కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 37

ప్రేరేపిత లేఖనాలు ప్రయోజనకరమైనవి

ప్రేరేపిత లేఖనాలు ప్రయోజనకరమైనవి

(2 తిమోతి 3:16, 17)

1. జ్యోతియై దేవుని వాక్యం

చీకట్లో చూపున్‌ దారి.

సాగితే సత్య బాటలో

స్వాతంత్ర్యము ఇస్తుందది.

2. వాక్యము దైవప్రేరితం

సత్యాన్ని బోధిస్తుంది.

జీవితం సరిచేస్తుంది

శిక్షణ ఇస్తుంది అది.

3. దేవుని ప్రేమను గూర్చి

వాక్యము నేర్పిస్తుంది.

ధ్యానిస్తే జ్ఞానాన్నిస్తుంది

జీవ మార్గం చూపిస్తుంది.

(కీర్త. 119:105; సామె. 4:13 కూడా చూడండి.)