కంటెంట్‌కు వెళ్లు

2022, డిసెంబరు 28న రామపో టౌన్‌ బోర్డ్‌ జరుపుకున్న మీటింగ్‌

జనవరి 9, 2023
ప్రపంచ వార్తలు

ప్రపంచ ప్రధాన కార్యాలయాల ప్రాజెక్ట్‌ రామపో

రామపో టౌన్‌ బోర్డ్‌ ఒక ప్రత్యేక పర్మిట్‌ని ఆమోదించింది

రామపో టౌన్‌ బోర్డ్‌ ఒక ప్రత్యేక పర్మిట్‌ని ఆమోదించింది

2022, డిసెంబరు 28న రామపో టౌన్‌ బోర్డ్‌ ఒక ప్రత్యేక పర్మిట్‌ని ఆమోదించింది. a రామపో నిర్మాణ ప్రాజెక్ట్‌ పనులు ఆలస్యం అవ్వకుండా ముందుకెళ్లడానికి ఆ పర్మిట్‌ సహాయం చేస్తుంది. దానివల్ల మనకు అవసరమయ్యే ఆఫీసు బిల్డింగ్‌లను, స్టూడియోలను, ఇళ్లను కట్టుకోవడానికి ఆ స్థలాన్ని ఉపయోగించవచ్చు. అక్కడున్న చెట్లను కూడా తీసేయవచ్చు. ఇదంతా అధికారులు సైట్‌ ప్లాన్‌కి అనుమతిని ఇవ్వకముందే జరిగింది. బహుశా 2023 చివర్లో మనకు ఆ అనుమతి కూడా వస్తుందని ఎదురుచూస్తున్నాం.

నిర్మాణ ప్రాజెక్ట్‌ కమిటీలో పని చేస్తున్న బ్రదర్‌ డేవిడ్‌ సోటో ఇలా చెప్తున్నారు: “మాకు ఈ ప్రత్యేక పర్మిట్‌ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణ పనులు మొదలవ్వడానికి ముందు చేయాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి కానీ మేము చేసే ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా దీవిస్తాడనే నమ్మకం మాకు ఉంది.”

రామపో నిర్మాణ ప్రాజెక్ట్‌ టైమ్‌లైన్‌

  1. అక్టోబరు 5, 2019

    ఆడియో-వీడియోకు సంబంధించిన పనులన్నీ ఒకే చోట జరిగేలా రామపోలో ఉన్న స్థలంలో ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్టు పరిపాలక సభ ప్రకటించింది

  2. జూన్‌ 26, 2020

    రామపో టౌన్‌ బోర్డ్‌ దగ్గర అధికారికంగా రిక్వెస్ట్‌ పెట్టుకున్నాం

  3. జూలై 8, 2020

    రామపో టౌన్‌ బోర్డ్‌తో మొదటిసారి ఈ ప్రాజెక్ట్‌ గురించి మీటింగ్‌ జరిగింది

  4. మార్చి 31, 2021

    ఈ నిర్మాణం వల్ల పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించే ఒక డాక్యుమెంట్‌ని సబ్‌మిట్‌ చేశాం

  5. మార్చి 8, 2022

    రామపోలో మన స్థలానికి వెళ్లే దారిని ఇంకా పెద్దగా చేయడానికి, అవసరమైన మార్పులు చేయడానికి టక్సీడో టౌన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ అనుమతిని ఇచ్చింది

  6. మార్చి 12, 2022

    ఈ ప్రాజెక్ట్‌ వల్ల పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించే ఫైనల్‌ డాక్యుమెంట్‌ని ఆమోదించారు

  7. నవంబరు 9, 2022

    రామపో టౌన్‌ బోర్డ్‌ మన స్థలాన్ని ఆఫీసుల కోసం, ఇళ్ల కోసం ఉపయోగించడానికి వీలుగా ఒక కొత్త జోన్‌ని ఆమోదించింది

  8. డిసెంబరు 28, 2022

    ఆఫీసులను, ఇళ్లను కట్టుకోవడానికి, చెట్లను తీసేయడానికి రామపో టౌన్‌ బోర్డ్‌ ఒక ప్రత్యేక పర్మిట్‌ని ఆమోదించింది

  9. ఇంకా జరగాల్సింది

    మొత్తం సైట్‌ ప్లాన్‌ని ఆమోదించడం

a 2022, నవంబరు 9న రామపో టౌన్‌ బోర్డ్‌ తీసుకున్న నిర్ణయం తర్వాత మనకి ఈ ఆమోదం వచ్చింది. దానివల్ల ఒకేసారి ప్రత్యేక పర్మిట్‌ కోసం, సైట్‌ ప్లాన్‌ ఆమోదం కోసం అప్లై చేసుకోగలిగాం.