రాజులు రెండో గ్రంథం 11:1-21
11 అహజ్యా తల్లియైన అతల్యా+ తన కుమారుడు చనిపోవడం చూసినప్పుడు,+ ఆమె రాజవంశం* మొత్తాన్ని నాశనం చేసింది.+
2 అయితే, యెహోరాము రాజు కూతురూ అహజ్యా సహోదరీ అయిన యెహోషెబ, అహజ్యా కుమారుడైన యెహోయాషును+ దాచిపెట్టింది. ఆమె చంపబడబోయే రాకుమారుల్లో నుండి అతన్ని రహస్యంగా తీసుకెళ్లి అతన్ని, అతని దాదిని లోపలి పడకగదిలో ఉంచింది. వాళ్లు అతన్ని అతల్యాకు కనబడకుండా ఏదో విధంగా దాచిపెట్టారు కాబట్టి అతను చంపబడలేదు.
3 అతను ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో దాచబడి, ఆమె దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో అతల్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది.
4 ఏడో సంవత్సరంలో యెహోయాదా, రాజ అంగరక్షకుల మీద, రాజభవన కాపలావాళ్ల* మీద ఉన్న శతాధిపతుల్ని*+ రమ్మని కబురు చేశాడు. అతను వాళ్లను యెహోవా మందిరం దగ్గరికి పిలిపించాడు. అతను వాళ్లతో ఒక ఒప్పందం* చేసి, యెహోవా మందిరంలో వాళ్లతో ఒట్టు వేయించి, తర్వాత వాళ్లకు రాకుమారుణ్ణి చూపించాడు.+
5 యెహోయాదా వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఏమి చేయాలంటే, మీలో మూడోవంతు మంది విశ్రాంతి రోజున పనిలోకి వచ్చి, రాజభవనాన్ని గట్టిగా కాపలా కాయాలి,+
6 ఇంకో మూడోవంతు మంది పునాది ద్వారం దగ్గర ఉండాలి, మరో మూడోవంతు మంది రాజభవన కాపలాదారుల వెనకున్న ద్వారం దగ్గర ఉండాలి. మీరు వంతులవారీగా మందిరాన్ని కాపలా కాయాలి.
7 విశ్రాంతి రోజున పనికి వెళ్లాల్సిన అవసరం లేని మీ రెండు విభాగాలవాళ్లు రాజును కాపాడడానికి యెహోవా మందిరాన్ని గట్టిగా కాపలా కాయాలి.
8 మీలో ప్రతీ ఒక్కరు ఆయుధాలు చేతపట్టుకుని రాజుకు అన్నివైపులా కాపలా కాయాలి. ఎవరైనా సైనిక పంక్తుల్లోకి ప్రవేశిస్తే, వాళ్లను చంపాలి. రాజు ఎక్కడికి వెళ్లినా* మీరు అతని వెంట ఉండాలి.”
9 ఆ శతాధిపతులు+ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టే చేశారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు విశ్రాంతి రోజున పని చేస్తున్న తమ మనుషుల్ని, అలాగే విశ్రాంతి రోజున పనికి వెళ్లాల్సిన అవసరం లేని తమ మనుషుల్ని వెంటబెట్టుకొని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు.+
10 అప్పుడు యాజకుడు, యెహోవా మందిరంలో ఉన్న దావీదు రాజు ఈటెల్ని, గుండ్రటి డాళ్లను శతాధిపతులకు ఇచ్చాడు.
11 రాజభవన కాపలాదారులు+ ఆయుధాలు పట్టుకొని మందిరం కుడివైపు నుండి ఎడమవైపు వరకు, బలిపీఠం+ పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ తమతమ స్థానాల్లో నిలబడ్డారు.
12 అప్పుడు యెహోయాదా రాజు కుమారుణ్ణి+ బయటికి తీసుకొచ్చి అతని తలమీద కిరీటాన్ని, దేవుని ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టను+ పెట్టాడు. వాళ్లు అతన్ని రాజును చేసి అభిషేకించారు. తర్వాత వాళ్లు చప్పట్లు కొడుతూ, “రాజు దీర్ఘకాలం జీవించాలి!” అని అరిచారు.+
13 ప్రజలు పరుగెత్తుతున్న శబ్దం విన్నప్పుడు, అతల్యా వెంటనే యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.+
14 ఆచారం ప్రకారం రాజు అక్కడ స్తంభం పక్కన నిలబడి ఉండడం ఆమె చూసింది.+ అధిపతులు, బాకాలు ఊదేవాళ్లు+ రాజు పక్కన ఉన్నారు, దేశంలోని ప్రజలందరూ సంతోషిస్తూ బాకాలు ఊదుతున్నారు. అప్పుడు అతల్యా తన బట్టలు చింపుకొని, “కుట్ర! కుట్ర!” అని అరిచింది.
15 అప్పుడు యాజకుడైన యెహోయాదా, సైన్యం మీద నియమించబడిన శతాధిపతులకు+ ఇలా ఆజ్ఞాపించాడు: “పంక్తుల మధ్య నుండి ఆమెను బయటికి తీసుకెళ్లండి, ఎవరైనా ఆమె వెనక వస్తే వాళ్లను కత్తితో చంపండి!” అయితే, “యెహోవా మందిరంలో ఆమెను చంపొద్దు” అని అతను చెప్పాడు.
16 దాంతో వాళ్లు ఆమెను పట్టుకొని, రాజభవనంలోకి+ గుర్రాలు ప్రవేశించే చోటికి తీసుకొచ్చి ఆమెను చంపారు.
17 తర్వాత యెహోయాదా, యెహోవా ప్రజలుగా కొనసాగుతామని యెహోవాకు, రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒప్పందం చేయించాడు.+ అంతేకాదు రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒప్పందం చేయించాడు.+
18 తర్వాత ఆ దేశ ప్రజలందరూ బయలు గుడికి వచ్చి దాని బలిపీఠాల్ని పడగొట్టారు,+ దాని విగ్రహాల్ని ముక్కలుముక్కలు చేశారు;+ బయలు పూజారైన మత్తానును బలిపీఠాల ఎదురుగా చంపారు.+
తర్వాత యాజకుడు యెహోవా మందిరం మీద పర్యవేక్షకుల్ని నియమించాడు.+
19 అంతేకాదు, రాజును యెహోవా మందిరం నుండి తీసుకురావడానికి అతను శతాధిపతుల్ని,+ రాజ అంగరక్షకుల్ని, రాజభవన కాపలాదారుల్ని,+ దేశ ప్రజలందర్నీ పిలిపించాడు. వాళ్లు రాజును రాజభవన కాపలాదారుల ద్వారం గుండా రాజభవనంలోకి తీసుకొచ్చారు, అతను రాజుల సింహాసనం మీద కూర్చున్నాడు.+
20 అతల్యా, రాజభవనం దగ్గర కత్తితో చంపబడింది కాబట్టి దేశ ప్రజలందరూ సంతోషించారు, నగరం ప్రశాంతంగా ఉంది.
21 యెహోయాషు+ రాజైనప్పుడు అతనికి ఏడేళ్లు.+
అధస్సూచీలు
^ అక్ష., “రాజ్య విత్తనం.”
^ అక్ష., “పరుగెత్తేవాళ్ల.”
^ అంటే, 100 మంది మీద అధిపతులు.
^ లేదా “సంధి.”
^ అక్ష., “అతను బయటికి వెళ్లినప్పుడు, అతను లోపలికి వచ్చినప్పుడు.”