మన క్రైస్తవ జీవితం
క్రీస్తును దగ్గరగా అనుసరించండి
యేసు మనం అనుసరించడానికి మంచి మాదిరి ఉంచాడు, ముఖ్యంగా శ్రమలను లేదా హింసలను అనుభవిస్తున్నప్పుడు ఆయన మనకు మంచి మాదిరి. (1 పేతు 2:21-23) యేసు అవమానించబడి బాధను అనుభవిస్తున్నా ఆయన ఎప్పుడూ ఎదురుతిరిగి కక్ష తీర్చుకోలేదు. (మార్కు 15:29-32) తట్టుకోవడానికి ఆయనకు ఏమి సహాయం చేసింది? ఆయన యెహోవా చిత్తం చేయాలని నిశ్చయించుకున్నాడు. (యోహా 6:38) ఆయన “తన ముందు ఉంచబడిన సంతోషం” మీద మనసు పెట్టాడు.—హెబ్రీ 12:2.
మన విశ్వాసాన్ని బట్టి అవమానించబడినప్పుడు మనం ఎలా స్పందిస్తాము? ఎవరైనా వాళ్లకు చెడు చేస్తే నిజక్రైస్తవులు “తిరిగి వాళ్లకు చెడు” చేయరు. (రోమా 12:14, 17) యేసు బాధల్ని అనుభవించిన విధానాన్ని మనం అనుకరిస్తే దేవుని అంగీకారం ఉంటుంది కాబట్టి మనం సంతోషంగా ఉండవచ్చు.—మత్త 5:10-12; 1 పేతు 4:12-14.
యెహోవా పేరు అన్నిటికన్నా ముఖ్యం అనే వీడియో చూసి తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
సిస్టర్ గెర్‌ట్రూట్ * ఒంటరిగా చెరసాలలో ఉన్నప్పుడు తన సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకుంది?
-
బ్రదర్, సిస్టర్ పోయట్‌సింగర్‌లు వేర్వేరు కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఉండగా ఎలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చింది?
-
తట్టుకోవడానికి వాళ్లకు ఏమి సహాయం చేసింది?
^ పేరా 6 ఆ పేరును పోట్‌జింగర్ అని కూడా పిలుస్తారు.