మన క్రైస్తవ జీవితం
మద్యం విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి
మద్యం తాగే విషయంలో క్రైస్తవులందరూ ఆత్మనిగ్రహం చూపించాలి. (సామె 23:20, 29-35; 1కొ 6:9, 10) ఒక క్రైస్తవుడు మద్యం తాగాలనుకుంటే, అతను దాన్ని మితంగా తీసుకోవాలి. అంతేకాదు అతను దానికి అలవాటు పడకూడదు, ఇతరులకు అభ్యంతరకరంగా మారకూడదు. (1కొ 10:23, 24; 1తి 5:23) మద్యం తాగమని మనం ఎవ్వర్నీ బలవంతపెట్టకూడదు. ముఖ్యంగా యౌవనుల్ని అలా ఒత్తిడి చేయకూడదు.
తాగే ముందు క్షణమాగి ఆలోచించండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
మద్యం తాగడానికి సంబంధించిన నియమాలను క్రైస్తవులందరూ ఎందుకు పాటించాలి?—రోమా 13:1-4
-
మద్యం తాగమని ఎవరైనా మనల్ని బలవంతపెడితే ఏం చేయాలి?—రోమా 6:16
-
మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను ఎలా తప్పించుకోవచ్చు?