ఏప్రిల్ 6-12
2020, ఏప్రిల్ 7, మంగళవారం—క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ
ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, చాలామంది క్రైస్తవులు యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చూపించిన సాటిలేని ప్రేమ గురించి ధ్యానిస్తారు. (యోహా 3:16; 15:13) యెరూషలేములో యేసు చేసిన చివరి పరిచర్య గురించి సువార్త పుస్తకాలు ఏం చెప్తున్నాయో మీరు ఈ చార్టును ఉపయోగించి పరిశీలించవచ్చు. యేసే మార్గం, సత్యం, జీవం పుస్తకంలోని 6వ భాగంలో ఆ సంఘటనల గురించి ఉంది. దేవుడు, క్రీస్తు చూపించిన ప్రేమ మీరు ఏం చేసేలా పురికొల్పుతుంది?—2కొ 5:14, 15; 1యో 4:16, 19.
యెరూషలేములో యేసు చివరి పరిచర్య
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
33, నీసాను 8 (ఏప్రిల్ 1-2, 2020) |
బేతనియ |
పస్కాకు ఆరు రోజుల ముందు యేసు వచ్చాడు |
|
|
|
|
నీసాను 9 (ఏప్రిల్ 2-3, 2020) |
బేతనియ |
మరియ యేసు తలమీద, పాదాలమీద పరిమళ తైలం పోసింది |
|
|||
బేతనియ-బేత్పగే-యెరూషలేము |
జయజయ ధ్వనుల మధ్య గాడిద మీద యెరూషలేముకు వచ్చాడు |
|||||
నీసాను 10 (ఏప్రిల్ 3-4, 2020) |
బేతనియ-యెరూషలేము |
అంజూర చెట్టును శపించాడు; ఆలయాన్ని ఇంకోసారి శుభ్రం చేశాడు |
|
|||
యెరూషలేము |
యేసును చంపడానికి ముఖ్య యాజకుల, శాస్త్రుల కుట్ర |
|
|
|||
యెహోవా మాట్లాడాడు; యేసు తన మరణాన్ని ప్రవచించాడు; యూదులు నమ్మకపోవడం యెషయా ప్రవచనాన్ని నెరవేర్చింది |
|
|
|
|||
నీసాను 11 (ఏప్రిల్ 4-5, 2020) |
బేతనియ-యెరూషలేము |
ఎండిపోయిన అంజూర చెట్టు నుండి పాఠం |
|
|
||
యెరూషలేము, ఆలయం |
ఆయన అధికారాన్ని ప్రశ్నించారు; ఇద్దరు కుమారుల ఉదాహరణ |
|
||||
ఉదాహరణలు: హంతకులైన రైతులు, వివాహ విందు |
|
|||||
పునరుత్థానం, దేవుడు-కైసరు, అతి ముఖ్యమైన ఆజ్ఞ గురించిన ప్రశ్నలకు జవాబిచ్చాడు |
|
|||||
క్రీస్తు దావీదు కుమారుడా అని ప్రజల్ని అడిగాడు |
|
|||||
శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమలు |
|
|||||
విధవరాలి విరాళాన్ని గమనించాడు |
|
|
||||
ఒలీవల కొండ |
భవిష్యత్తు ప్రత్యక్షత సూచన ఇచ్చాడు |
|
||||
ఉదాహరణలు: పదిమంది కన్యలు, తలాంతులు, గొర్రెలు-మేకలు |
|
|
|
|||
నీసాను 12 (ఏప్రిల్ 5-6, 2020) |
యెరూషలేము |
ఆయన్ని చంపడానికి యూదా అధికారుల కుట్ర |
|
|||
యేసును అప్పగించడానికి యూదా ఏర్పాట్లు |
|
|||||
నీసాను 13 (ఏప్రిల్ 6-7, 2020) |
యెరూషలేము దగ్గర్లో, యెరూషలేములో |
చివరి పస్కాకు సిద్ధపడడం |
|
|||
నీసాను 14 (ఏప్రిల్ 7-8, 2020) |
యెరూషలేము |
అపొస్తలులతో కలిసి పస్కా భోజనం చేశాడు |
|
|||
అపొస్తలుల పాదాలు కడిగాడు |
|
|
|
|||
యేసు యూదాను ద్రోహి అని స్పష్టం చేసి, పంపించేశాడు |
||||||
ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు (1కొ 11:23-25) |
|
|||||
పేతురు తానెవరో తెలీదంటాడని, అపొస్తలులు చెదిరిపోతారని ప్రవచించాడు |
||||||
సహాయకుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశాడు; నిజమైన ద్రాక్షచెట్టు ఉదాహరణ; ప్రేమించాలని ఆజ్ఞాపించాడు; అపొస్తలులతో చివరి ప్రార్థన |
|
|
|
|||
గెత్సేమనే |
తోటలో వేదన; యేసును అప్పగించడం, బంధించడం |
|||||
యెరూషలేము |
అన్న ప్రశ్నించాడు; కయప, మహాసభ విచారణ; పేతురు ఆయనెవరో తెలీదన్నాడు |
|||||
నమ్మకద్రోహి యూదా ఉరి వేసుకున్నాడు (అపొ 1:18, 19) |
|
|
|
|||
ముందు పిలాతు దగ్గరికి, తర్వాత హేరోదు దగ్గరికి, తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు |
||||||
పిలాతు ఆయన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కానీ యూదులు బరబ్బను అడిగారు; హింసాకొయ్య మీద మరణశిక్ష విధించారు |
||||||
(దాదాపు మధ్యాహ్నం 3:00 గంటలు) |
గొల్గొతా |
హింసాకొయ్య మీద చనిపోయాడు |
||||
యెరూషలేము |
మృతదేహాన్ని కొయ్య నుండి దించి సమాధిలో పెట్టారు |
|||||
నీసాను 15 (ఏప్రిల్ 8-9, 2020) |
యెరూషలేము |
యాజకులు, పరిసయ్యులు సమాధికి కాపలా పెట్టి, దానికి ముద్రవేశారు |
|
|
|
|
నీసాను 16 (ఏప్రిల్ 9-10, 2020) |
యెరూషలేము, దాని పరిసర ప్రాంతం; ఎమ్మాయు |
యేసు పునరుత్థానం చేయబడ్డాడు; శిష్యులకు ఐదుసార్లు కనిపించాడు |
||||
నీసాను 16 తర్వాత |
యెరూషలేము; గలిలయ |
శిష్యులకు ఇంకొన్నిసార్లు కనిపించాడు (1కొ 15:5-7; అపొ 1:3-8); నిర్దేశాలిచ్చాడు; శిష్యుల్ని చేయమని ఆజ్ఞాపించాడు |
|
|