కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 15

సృష్టి దేవుని మహిమను వెల్లడిచేస్తోంది

సృష్టి దేవుని మహిమను వెల్లడిచేస్తోంది

(19 వ కీర్తన)

1. సృష్టికర్త యెహోవా మా దేవా

అద్భుతము నీ సృష్టికార్యాలు.

మిలమిలా మెరిసే తారలు

నింగిలోని నక్షత్రవీధులు

ఇస్తున్నాయి మౌనంగా సాక్ష్యము

నీవేనని జ్ఞానమహిమలు.

2. సూర్యచంద్ర నక్షత్రములను

వాటివాటి స్థానాల్లో ఉంచావు.

నిరంతరం పొంగే జలాలకు

విధించావు హద్దులను నీవు.

ధూళివంటి మమ్ము లక్ష్యపెట్టే

నీకు సదా కృతజ్ఞులం మేము.

3. నీ సూత్రాలు పవిత్రమైనవి

రోజూ గుర్తుచేస్తావు వాటిని.

బంగారము వెండికన్నా అవి

మరి ఎంతో ప్రశస్తమైనవి.

జీవమును, జ్ఞానాన్నిస్తాయవి

ఎల్లప్పుడు పాటిస్తాం వాటిని.

(కీర్త. 12:6; 89:7; 144:3; రోమా. 1:20 కూడా చూడండి.)