ఆగస్టు 26, 2022 | 2023, మార్చి 8న అప్‌డేట్ అయిన సమాచారం
రష్యా
అప్‌డేట్—శిక్షల్లో మార్పు వచ్చింది | హింసను ఎదుర్కొంటున్నా ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నారు
2023, మార్చి 1న స్టావ్రోపోల్ టెరిటరీ కోర్ట్ అనాటోలి గ్యెజీక్, ఆయన భార్య ఇరినా అలాగే బ్రదర్ విక్టర్ జిమోవ్‌స్కీల కేసులో తీర్పును ప్రకటించింది. అంతకుముందు అనాటోలికి, విక్టర్‌కి పడిన శిక్షల్ని మార్చి ఇప్పుడు వాయిదా పద్ధతిలో జైలు శిక్ష విధించారు. అనాటోలి ఇప్పుడు దిద్దుబాటు చర్యగా వెట్టిచాకిరి చేయాల్సిన అవసరం లేదు. విక్టర్‌ని వెంటనే జైలు నుండి విడుదల చేశారు. ఇరినాకు అంతకుముందు విధించిన వాయిదా పద్ధతిలో జైలు శిక్షే కొనసాగుతుంది, దానిలో ఏ మార్పు రాలేదు. ప్రస్తుతానికి ఆమె జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
2022, నవంబరు 14న స్టావ్రోపోల్ టెరిటరీలోని జార్జివెస్కీ సిటీ కోర్టు బ్రదర్ అనాటోలిని, ఆయన భార్య ఇరినాని అలాగే బ్రదర్ విక్టర్‌ని నేరస్థులుగా తీర్పు తీర్చింది. అనాటోలీకు దిద్దుబాటు చర్యగా నాలుగు సంవత్సరాల రెండు నెలలపాటు వెట్టిచాకిరి చేసే శిక్షను విధించారు. ఇరినాకు వాయిదా పద్ధతిలో నాలుగు సంవత్సరాల రెండు నెలల జైలు శిక్ష పడింది. విక్టర్‌కు ఆరు సంవత్సరాల రెండు నెలల జైలు శిక్షను విధించి, వెంటనే అరెస్ట్ చేశారు.
టైమ్‌లైన్
అక్టోబరు 23, 2019
జార్జివెస్క్‌లోని యెహోవాసాక్షులు ఉన్న మూడు ఇళ్లను పోలీసులు సోదా చేశారు. అలా సోదా చేస్తున్నప్పుడు ఆఫీసర్లే రహస్యంగా వాళ్ల ఇళ్లల్లో కొన్ని వస్తువుల్ని పెట్టి, వాళ్ల మీద నేరారోపణ చేయడానికి, తర్వాత వాటిని ఆధారాలుగా ఉపయోగించారు. అనాటోలి, ఇరినా, విక్టర్‌ల తోపాటు ఇంకో ఎనిమిది మంది సాక్షులను పోలీసులు అరెస్ట్ చేసి, రాత్రంతా విచారణ చేశారు
డిసెంబరు 30, 2019
అనాటోలి, ఇరినా అలాగే విక్టర్‌కి వ్యతిరేకంగా ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశారు
జనవరి 23, 2020
విక్టర్‌ని ఇంకొంత విచారణ చేయడానికి పిలిపించి, కొంత సమయం ఒకచోట నిర్బంధించారు. ఆ తర్వాతి రోజు విచారణ చేయడానికి ముందు, మరో జైలుకి తీసుకెళ్లారు
మార్చి 23, 2020
విక్టర్‌ని ఆ జైలు నుండి విడుదల చేసి హౌస్ అరెస్ట్ చేశారు
మే 6, 2020
విక్టర్‌ని హౌస్ అరెస్ట్ నుండి విడుదల చేసి, ప్రయాణం చేసే విషయంలో ఆంక్షలు పెట్టారు
అక్టోబరు 6, 2021
ప్రయాణం చేసే విషయంలో విక్టర్‌కి పెట్టిన ఆంక్షల్ని ఎత్తేశారు
మార్చి 10, 2022
క్రిమినల్ కేసు కోర్టు మెట్లు ఎక్కింది
ప్రొఫైల్స్
ఈ సహోదర సహోదరీలు ఇవన్నీ సంతోషంగా, ఒక ఆశతో సహించడం చూసినప్పుడు, యెహోవా ఎల్లప్పుడూ ‘తనకు మొరపెట్టే వాళ్లందరికీ దగ్గరగా ఉంటాడు’ అనే మన నమ్మకం బలపడుతుంది.—కీర్తన 145:18.