కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్త లోకం రాబోతుంది

కొత్త లోకం రాబోతుంది
  1. 1. మనసుకు చూపు తన రాజ్యం

    భయమే గుర్తుకేరాని లోయలో

    పరుగులు తీస్తాం

    భయాందోళనంతా మాయమయ్యే

    కలియతిరుగు అడవంతా

    రుతువుల్ని సహా ఆశీర్వదిస్తూ

    వరమిచ్చాడు తండ్రే

    కలలు కన్న శాంతి చూస్తున్నా

    ప్రేమంటే చూస్తా

    ప్రభువు రాజ్యంలో నిత్యం

    కొత్త లోకం చూద్దాం!

    (పల్లవి)

    ఆశే కదా నీ శ్వాస

    కలకాదులే నీ అభిలాష

    నీ ప్రతి కోరిక తీరిందని

    ఊహిస్తూ కీర్తిద్దాం

    కొత్త లోకం చూద్దాం!

  2. 2. మనసుతో చూడు మన ఇల్లు

    సెలయేళ్లు, నెమళ్లు, భలే వింతలు

    అది నీది కాదా?

    అటు చూడు ఎవరు వచ్చారో

    ఎదురుచూశావుగా

    మదిలో నిరీక్షణే ఇలా

    ఎదురొచ్చి నిల్చే

    కబుర్లు ఎన్నో చెప్పుకోవాలి ఇక

    మళ్లీ చూస్తాము

    ఆత్మీయులందర్నీ

    కొత్త లోకం చూద్దాం!

    (పల్లవి)

    ఆశే కదా నీ శ్వాస

    కలకాదులే నీ అభిలాష

    నీ ప్రతి కోరిక తీరిందని

    ఊహిస్తూ కీర్తిద్దాం

    కొత్త లోకం చూద్దాం!

    (బ్రిడ్జ్‌)

    యెహోవా మాటిచ్చాక

    పరదైసునే చేసివ్వడా

    చివరి కోరికంటూ

    మిగిలి ఉండిపోదు ఏ ప్రాణికీ

    (పల్లవి)

    ఆశే కదా నీ శ్వాస

    కలకాదులే నీ అభిలాష

    నీ ప్రతి కోరిక తీరిందని

    ఊహిస్తూ కీర్తిద్దాం

    కొత్త లోకం చూద్దాం!

    కొత్త లోకం చూద్దాం!

    కొత్త లోకం చూద్దాం!

    కొత్త లోకం చూద్దాం!