చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
ఉత్సాహంగా బోధించండి
ఉత్సాహంగా ఉన్నవాళ్లను చూస్తే మనకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా మాట్లాడినప్పుడు ప్రజలు మనం చెప్పేది ఆసక్తిగా వింటారు. ఆ విధంగా మాట్లాడడం ద్వారా మనం చెప్పే సందేశం విలువైనదని చూపిస్తాం. మన సంస్కృతి ఏదైనా, మనం ఎలాంటి వాళ్లమైనా ఉత్సాహంగా ఉండడం నేర్చుకోవచ్చు. (రోమా 12:11) ఎలా?
ముందుగా మీరు చెప్పే సందేశం ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోండి. “మంచి విషయాల గురించిన మంచివార్తను ప్రకటించే” అవకాశాన్ని మీరు పొందారు. (రోమా 10:15) రెండవదిగా, మంచివార్త ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరుస్తుందో ఆలోచించండి. మీరు చెప్పే విషయాలు వాళ్లకు చాలా అవసరం. (రోమా 10:13, 14) చివరిగా, మీ హావభావాలలో ఉత్సాహం చూపిస్తూ మాట్లాడండి.
శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ఉత్సాహంగా బోధించడం వీడియో చూపించండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
జాస్మిన్ స్టడీ విషయంలో నీతాకు ఉత్సాహం ఎందుకు తగ్గిపోయింది?
-
నీతాలో మళ్లీ ఏది ఉత్సాహం నింపింది?
-
వినేవాళ్లలో ఉన్న మంచి లక్షణాలను మనమెందుకు చూడాలి?
-
మనం చూపించే ఉత్సాహం వల్ల మన బైబిలు విద్యార్థులు, ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?