 35  మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు. 36  ఆహాజు యెహోయాదాను కన్నాడు; యెహోయాదా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కన్నాడు. జిమ్రీ మోజాను కన్నాడు. 37  మోజా బిన్యాను కన్నాడు, బిన్యా రాపాను కన్నాడు, రాపా ఎలాశాను కన్నాడు, ఎలాశా ఆజేలును కన్నాడు. 38  ఆజేలుకు ఆరుగురు కుమారులు; వాళ్ల పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్లందరూ ఆజేలు కుమారులు. 39  అతని సహోదరుడైన ఏషెకు కుమారులు వీళ్లు: మొదటి కుమారుడు ఊలాము, రెండో కుమారుడు యూషు, మూడో కుమారుడు ఎలీపేలెటు. 40  ఊలాము కుమారులు బలమైన యోధులు, విల్లును ఉపయోగించడంలో నేర్పరులు; వాళ్లకు చాలామంది కుమారులు, మనవళ్లు ఉన్నారు. వాళ్లు మొత్తం 150 మంది. వీళ్లందరూ బెన్యామీను వంశస్థులు.

అధస్సూచీలు

లేదా “అతను తన భార్యలైన హుషీమును, బయరాను పంపించేసిన తర్వాత” అయ్యుంటుంది.
అంటే, తోటి బెన్యామీనీయులు.
ఇష్బోషెతు అని కూడా పిలవబడ్డాడు.
మెఫీబోషెతు అని కూడా పిలవబడ్డాడు.