కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 29

యథార్థంగా జీవించడం

యథార్థంగా జీవించడం

(26 వ కీర్తన)

1. తీర్పునిమ్ము, ప్రభువా యెహోవా

నిన్నే నమ్ముకున్నా, యథార్థంగా ఉన్నా.

పరీక్షించు నా హృదయమును

నాలోవుంటే చెడు తీసివేయి దేవా.

(పల్లవి)

నేమాత్రము నిశ్చయించుకున్నా,

యథార్థముగానే నడుస్తాను సదా.

2. నే చేయను దుష్టులతో స్నేహం

పాపుల సాంగత్యం అసహ్యము నాకు.

మూర్ఖులతో భక్తిహీనులతో

నా ప్రాణం చేర్చకు, నన్ను కరుణించు.

(పల్లవి)

నేమాత్రము నిశ్చయించుకున్నా,

యథార్థముగానే నడుస్తాను సదా.

3. ప్రేమిస్తాను నీ మందిరమును

చేస్తాను నిత్యము శుద్ధారాధనను.

నీ ప్రేమను చాటిస్తానంతటా.

బలిపీఠం చుట్టూ తిరుగుతా నేను.

(పల్లవి)

నేమాత్రము నిశ్చయించుకున్నా,

యథార్థముగానే నడుస్తాను సదా.

(కీర్త. 25:2 కూడా చూడండి.)