పాట 41
యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి
1. ఓ ప్రియమైన యౌవనులారా
మీరంటే యెహోవాకెంతో ఇష్టం.
మీ కుటుంబం, స్నేహితుల ద్వారా
ప్రేమ చూపిస్తున్నాడు నిరతం.
2. మీ తల్లిదండ్రుల్ని గౌరవించి
చోటివ్వకండి వివాదాలకు.
పొందితే అందరి మన్ననల్ని
మీ యౌవనాన్ని ఆనందిస్తారు.
3. దేవుణ్ణి స్మరించండి ఇప్పుడే
నేర్చుకోండి సత్యాన్నెక్కువగా.
దైవానుగ్రహం కోసం శ్రమిస్తే
ఎంతో సంతోషిస్తాడు యెహోవా.
(కీర్త. 71:17; విలా. 3:27; ఎఫె. 6:1-3 కూడా చూడండి.)