కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 7

యెహోవా, మన బలం

యెహోవా, మన బలం

(యెషయా 12:2)

  1. 1. యెహోవా దేవా, సర్వశక్తుడా,

    సాక్షులమై ఉంటాం నీ పక్షాన.

    జనం గర్వంతో విస్మరించినా,

    ప్రకటిస్తూ ఉంటాము మానక.

    (పల్లవి)

    యెహోవా, నీవే మా ఆశ్రయము;

    రేయింబవళ్లు కీర్తిస్తాము.

    మేం జీవిస్తాము నీ నీడలోనే,

    రక్షణాధారము మాకు నీవే.

  2. 2. వెదుకుతాం సత్యం నీ వాక్యంలో;

    నీవిచ్చే ఆజ్ఞలు మేం పాటిస్తాం.

    నడుస్తాం మేము సత్యమార్గంలో;

    రాజ్యానికే మేము మద్దతిస్తాం.

    (పల్లవి)

    యెహోవా, నీవే మా ఆశ్రయము;

    రేయింబవళ్లు కీర్తిస్తాము.

    మేం జీవిస్తాము నీ నీడలోనే,

    రక్షణాధారము మాకు నీవే.

  3. 3. మమ్ము సాతాను విరోధించినా,

    తుదముట్టించ ప్రయత్నించినా,

    ధైర్యం కోల్పోకుండా చూడు దేవా;

    శక్తినివ్వు నీ పక్షాన్నుండేలా.

    (పల్లవి)

    యెహోవా, నీవే మా ఆశ్రయము;

    రేయింబవళ్లు కీర్తిస్తాము.

    మేం జీవిస్తాము నీ నీడలోనే,

    రక్షణాధారము మాకు నీవే.