మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తే ఏం చేయవచ్చు?
అందరికీ దూరం అయినట్టు, ఒంటరిగా ఉన్నట్టు మీకు అనిపిస్తోందా? ఈ పరిస్థితిలో మీరు కూడా కీర్తనకర్తలాగే ఇలా అనుకుంటుండవచ్చు: “నేను ఇంటి పైకప్పు మీదున్న ఒంటరి పక్షిలా ఉన్నాను.” (కీర్తన 102:7) ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు బైబిల్లోని తెలివైన సలహాలు మీకు సహాయం చేస్తాయి.
దేవునితో మీకున్న సంబంధాన్ని బలపర్చుకోండి
మీరు ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేవున్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే సంతోషంగా ఉండవచ్చు. (మత్తయి 5:3, 6) అలా తెలుసుకోవడానికి ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ విషయాలు మీకు సహాయం చేస్తాయి.
ఖచ్చితంగా, చదవడానికి తేలిగ్గా ఉండే ఆన్లైన్ బైబిలు
ముఖ్యమైన బైబిలు బోధలను వివరించే చిన్న వీడియోలు
“బైబిలు ప్రశ్నలకు జవాబులు”—చాలామంది అడిగే ప్రశ్నలకు సూటైన జవాబులు
“వాళ్లలా విశ్వాసం చూపించండి”—ఇందులోని ఆర్టికల్స్, బైబిలు కాలాల్లోని నమ్మకమైన స్త్రీపురుషుల జీవితాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తాయి
“సృష్టిలో అద్భుతాలు”—ఇందులోని ఆర్టికల్స్ ప్రకృతి అందాల్ని, అవి ఎంతో తెలివిగా సృష్టించబడిన విధానాన్ని వివరిస్తాయి
ఓదార్పునిచ్చే బైబిలు లేఖనాలు చదవండి
ఈ కిందున్న లేఖనాలు ఎంతోమందికి ఓదార్పునిచ్చాయి. ఒకేసారి ఎక్కువ అధ్యాయాల్ని చదవకండి; ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సమయం తీసుకుని నిదానంగా చదవండి, అందులోని విషయాల్ని ధ్యానించండి, ప్రార్థించండి.—మార్కు 1:35.
లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయో తెలుసుకోండి
లోకంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయో, దేవుడు వాటిని ఎలా సరిచేస్తాడో తెలుసుకుంటే మీరు ఎలాంటి కష్ట సమయాల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతారు.—యెషయా 65:17.
అనవసరంగా ఆందోళన పడకండి
ఒంటరిగా ఉండడం వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించడానికి, ‘ఆందోళన పడడం మానేయడానికి’ ఈ కిందున్న ఆర్టికల్స్ మీకు సహాయం చేస్తాయి.—మత్తయి 6:25.
స్నేహాల్ని బలపర్చుకోండి
సరిగ్గా ఆలోచించడానికి, సంతోషంగా ఉండడానికి స్నేహితులు సహాయం చేస్తారు. ముఖ్యంగా, ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ల సహాయం చాలా అవసరం. మీరు ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారా? అయితే, వీడియో కాల్స్ ద్వారా మీ స్నేహాల్ని బలపర్చుకోవచ్చు, కొత్త స్నేహాల్ని ఏర్పర్చుకోవచ్చు. నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడానికి, మీరు కూడా ఒక ‘నిజమైన స్నేహితునిగా’ ఉండడానికి ఈ కింది ఆర్టికల్స్ సహాయం చేస్తాయి.—సామెతలు 17:17.
వ్యాయామం చేయండి
‘వ్యాయామం ప్రయోజనకరం’ అని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 4:8, అధస్సూచి) ముఖ్యంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఆలోచించడానికి, సంతోషంగా ఉండడానికి వ్యాయామం అవసరం. ఒకవేళ మీరు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా, మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి ఇంట్లోనే కొన్ని పనులు చేయవచ్చు.