ఆగస్టు 10, 2022
రష్యా
అప్‌డేట్—సహోదరున్ని నేరస్థునిగా తీర్పుతీర్చారు | కృతజ్ఞత వల్లే విక్టర్ షయపోవ్ కష్టాన్ని కూడా ఇష్టంగా సహించాడు
2022, నవంబరు 7న పెన్జలోని నికొల్‌స్కి జిల్లా కోర్టు సహోదరుడు విక్టర్ షయపోవ్‌ని నేరస్థునిగా తీర్పుతీర్చి, వాయిదా పద్ధతిలో రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ప్రస్తుతానికి ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
టైమ్‌లైన్
ఆగస్టు 19, 2021
తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడనే నెపంతో క్రిమినల్ కేసు పెట్టారు
ఫిబ్రవరి 5, 2022
ఉన్నపళంగా పోలీసులు ఆపారు. అదే రోజు సాయంత్రం ఆయన ఇంటిని సోదా చేశారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని 740 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్జకి తీసుకెళ్లారు
ఫిబ్రవరి 6, 2022
తాత్కాలిక నిర్బంధ కేంద్రంలో పెట్టారు
ఫిబ్రవరి 8, 2022
తాత్కాలిక నిర్బంధ కేంద్రం నుండి విడుదల చేసి, హౌస్ అరెస్ట్ చేశారు
మార్చి 28, 2022
క్రిమినల్ కేసు కోర్టు మెట్లు ఎక్కింది
ప్రొఫైల్
యెహోవా తన విశ్వసనీయ ప్రేమ ద్వారా ఇచ్చే శాంతి మన హృదయాలకు, మనసులకు కాపలా ఉంటున్నందుకు ఎంత ధన్యులమో కదా!—ఫిలిప్పీయులు 4:7.