కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ilbusca/E+ via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

శాంతిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం?—బైబిలు ఏం చెప్తుంది?

శాంతిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం?—బైబిలు ఏం చెప్తుంది?

 ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు శాంతిని తీసుకురాలేకపోతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, నేడు మన రోజుల్లో గొడవలు, యుద్ధాలు ఎప్పుడూ లేనంత ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 200 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది యుద్ధాలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

 శాంతిని తీసుకురావడం మనుషుల వల్ల ఎందుకు సాధ్యం కావట్లేదు? దీని గురించి బైబిలు ఏం చెప్తుంది?

మనుషులు శాంతిని తీసుకురాలేకపోవడానికి మూడు కారణాలు

  1.  1. ప్రజల ఆలోచనా తీరు, ప్రవర్తన శాంతిని కోరుకునే విధంగా లేదు. మనకాలంలో ఇలాంటి మనుషులు ఉంటారని బైబిలు ముందే చెప్పింది: “తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, . . . విశ్వసనీయంగా ఉండనివాళ్లు, . . . మొండివాళ్లు, . . . ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, . . . మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు.”—2 తిమోతి 3:2-4.

  2.  2. సృష్టికర్త అయిన యెహోవా a దేవుని సహాయం లేకుండా మనుషులు ఒంటరిగానైనా, కలిసికట్టుగానైనా తమ సమస్యల్ని పరిష్కరించలేరు, వాళ్లకు ఆ సామర్థ్యం లేదు. బైబిలు ఇలా చెప్తుంది: “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి [అంటే, మనిషికి] లేదు.”—యిర్మీయా 10:23.

  3.  3. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నది దుష్టుడైన సాతాను. అతను చాలా శక్తిమంతుడు, క్రూరుడు. అతని ప్రభావం లోకం మీద చాలా ఉంది. సాతాను “లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (ప్రకటన 12:9) ఈ “లోకమంతా దుష్టుని గుప్పిట్లో” ఉన్నంత కాలం యుద్ధాలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి.—1 యోహాను 5:19.

శాంతిని తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యం అవుతుంది?

 భూమ్మీద శాంతిగా ఉండే పరిస్థితులు వస్తాయని బైబిలు చెప్తుంది. అయితే అది మనుషుల వల్ల కాదు, దేవుని వల్లే సాధ్యమౌతుంది.

  •   “‘నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను. మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’ అని యెహోవా అంటున్నాడు.”—యిర్మీయా 29:11.

 దేవుడు దాన్ని ఎలా సాధ్యం చేస్తాడు? ‘శాంతిని అనుగ్రహించే దేవుడు సాతానును చితకతొక్కిస్తాడు.’ (రోమీయులు 16:20) ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకురావడానికి దేవుడు పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని స్థాపించాడు. బైబిలు దాన్ని “దేవుని రాజ్యం” అని పిలుస్తుంది. (లూకా 4:43) ఆ రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు, శాంతిగా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పిస్తాడు.​—యెషయా 9:6, 7.

a యెహోవా అనేది దేవుని పేరు.​—కీర్తన 83:18.