జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ మార్చి 2018
ఇలా మాట్లాడవచ్చు
మెమోరియల్ ఇన్విటేషన్ క్యాంపెయిన్, ఈ ప్రశ్నల ఆధారంగా సంభాషణలు: యేసు ఎందుకు చనిపోయాడు? విమోచనా క్రయధనం వల్ల ఏమి సాధ్యం అయింది?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”
ఆరాధనకు సంబంధించిన పనుల్లో, మనకు ఎక్కువగా గుర్తింపు, ఘనత తెచ్చే వాటినే చేయడానికి ప్రయత్నిస్తున్నామా? వినయంగల సేవకుడు ఎక్కువగా యెహోవా దేవునికి మాత్రమే కనిపించే పనులు చేస్తాడు.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి
బైబిల్లో యేసు చెప్పిన రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి? మనం వాటికి లోబడుతున్నామని ఎలా చూపించవచ్చు?
మన క్రైస్తవ జీవితం
దేవునిపట్ల, సాటిమనుషులపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?
మనం దేవున్ని, మన తోటివాళ్లను ప్రేమించాలి. ముఖ్యంగా ప్రతీ రోజు బైబిల్ని చదవడం ద్వారా ఇలాంటి ప్రేమను వృద్ధి చేసుకోవచ్చు.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
చివరి రోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి
ఈ రోజుల్లో చాలామంది జీవితానికి సంబంధించిన సాధారణ విషయాల్లో మునిగిపోయి ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టేశారు. ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్న క్రైస్తవులు ఎలా వేరుగా ఉన్నారు?
మన క్రైస్తవ జీవితం
ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం
మనం అంతానికి దగ్గర్లో ఉన్నామని యేసు మాటలు ఎలా చూపిస్తున్నాయి? ఈ ప్రశ్న గురించి మరెన్నో ప్రశ్నల గురించి ‘ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం’ అనే వీడియోలో తెలుసుకోండి.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అప్రమత్తంగా ఉండండి”
పదిమంది కన్యల ఉపమానంలో ఉన్న పెళ్లికొడుకు, బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యలు ఎవరు? ఈ ఉపమానం మీకు ఏ పాఠాన్ని నేర్పిస్తుంది?
మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పించడం
మొదటినుండే మనం మన విద్యార్థులకు బైబిలు స్టడీ కోసం సిద్ధపడి ఉండడం అలవాటు చేయాలి. ఎలా?